‘సర్వే’జనం..జయహో జగన్‌

మరో రెండు సర్వేల్లో వైయస్‌ఆర్‌సీపీ ప్రభంజనం

వీడీపీ అసోషియేట్స్‌, టైమ్స్‌నౌ సంస్థల సర్వేలో దుమ్ములేపిన ఫ్యాన్‌..!

 
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మరో సర్వే స్పష్టం చేసింది. స్పష్టమైన మెజారిటీ సాధించి ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంలో వైయస్‌ఆర్‌సీపీ నిలుస్తుందని వీడీపీ అసోషియేట్స్‌ అనే సర్వే సంస్థ అంచనా వేసింది. ఫ్యాన్‌ హవాతో ఏపీలో ఉన్న 175 సీట్లకు గాను వైయస్‌ఆర్‌సీపీ 106 నుంచి 118 సీట్లు సాధిస్తుందని వెల్లడించింది. ఇక అధికార టీడీపీ 68 నుంచి 54 సీట్లు సాధిస్తుందని తెలిపింది. జనసేన ఒకటి నుంచి మూడు సీట్లు సాధించే అవకాశముందని పేర్కొంది. బీజేపీ, కాంగ్రెస్‌ సహా బీఎస్పీ, సీపీఐ, ఇతరులెవరూ ఖాతా తెరవరని వివరించింది. వైయస్‌ఆర్‌సీపీ 43.85 శాతం ఓట్లు, టీడీపీ 40 శాతం ఓట్లు, జనసేన 9.8 శాతం ఓట్లు సాధిస్తాయని తెలిపింది.

20 లోక్‌సభ సీట్లు వైయస్‌ఆర్‌సీపీవే..
జాతీయ వార్తా సంస్థ టైమ్స్‌నౌ, వీఎమ్మార్‌.. ‘2019 ఒపినీయన్‌ పోల్‌’ పేరిట చేపట్టిన సర్వేలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దుమ్ములేపింది. ఏపీలో ఉన్న 25 లోక్‌సభ స్థానాల్లో వైయస్‌ఆర్‌సీపీ 20 చోట్ల ఘన విజయం సాధిస్తుందని టైమ్స్‌నౌ స్పష్టం చేసింది. ఇక అధికార టీడీపీ కేవలం 5 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది. వైయస్‌ఆర్‌సీపీ 43.7 శాతం ఓట్లు, టీడీపీ 35.1 శాతం ఓట్లు సాధిస్తాయని తెలిపింది.


 

Back to Top