అగ్రిగోల్డు  బాధితుల పక్షాన 3 న కలెక్టరేట్ల ముందు ధర్నాలు

జనవరి 3 వ తేదీన అగ్రి గోల్డు బాధితుల పక్షాన అన్ని జిల్లా కలెక్టరేట్ల ముదు ధర్నా నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది.

హైదరాబాద్ :అగ్రిగోల్డు బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్ తో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే కార్యక్రమాలను మరింత ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం (జనవరి 3 వ తేదీన) అగ్రి గోల్డు బాధితుల పక్షాన అన్ని జిల్లా కలెక్టరేట్ల ముదు ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చింది. ధర్నాల అనంతరం జిల్లా కలెక్టర్లకు మెమొరాండం సమర్పించనున్నారు.లక్షలాది మంది డిపాజిట్ దారుల ప్రయోజనాలను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వ తీరును ఎండగట్టడంతోపాటు, ఆ ఆస్తులను కాజేయాలన్న కుట్ర పూరిత వైఖరిని ఈ నిరసనల్లో ప్రజలకు వివరించనున్నారు.

Back to Top