చంద్రబాబు అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి..

ఢిల్లీలో ‘అవినీతి చక్రవర్తి’పుస్తకం విడుదల 

న్యూఢిల్లీ  చంద్రబాబు అన్ని వ్యవస్థలను దోపిడీ కోసమే వాడుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.. చంద్రబాబు అవినీతిపై వైయస్‌ఆర్‌సీపీ ముద్రించిన ‘అవినీతి చక్రవర్తి’పుస్తకాన్ని ఢిల్లీలో విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నాలుగున్నరేళ్లలో చంద్రబాబు రాష్ట్ర్రాన్ని ఏవిధంగా దోచుకున్నారో ఆధారాలతో సహా ఈ పుస్తకంలో పొందుపర్చామని తెలిపారు.రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మరుగుదొడ్లు నిర్మాణంలో కూడా ఆరువందల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు.ముఖ్యమంత్రి స్థాయి నుంచి కార్యకర్తల వరుకూ రాష్ట్రాన్ని ఏవిధంగా దోచుకున్నారన్నారు. పుస్తకంలో పొందుపర్చిన అంశాలపై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని కోరారు.దేశంలోనే 40 సంవత్సరాల అనుభవం గల  నాయకుడినని,మోదీ కన్నా గొప్పవాడనని, దేశ ప్రయోజనాలు కోసమంటూ ఢిల్లీ చుట్టూ తిరిగే చంద్రబాబు అవినీతి గురించి పార్టీ నాయకులందరికి ఈ పుస్తకాలు అందజేయనున్నట్లు తెలిపారు.అవినీతి చక్రవర్తి పుస్తకం ద్వారా చంద్రబాబు నిజస్వరూపం తెలుస్తుందన్నారు.తన అనుకూల మీడియాను అడ్డంపెట్టుకుని సంక్షేమం కార్యక్రమాలంటూ పబ్లిసిటీ చేసుకుంటారని విమర్శించారు.

 

Back to Top