రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధానికి వైయ‌స్‌ జగన్‌ ధన్యవాదాలు

  అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయ దుందుభి మోగించిన నాటి నుంచి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వైయ‌స్‌ జగన్‌ను అభినందిస్తూ ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. ఇలా పలువురు ప్రముఖులు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు అందజేశారు. ఈ నేపథ్యంలో వారందరికి వైయ‌స్‌ జగన్‌ ధన్యావాదాలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన మోదీకి ధన్యవాదాలు తెలిపిన వైయ‌స్‌ జగన్‌.. మరోమారు ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ పాలనకు బెస్ట్‌ విషేస్‌ చెప్పారు.

అలాగే తనకు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌,  బీజేపీ అగ్ర నాయకులు అరుణ్‌ జైట్లీకు ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాకుండా తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయి శుభాకాంక్షలు అందజేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌లకు వైయ‌స్‌ జగన్‌ ధన్యవాదాలు తెలిపారు. 

 

Back to Top