తుది విడతలోనూ వైయ‌స్ఆర్‌సీపీ విజయదుందుభి  

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ శ్రేణుల సంబ‌రాలు

 

తాడేప‌ల్లి: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో అధికార వైయ‌స్ఆర్ కాంగ్రెస్ విజ‌య‌దుందుభి మోగించింది. ప్ర‌తిప‌క్ష‌ తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. నాలుగు విడ‌త‌ల్లో జ‌రిగిన పంచాయతీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ మద్దతిస్తున్న అభ్యర్థులు ఏమాత్రం ప్రభావం చూపలేక చతికిలపడ్డారు.  ఎన్నికలు జరిగిన 13 జిల్లాలోనూ వైయ‌స్సార్‌సీపీ మద్దతిచ్చిన అభ్యర్థులు ఏకపక్షంగా గెలుపొందడంతో టీడీపీ నాయకులు నిస్తేజంలో మునిగిపోయారు. ఆదివారం నిర్వహించిన తుది ద‌శ పోలింగ్‌లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థులు విజ‌య‌భేరీ మోగిండ‌చంతో తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సంబ‌రాలు చేసుకున్నారు. వేడుక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, అనిల్‌కుమార్‌యాద‌వ్‌, వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లేళ్ల అప్పిరెడ్డి, నాయ‌కులు చిన్న‌ప‌రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.  

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top