26న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అనంత‌పురం జిల్లా పర్యటన

అనంత‌పురం:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎల్లుండి (26.04.2023)  అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో ప‌ర్య‌టించ‌నున్నారు. జగనన్న వసతి దీవెన కార్యక్రమం – లబ్ధిదారుల ఖాతాల్లో వైయ‌స్ జ‌గ‌న్‌ నగదు జమ చేయనున్నారు. 

ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.20 గంటలకు నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. 10.40 – 12.35 గంటల వరకు నార్పల క్రాస్‌రోడ్స్‌ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగం, అనంతరం జగనన్న వసతి దీవెన కార్యక్రమం – లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం, కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top