అబ్బయ్య చౌదరిపై చింతమనేని దాడి

పశ్చిమ గోదావరి: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అరాచకాలకు అంతే లేకుండా పోయింది. ఏకంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరిపై పోలీసుల సమక్షంలోనే దాడికి పాల్పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా వట్లూరు పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రం వద్ద చింతమనేని ప్రభాకర్‌ రెచ్చిపోయారు. వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి అబ్బయ్యచౌదరిపై చింతమనేని దాడికి యత్నించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రం వద్ద ఓటర్లకు టీడీపీ నేతలు ప్రలోభాలకు పాల్పడ్డారు. అడ్డుకునేందుకు అక్కడికి వచ్చిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై దుర్భాషలాడారు. అభ్యంతరం వ్యక్తం చేసిన వైయస్‌ఆర్‌సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. 

 

Back to Top