నోట్లతో కళ్లకు గంతలు 

కొత్త రాజ‌కీయాల‌కు తెర లేపిన చంద్ర‌బాబు  

ప్ర‌జాధ‌నానికి ప‌చ్చ‌రంగు

ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందేందుకు అధికార దుర్వినియోగం

అమ‌రావ‌తి: ఖజానా ఖాళీ చేసేశారట. పాపం ప్రజలకోసమేనట! అని వారు చెబుతారు. ఆ ముసుగులో ఓట్లను రాబట్టుకునే నారావారి పచ్చరాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి ఐదేళ్లయినా, డ్వాక్రారుణాల మాఫీ, నిరుద్యోగభృతిలు అంటూ ఇచ్చిన ఆరువందల హామీలను మర్చిపోయిన చంద్రబాబుకు, ఎన్నికలనగానే అన్నీ గుర్తుకువచ్చాయి. 
మరోవైపు వైయ‌స్ జగన్‌ ..చంద్రబాబు పాలనలోని డొల్లతనాన్ని ఎండగడుతున్నాడు. బాబు హామీలను గురించి నిలదీస్తున్నాడు. అయినా అవేవీ ఇంతకాలం పట్టించుకోని బాబుగారు ఇప్పుడు...తనకే ఆ బుద్ది వున్నట్టుగా ప్రచారం చేసుకుంటూ, పథకాలు అమలు చేస్తున్నాడు.  
ఏప్రిల్‌ నెల మొదటి తారీఖే ఖజానాను ఖాళీ చేసేసి, యువనేస్తం, పసుపుకుంకుమ, పెంచిన పెన్షన్లకు నిధులు మంజూరు చేసేశారు బాబు. పోలింగుకు మరోవారం రోజులు ఉందనగా ఇలా రిలీజ్‌ చేయడమేంటని అంతా విస్తుపోతున్నారు. అది కూడా ..ఖజానా కంప్లీట్‌గా ఖాళీ అవడమన్నది ఓ రికార్డ్‌గానే చెప్పుకుంటున్నారు.  పార్టీ డబ్బులు పంచడమన్నది పాత ట్రెండ్‌. ఖజానా నుంచే ఓట్లు కొనుగోలు చేయడం ప్రజెంట్‌ ట్రెండు. అదీ పోలింగు ముందు నేరుగా జనం ఖాతాల్లోకి నిధులు చేరిపోవాలి...ఈసీ చెక్కింగులు, కేసులు గట్రా తల్నొప్పే లేదు.
మొత్తానికి ఒకే రోజు 19వేల కోట్ల మేరకు ఖర్చుచేసిపారేశాడు చంద్రబాబు. అందులో రూ.15కోట్లు పథకాలకు, రూ.4వేల కోట్లు జీతభత్యాలకు సర్దేశాడు... ఆఖరురోజుల్లో సీఎం చంద్రబాబు. ఇవి కాక ఇక ఎన్నికల రోజు టీడీపీ పార్టీ నుంచి ఇచ్చే డబ్బులు వుంటాయి. ఓటుకు నోట్లు...చంద్రబాబు నమ్ముకున్న సిద్దాంతం. ఈ నాలుగైదు రోజులు ఇలా ఇచ్చేసి, ఆ తర్వాత అయిదేళ్లూ దోచేసే నారా చంద్రబాబు నాయుడు విషయంలో ...ప్రజలే ఆలోచించాలి. ఎందుకంటే, రేప్పొద్దున నష్టపోయేది, కష్టపడేది వారే కాబట్టి!!  
 
 

Back to Top