తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు సర్కార్ పాలనలో జరుగుతున్న కుంభకోణాలను, కుట్రలను వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ ఆధారాలతో సహా బయటపెట్టారు. వైయస్ జగన్ గురువారం మీడియా సమావేశంలో అన్ని విషయాలను వివరించారు. అనంతరం, ‘స్కాంస్టార్ బాబు’(#ScamsterBabu) అంటూ హ్యాష్ ట్యాగ్‌తో చంద్రబాబు అక్రమాలు, అవినీతి, స్కాంల ఆధారాలను వైయస్ జగన్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ తాజాగా ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అక్రమాలను మరోసారి వివరించారు. ఈ సందర్భంగా.. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆధారాలతో సహా వివరాలను ట్యాగ్ చేశారు. మద్యం స్కాంలోని వాస్తవాలతోపాటు పూర్తి సమాచారాన్ని తెలిపారు. కేసులోని అబద్ధాలు, కట్టు కథలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం తీరు, ప్రజా వ్యతిరేకతపై ప్రశ్నించే గొంతులను నులుమేస్తున్న తీరుపై మాట్లాడారు. యథేచ్ఛగా సాగుతున్న రాజకీయ వేధింపులు, అధికార దుర్వినియోగంపై ఆధారాలను బహిర్గతం చేశారు. ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలపై పెరిగిన కక్షసాధింపుల గురించి చర్చించారు. వీటికి సంబంధించిన వివరణాత్మక ఆధారాలను ట్వీట్‌లో జత చేసినట్టు తెలిపారు.