పండుగ వాతావరణంలో వైయ‌స్ జగన్ బర్త్ డే వేడుకలు 

తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారి జన్మదిన వేడుకలు ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వాడవాడలా జగన్ మోహన్ రెడ్డిగారి పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున జరుపుకున్నారు. ఈ సందర్భంగా, కేకులు కట్ చేయడంతోపాటు, పుస్తకాల పంపిణీ, దుస్తులు పంపిణీ, రక్తదానం,  మొక్కలు నాటడం, అన్నదాన కార్యక్రమాలు.. ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జగన్ గారి బర్త్ డే నాడే 8వ తరగతి విద్యార్థులకు 5 లక్షలకు పైగా ట్యాబులు పంపిణీ చేయడంతో విద్యార్థుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. "థ్యాంక్యూ జగన్ మామ.." అంటూ రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థులు ట్యాబులు చూపిస్తూ,  ప్లకార్డులు పట్టుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.  జగన్ గారి బర్త్ డే వేడుకలతో రాష్ట్రమంతా ఎటుచూసినా..  వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాలు, బ్యానర్లు, ఫెక్సీలతో నిండిపోయింది. శ్రీ వైయస్ జగన్ గారి జన్మదినోత్సవ వేడుకల్లో ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, విద్యార్దులు, యువత పెద్దఎత్తున పాల్గొన్నారు. హ్యాపీ బర్త్ డే సీఎం జగనన్న.. అంటూ ఊరూవాడా ఏకమై నినదించాయి. అటు సోషల్ మీడియాలోనూ  హ్యాపీ బర్త్ డే సీఎం సార్.. అంటూ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు, సీనియర్ నేతలు, పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారికి శుభాకాంక్షలు తెలియజేశారు. 

పార్టీ కేంద్ర కార్యాలయంలోః
 రాష్ర్ట ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారి జన్మదినోత్సవ వేడుకలు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారంనాడు ఘనంగా జరిగాయి.  ఈ సందర్భంగా క్రైస్తవ, ముస్లిం, హిందూ, సిక్కు మతాలకు సంబంధించిన మతపెద్దలు  శ్రీ వైయస్ జగన్ కు ఆశీస్సులు అందచేస్తూ, ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.  పార్టీ కార్యకర్తలు, అభిమానుల హర్షాతిరేకాల నడుమ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులను పోలిన బెలూన్లను ఆకాశంలోకి ఎగురవేశారు. హ్యాపీ బర్త్ డే సీఎం శ్రీ వైయస్ జగన్ సర్..... అంటూ ప్రత్యేకంగా తయారు చేయించిన 500 కిలోల భారీ కేక్ ను కట్ చేశారు.

           "ఎన్నికల మేనిఫెస్టోలోని 98 శాతం వాగ్దానాలు అమలు చేశాం... మా పారదర్శకమైన పరిపాలన చూడండి... నచ్చితేనే ఓటు వేయండి.." అని ఓట్లు అడిగే సత్తా... దమ్ము దేశంలో ఎవరికైనా ఉందంటే అది ఒక్క వైయస్ జగన్ గారికేనని ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారులు  సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ర్టంలో కొందరు  నాయకుల్లా దబాయించడం, తమను ఎన్నుకోకపోతే రాష్ర్టం నష్టం పోతుందని బెదిరించడం ఇవేమీ జగన్ గారికి అలవాటు లేదన్నారు. శ్రీ వైయస్ జగన్ గారి మాటల్లో చెప్పాలంటే.. తాను ప్రభుత్వం ద్వారా చేస్తున్న సేవ,మా పార్టీ నేతలు చేస్తున్న సేవ నచ్చితేనే దీవించమని అడుగుతున్నారు .. ఇదే నిజమైన రాజకీయనాయకుడికి కావాల్సిన లక్షణం, ప్రజానేతకు కావాల్సిన లక్షణం అని అన్నారు.  రాజ్యాంగ నిర్మాతలు ఏదైతే కోరుకున్నారో అలాంటి లక్షణాలు ఉన్న నేత శ్రీ వైయస్ జగన్  అని అన్నారు. ఒక దార్శనికుడిలా శ్రీ వైయస్ జగన్ రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చారని వివరించారు. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి కాబట్టే శ్రీ వైయస్ జగన్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి-సంక్షేమం, సంస్కరణలు, సామాజిక, విద్యా పరంగా ముందుకు తీసుకువెళుతున్నారన్నారు.  ఆయన మరో వందేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ వైయస్ జగన్ కలలన్నీ నిజమై, 2035 నాటికి అంతర్జాతీయంగా  ఆంధ్రప్రదేశ్ ను ఓ ల్యాండ్ మార్కుగా తీర్చిదిద్దుతారనే నమ్మకం అందరికీ ఉందని అన్నారు.  శ్రీ వైయస్ రాజశేఖరరెడ్డి గారి ఆశయాలను నిలబెట్టుకుంటూ  మా అన్న... మా తమ్ముడు... అని ప్రజలు భావించే రీతిలో వారిలో నమ్మకం కలిగించేలా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ పరిపాలన అందిస్తున్నారు.  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక బ్రాండ్ ను సంపాదించగలిగారు. వైయస్సార్ సిపి అంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా ఉండే పార్టీ, విలువలుతో, నమ్ముకున్న వారికి న్యాయం చేసే పార్టీ అని రుజువు చేసుకుని ఈ రోజు ఈ స్దానంలో ఉండగలిగామని సజ్జల అన్నారు. అందుకే ఈరోజు ప్రతి పార్టీ కార్యకర్తా కాలరెగరేసుకుని తిరగగలుగుతున్నారు. ఈ మూడున్నరేళ్లలో శ్రీ వైయస్ జగన్ గారికి వచ్చిన ఆలోచనలు, చేసిన సంస్కరణలు గతంలో పాలించిన పాలకులకు ఎందుకు రాలేదు. వాటిని అమలు చేసి ప్రజల ఆదరణ చూరగొనాలనే ఆలోచన వారికి ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు. 

