రాజన్న రాజ్యం వచ్చింది..వర్షం కురిసింది

కర్నూలు: సార్వత్రిక ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల వరుణుడు హర్షం వ్యక్తం చేశారు. అసలే మండే ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా ఇవాళ వైయస్‌ఆర్‌సీపీ గెలవడం..అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి ఆగకుండా వర్షం కురవడం శుభ çసూచకం. ఇన్ని రోజులు ఎండలతో అల్లాడిన రాయలసీమ ప్రజలు వర్షం కురవడంతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఇటు దీన్ని ఆసరాగా తీసుకున్న వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ చేస్తున్నాయి. రాజన్న రాజ్యం వచ్చిందని ..అందుకే వర్షాలు పడుతున్నాయని ..వైయస్‌ జగన్‌ సీఎం అయితే ఇక వర్షాలు సమృద్ధిగా కురుస్తాయంటూ పోస్టులు పెడుతున్నారు.
 

Back to Top