తాడేపల్లి: భారతదేశపు గొప్ప ఇంజనీరింగ్ మేధావి, భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆయన ట్వీట్ చేశారు. ఎన్నో తాగు, సాగునీటి ప్రాజెక్టుల రూపశిల్పి, దేశం గర్వించదగ్గ ఇంజనీరింగ్ నిపుణులు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు అంటూ ఎక్స్ ఖాతాలో వైయస్ జగన్ పోస్ట్ చేశారు.