బీసీలకు తీరని ద్రోహం చేసిన ఆర్‌.కృష్ణ‌య్య‌

చంద్రబాబు బేరసారాలకు, డబ్బు రాజకీయాలకు ఆర్.కృష్ణయ్య తలొగ్గడం బాధాకరం

ఇలాంటి వ్యవహారాలతో వైయస్ఆర్‌సీపీని బలహీనపర్చలేరు

మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కారుమూరు నాగేశ్వరరావు

తాడేపల్లి: చంద్రబాబు తప్పుడు రాజకీయాలకు తలొగ్గి కృష్ణయ్య బీసీలకు తీరని ద్రోహం, నష్టం చేకూర్చార‌ని మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కారుమూరు నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆర్‌.కృష్ణ‌య్య రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌డం ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ మాజీ మంత్రులు స్పందించారు. ఈ మేర‌కు వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
 
చంద్రబాబు బేరసారాలకు, డబ్బు రాజకీయాలకు ఆర్.కృష్ణయ్య తలొగ్గడం బాధాకరం. ఒకచేత్తో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తూ, మరో చేత్తో ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని డబ్బుతో కొనుగోలు చేస్తూ చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు.  
- ఎంతో గౌరవించి బీసీల అభ్యున్నతికి పాటుపడతారన్న ఆకాంక్షతో వైయ‌స్ జగన్ గారు కృష్ణయ్యకు పదవి ఇచ్చారు. 
- పార్టీలో ఎంతో మంది ఉన్నా.. కృష్ణయ్య ద్వారా దేశ రాజధానిలో, పార్లమెంటులో బీసీల వాణి వినిపిస్తుందని నమ్మకంతో, విశ్వాసంతో రాజ్యసభ పదవిని కట్టబెట్టారు. 
- అలాంటి ఉదాత్త సంకల్పాన్ని నీరుగారుస్తూ.. చంద్రబాబు తప్పుడు రాజకీయాలకు తలొగ్గి కృష్ణయ్య బీసీలకు తీరని ద్రోహం, నష్టం చేకూర్చారు.

- చంద్రబాబు కొనుగోలు, కృష్ణయ్య రాజీనామా ఈ రెండు అంశాలను ప్రజలు గమనిస్తున్నారు. 
- తన పరిపాలన ద్వారా ప్రజలకు సమర్థ పాలన చంద్రబాబు అందించలేకపోతున్నారు. 
- ఆ అంశాలను మరుగున పరచడానికి ఇలాంటి ఎత్తుగడలు తీసుకుంటున్నారు. 

- రాజీనామా చేసిన వారికి కొంత ఇచ్చి, ఆ ఖాళీ అయిన సీట్లను పదిరెట్లకు చంద్రబాబు అమ్ముకుంటున్నాడు. 
- చంద్రబాబుకు ఇదొక లాభసాటి వ్యాపారంగా మారింది. రాజకీయాల్లో బాబు నయా మార్కెటింగ్ వ్యవహారమిది. దీన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 
- ఇలాంటి వాటికి కృష్ణయ్య తలొగ్గి రాజకీయంగా బీసీలకు తీరని ద్రోహం చేశారు. 
- ఇలాంటి వ్యవహారాలతో వైయస్ర్ఆర్‌సీపీని బలహీనపర్చలేరు. 
- అంతకుమించి రెట్టింపు స్పందనతో సమయం వచ్చినప్పుడు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు. 

ఇట్లు, 
మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కారుమూరు నాగేశ్వరరావు

Back to Top