      రాష్ర్ట మంత్రి శ్రీ జోగి రమేష్ మాట్లాడుతూ... శ్రీ వైయస్ జగన్ కు నేడు తెలుగు ప్రజలందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారని అన్నారు. శ్రీ వైయస్ జగన్ నిండునూరేళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటున్నానని అన్నారు. దేవునితోపాటు దివంగత నేత శ్రీ వైయస్ రాజశేఖరరెడ్డి దీవెనలు మనందరిపై  మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నానని తెలియచేశారు.

      తెలుగు అకాడమి ఛైర్ పర్సన్ శ్రీమతి నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ..  ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా పేదవర్గాలందరూ చేసుకునే గొప్ప పండుగ శ్రీ వైయస్ జగన్ జన్మదినం అని అన్నారు. 30 సంత్సరాలపాటు రాష్ర్ట ముఖ్యమంత్రిగా చల్లగా పరిపాలించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రజల ఆశీస్సులు శ్రీ వైయస్ జగన్ కు ఎప్పుడూ ఉంటాయన్నారు.

            మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... శ్రీ వైయస్ జగన్ పుట్టినరోజు అందరికీ చాలా సంతోషకరమైన రోజు అని అన్నారు. సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రతి ఒక్కరూ, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ ప్రభుత్వంలో భాగమని కోట్లాది మంది భావిస్తున్నారని తెలిపారు. కళ్లుండి చూడలేని కబోదులు ఎవరైనా విమర్శలు చేయవచ్చుగాని.. 80 శాతం మంది ప్రజలు మెచ్చే నాయకుడు జగన్ గారు అని అన్నారు.

అధికార భాషా సంఘం ఛైర్మన్పి . విజయబాబు మాట్లాడుతూ... జగన్ గారి పుట్టినరోజు అంటే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని మలుపుతిప్పే నేత పుట్టినరోజు అని అన్నారు. రాజకీయాలకు కొత్త అర్ధాన్ని ఇచ్చిన నేత శ్రీ వైయస్ జగన్ అని తెలియచేశారు. 

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శాసనమండలి సభ్యులు, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ... శ్రీ వైయస్ జగన్ పుట్టినరోజు వేడుకలు రాష్ర్టం అంతటా ఓ పండుగలా జరుపుకుంటున్నారన్నారు. ప్రజలందరి హృదయాలలో జగన్ గారు సుస్థిర స్దానం సంపాదించారని తెలియచేశారు.

ఈ సందర్భంగా, దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారులు  సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి  జోగి రమేష్, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్  వాసిరెడ్డి పద్మ, శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, కార్పోరేషన్ ఛైర్మన్లు,పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

          వైయ‌స్ జగన్ గారి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. పలువురు నేతలు కార్యకర్తలు రక్తదానం చేశారు.పేదలకు వస్త్రాలను పంపిణి చేశారు. అన్నదానం చేశారు.ఈ సందర్భంగా సాంస్క్రృతిక ప్రదర్శనలు నిర్వహించారు. పలు కళాశాలల్లో విద్యార్ది విభాగం రాష్ర్ట అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డి, వాలీబాల్ , స్కిప్పింగ్, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలలో  విజేతలైన విద్యార్దులకు సజ్జల రామకృష్ణారెడ్డి బహుమతులు అందచేశారు. దివ్యాంగుల కార్పోరేషన్ ఛైర్మన్ కిరణ్ రాజ్ ఆధ్వర్యంలో పలువురు దివ్యాంగులకు ట్రైసైకిల్స్ ను పంపిణి చేశారు.

Back to Top