సినీ న‌టుడు జ‌య‌ప్ర‌కాశ్‌రెడ్డి మృతి ప‌ట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం 

తాడేప‌ల్లి: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, రాయలసీమ యాసతో విలన్ పాత్రల్లో  ఒదిగిపోయే జయప్రకాశ్ రెడ్డి ఇక లేరు. ఈ ఉదయం గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. ఆయ‌న మృతి ప‌ట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంతాపం తెలిపారు. జ‌య‌ప్ర‌కాశ్ కుటుంబ స‌భ్యుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. లాక్‌డౌన్ నుంచి గుంటూరులోనే ఉంటున్న ఆయన ఈ ఉదయం స్నానాల గదిలో కుప్పకూలి  మరణించారు. జయప్రకాశ్ రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని సిరివెళ్ల. 8 మే 1946లో జన్మించిన జయప్రకాశ్‌రెడ్డి వెంకటేశ్ నటించిన బ్రహ్మపుత్రుడు సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమయ్యారు. జయప్రకాశ్ రెడ్డి మృతి విషయం తెలిసి తెలుగు చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top