రాసి కంటే 'వాసి'మిన్నగా...

వెయ్యి వ్యర్థమైన వాదనలకంటే ఒక్క అర్థవంతమైన మాట చాలు. లక్ష ఆరోపణలను విచ్ఛిన్నం చేసేలా ఒక్క సమాధానం ఇవ్వడమే మేలు. అలాంటి చొరవ, తెగువ ఉన్న మహిళ వాసిరెడ్డి పద్మ గారు మహిళా కమిషన్ ఛైర్మన్ గా నియమితులయ్యారు. ఇది మహిళాలోకానికి సంతోషం కలిగించే విషయం. 
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో స్పోక్ పర్సన్ గా తనదైన శైలిలో వైరి వర్గంపై విరుచుకుపడ్డ మహిళానేత వాసిరెడ్డి పద్మగారు. ఏ సమస్యపైనైనా అనర్గళంగా మాట్లాడగల నేర్పు ఆవిడ సొంతం. ప్రతి విషయాన్నీ ఖచ్చితత్వంతో, ఆధారాలతో, విషయ సమీకరణతో వివరణాత్మకంగా చెప్పడం ఆమె ప్రత్యేకత. ప్రత్యర్థుల అసత్యప్రచారాలపై ఆమె గళం గర్జించింది. టీడీపీ వక్రీకరణలపై నిప్పులు కురిపించింది. బినామీ లెక్కల నిజాలు నిగ్గు తేల్చింది. చర్చల్లో నరం లేని నాలుకతో వాగే నోళ్లు మూయించింది. నాటి అధికారం కప్పెట్టిన వాస్తవాలను వెలికితీసింది. అప్పటి అవినీతి ప్రభుత్వాన్ని విమర్శించాలన్నా, వాళ్లు చేసే విమర్శలను తిప్పి కొట్టాలన్నాముందు నిలిచే పేరు వాసిరెడ్డి పద్మ. ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలన్నా, తెలుగుదేశం నేతల అవాకులు చెవాకులకు తగిన రీతిలో జవాబు చెప్పాలన్నా అది ఆమెకే సాధ్యం. వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారిపై అసత్య ఆరోపణలు చేసిన వారికి బుద్ధి చెప్పడంలో ఆమె అరక్షణం ఎప్పుడూ ఆలస్యం చేయలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజలకు చేరవేయడంలోనూ ముందుంటారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వరకూ ఎవ్వరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద చల్లాలని ప్రదర్శించినా తీవ్రంగా స్పందించేవారు వాసిరెడ్డి పద్మ. అలాంటి సమయంలో ప్రత్యర్థివర్గం నుంచి కూడా అంతే తీవ్రమైన విమర్శలు బెదిరింపులను ఎదుర్కున్నారు. అయినా వెరవకుండా పార్టీకి బలమైన మహిళా నాయకురాలిగా తన గొంతును వినిపించారు. వైయస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తూ, పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు వాసిరెడ్డి పద్మ. 3000 కిలోమీటర్లకు పైగా షర్మిళగారితో మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో అడుగులో అడుగు వేసారు. మహిళా సమస్యలను లోతుగా అధ్యయనం చేసారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానంగా స్టీల్ లేడీ అని పిలుస్తారంటే పార్టీ వ్యవహారాల్లో ఆమె ఎంతటి ప్రముఖ పాత్ర పోషించారో అర్థం చేసుకోవచ్చు. కీలకమైన సందర్భాల్లో వాసిరెడ్డి పద్మగారి వాయిస్ పార్టీకి శక్తివంతంగా పనిచేసింది. 
మార్క్ చూపేలా
మహిళల సమస్యల పట్ల వేగంగా స్పందిచే గుణం వాసిరెడ్డి పద్మగారిది. ఉత్తరాంధ్రలో సరోగసీ పేరుతో గర్భాలను అమ్ముతున్నా పట్టించుకోని గత ప్రభుత్వపు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేనిపై తీవ్రంగా విమర్శలు చేసారు వాసిరెడ్డి పద్మ. టీడీపీ నాయకులు కాల్ మనీ దందాతో మహిళలను వేధిస్తున్నా పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. మంచి మనిషిగా, మహిళా సమస్యలపట్ల అవగాహన ఉన్నవ్యక్తిగా  పేరున్న వాసిరెడ్డి పద్మగారిని మహిళా కమిషన్ ఛైర్మన్ గా నియమించడం అభినందనీయం అంటున్నారు తెలుగు మహిళలు.  మహిళా కమిషన్ ను మౌన ముద్ర నుంచి మహోజ్వల శక్తిగా మార్చడంలో, మహిళలకు చేయూతనందించేలా తీర్చిదిద్దడంలో తనదైన మార్క్ చూపిస్తారని ఆశిస్తూ వాసిరెడ్డి పద్మగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 

 

Back to Top