చంద్రబాబు ప్రజలను భయపెడుతున్నారు..

టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే తీవ్రంగా నష్టపోతాం

చంద్రబాబు తెలంగాణలో ఎందుకు పోటీ చేయడంలేదు

వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేరకపోవడంతోనే టీడీపీ బీజేపీకి దూరం

వైయస్‌ఆర్‌ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు

వైయస్‌ జగన్‌తోనే రాజన్న రాజ్యం సాధ్యం

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత సి.రామచంద్రయ్య

 

అమరావతి:వైయస్‌ఆర్‌ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, చంద్రబాబు పాలనలో  ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత సి.రామచంద్రయ్య అన్నారు.  2004 ఎన్నికల ముందు వైయస్‌ఆర్‌ సీఎం అయితే రౌడీయిజం వస్తుందని చంద్రబాబు ఎన్నికల్లో ప్రచారం చేశారని, వైయస్‌ సీఎం అయ్యాక ఏం జరిగిందో ప్రజలందరికి తెలుసున్నారు. రైతులకు ఉచిత విద్యుత్, .రుణమాఫీ, ఆరోగ్యశ్రీ,,ఫీజురీయింబర్స్‌మెంట్, పావలా వడ్డీలకే రుణాలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు సాకారం అయ్యింది.వైయస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే రైతుల కష్టాలు తీరాయి. సంక్షేమ రాజ్యం వచ్చింది.వైయస్‌ఆర్‌ ప్రజలకు ఉపయోగపడే పథకాలు తీసుకొచ్చారు.చంద్రబాబు.. పథకాల్లో తనకు ఎంత లబ్ధి చేకూరుతుందో ఊహించి అమలు చేస్తారు.సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో వైయస్‌ఆర్‌ చెరగని ముద్ర వేసుకున్నారు.మళ్లీ రాజన్న రాజ్యం తీసుకొస్తానని, నాన్న వైయస్‌ఆర్‌ కంటే మెరుగుగా పరిపాలిస్తానని వైయస్‌ జగన్‌ స్పష్టంగా చెబుతున్నారన్నారు.

వైయస్‌ఆర్‌ సీఎం ఉన్న రోజుల్లో  కాంగ్రెస్‌ కొన్ని అడ్డంకులు సృష్టించడం వల్లన ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోయారన్నారు.  వైయస్‌ఆర్‌ పాపులర్‌ అవుతున్నారని కొందరు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అడ్డుపడ్డారన్నారు.ప్రకటించిన పథకాలను జగన్‌ సంపూర్ణంగా అమలు చేస్తారని విశ్వాసవ్యక్తం చేశారు.చంద్రబాబు పొరపాటున మళ్లీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అన్ని రంగాల్లో తీవ్రంగా నష్టబోతుంది. చంద్రబాబు అక్కసు అంతా కేసీఆర్,మోదీ మీద వెళ్లగక్కుతున్నారు.కేసీఆర్‌ను శత్రువుగా చూస్తున్నారు. కేసీఆర్‌ను ఎదుర్కొవడానికి ఎందుకు తెలంగాణలో కేసీఆర్‌పై పోటీ చేయడం లేదని చంద్రబాబును ప్రశ్నించారు.టీడీపీ జాతీయ పార్టీ అని, ఎందుకు తెలంగాణ పోటీ చేయడం లేదు.తెలంగాణలో టీడీపీ చాపచుట్టేసింది.హైదరాబాద్‌ టీడీపీ కార్యాలయంలో సెక్యూరిటీ తప్ప ఎవరూ కనిపించడంలేదు. ఓటుకు నోటుకు కేసుల్లో  చంద్రబాబు ఇరుక్కుని..హైదరాబాద్‌ నుంచి అమరావతికి పారిపోయి వచ్చారన్నారు.

కోట్ల మంది ప్రజాభిప్రాయానికి భిన్నంగా అమరావతికి వచ్చారు. చంద్రబాబు వల్లన ఎంతో నష్టం జరిగింది.సుమారు 10 సంవత్సరాలు హైదరాబాద్‌లో ఉండిఉంటే..రాజధాని కట్టుకునేవారమని,.నిధులను కూడా సమకూర్చుకునేవాళ్లం.తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ కూడా తెలంగాణలో అస్తిత్వం కోసం పాకులాడే స్థితికి వచ్చింది.చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏమవుతుందని ఒకసారి ప్రజలు గ్రహించాలన్నారు.కేంద్రంలో నాలుగున్నర సంవత్సరాలు సంసారం చేసి నీ వ్యక్తిగత సమస్యలు తీర్చుకున్నావు.అసెంబ్లీ సీట్ల పెంపు కుదరదని చెప్పటంతో కేంద్రంతో తెగదెంపులు చేసుకున్నారన్నారు.చంద్రబాబు ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీతో టీడీపీ విడిపోలేదని..వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేకపోవడంతోనే బీజేపీకి దూరమయ్యారన్నారు.అధికార పక్షం అవినీతి,అక్రమాలపై పవన్‌కల్యాణ్‌ విమర్శించకుండా ప్రతిపక్షాన్ని టార్గెట్‌ చేయడం చూసి తెలుగు ప్రజలు విస్మయం చేస్తున్నారు.పవన్‌తీరుతో ఆ పార్టీ నేతలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

 

Back to Top