గ‌డ‌ప గ‌డ‌ప‌లో జ‌న నీరాజ‌నం

పండుగ వాతావ‌ర‌ణంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం

ఎమ్మెల్యేల‌కు ఘ‌న స్వాగ‌తం 

ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే ప‌రిష్కారం

అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయో తెలుసుకునేందుకు ఇంటింటికీ వెళ్తున్న వైయ‌స్ఆర్‌ ర్‌సీపీ ఎమ్మెల్యేలకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి గడప గడప కు మన ప్రభుత్వం 110వ రోజు బండి ఆత్మకూరు మండలం జీసీ పాలెంలో నిర్వ‌హించారు.  ఉదయం 9 గంటల నుంచి నిరంతరాయంగా ఎమ్మెల్యే ఇంటింటా ప‌ర్య‌టిస్తున్నారు.  నాలుగేళ్ళ పాలనలో ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి   అమలు చేస్తున్న సంక్షేమ పథకాలుతో పేద ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని రాజాం అసెంబ్లీ ఎమ్మెల్యే కంబాల జోగులు తెలిపారు.  వంగర మండలంలోని మరువాడ సచివాలయ పరిధిలో పాత మరువాడ గ్రామంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యేకు ఎంపీపీ యూ.సురేష్ ముఖర్జీ, జెడ్పీటీసీ ప్రతినిధి కరణం సుదర్శన్ రావు, సర్పంచ్ గాడి కృష్ణవేణి, ఎంపీటీసీ పిల్లి ప్రేమమ్మ, స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది,గ్రామ వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.  అనంతరం ఆయన ఇంటింటికి తిరిగి నాలుగేళ్లలో ప్రభుత్వం నుంచి పొందిన లబ్ది తెలియజేస్తూ బుక్ లెట్లు పంపిణీ చేశారు.    

ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డికి ఘ‌న స్వాగ‌తం
క‌దిరి నియోజ‌క‌వ‌ర్గం తలుపుల మండలంలో ఎమ్మెల్యే డాక్ట‌ర్ పీవీ సిద్దారెడ్డికి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. గడపగడపకు మన ప్రభుత్వం కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే గ్రామంలో ప్ర‌తి ఇంటిని సందర్శించి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అమ‌లు చేసిన  సంక్షేమ కార్యక్రమాలను వివ‌రించారు.  ప్రతి గడపను సందర్శించినప్పుడు ప్రభుత్వం నుంచి ఇంకేమైనా సేవలు రావాల్సి ఉన్నాయా అన్న అంశంపై వారితో చర్చించి అక్కడే ఉన్న‌ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సత్వరం ప్రభుత్వ సేవలను అందించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ..సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తలుపుల మండలం, పెద్దన్నవారిపల్లి గ్రామ సచివాలయం పరిధిలో  నిర్వహించామ‌న్నారు.  వైయ‌స్ జ‌గ‌న్ అధికారంలోకి రాకమునుపు ఏవైతే హామీ ఇచ్చారో వాటన్నిటినీ ఒక వరుస క్రమంలో నవరత్నాలు అన్న పేరుతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.  ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలను మరొకవైపు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి రెండిటినీ రెండు కళ్ళుగా భావించి రాష్ట్రంలో రెండిటిని సమానంగా అమలుపరుస్తున్నారన్నారు. ఇంత పెద్ద ఎత్తున జగనన్న చేపట్టిన కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు చేరువయ్యాయో తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమమే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.  ఈ కార్యక్రమం  క్రమ పద్ధతిలో  ప్రభుత్వ యంత్రాంగంతో కలసి నిర్వహించడం వల్ల నిజంగానే అర్హత కలిగిన లబ్ధిదారులను జల్లెడ పట్టేందుకు వీలవుతుందని, అర్హత కలిగి కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల లబ్ధిదారునికి ప్రభుత్వం నుండి అందవలసిన కార్యక్రమాలు అందకపోతే అక్కడికక్కడే పరిష్కరించుకునేందుకు ఒక వేదిక లాగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.  తన తండ్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి  ఆశయాలకు అనుగుణంగా వారి కంటే రెండు అడుగులు ముందుకు వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహకందని విధంగా పాలన సాగిస్తున్నారన్నారు. జగనన్న సహకారంతో కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్ట గలిగామని,  దాదాపు 120 కి పైగా ఎటువంటి రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు అద్భుతమైన 100 సంవత్సరాల మన్నిక కలిగిన రహదారులను నిర్మించగలిగామన్నారు. ప్రతి గ్రామంలో ఇంటర్నల్ రోడ్లను మంచినీటిని అందించడమే కాకుండా పెండింగ్ లో ఉన్న కాలువలను పూర్తి చేసి గ్రామంలో గల ప్రతి చెరువుకు హంద్రీనీవా కాలువల ద్వారా వరుసగా ప్రతి సంవత్సరము కూడా నీటితో నింపగలిగామన్నారు.  కార్యక్రమంలో ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు,  జడ్పీటీసీలు,  కో ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, జేసీఎస్‌ ఇన్చార్జులు, సర్పంచులు, వివిధ శాఖల చైర్మన్ లు, డైరెక్టర్లు, పాల్గొన్నారు.

Back to Top