నవరత్నాల సాహసీ.. జయహో

భూమి మీద పుట్టే ప్రతి శిశువూ...మానవజాతి మీద దేవుడికి ఉన్న నమ్మకానికి ప్రతీక అన్న గొప్ప మాట ఒకటి వుంది. ఆ దేవుడి విశ్వాసానికి తగ్గ విధంగా జీవించేది ఎందరు? పరుల కోసం తాపత్రయపడేదెవరు? బహుశా కొందరే ఉంటారు. ఆ కొందరిలోనూ ప్రత్యేకంగా మరికొందరు వుంటారు. వారిలో ఒకరు వైఎస్‌ జగన్‌.. ది సీఎం ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌. బడుగు, బలహీన, పేదవర్గాల ప్రజల అవసరాలను అనుక్షణం కనిపెడుతూ, తెలుసుకుంటూ వీలయినంత వేగంగా వారికి సత్వరన్యాయం అందించాలన్న వైఎస్‌జగన్‌ తపన...నిజంగా అభినందనీయం.

కేవలం నలభైఏడేళ్ల వయసులో...అనితరసాధ్యమైన రాజకీయపోరాటాలతో ఎదిగొచ్చిన జగన్‌ పట్టుగొమ్మ ప్రజలే. ప్రజల్లోంచి నడిచొచ్చిన నాయకుడయ్యారు ఆయన.
తన 3648 కిలోమీటర్ల సుదీర్ఘపాదయాత్రలో విభజిత ఆంధ్రప్రదేశ్‌ను సమగ్రంగా దర్శించారాయన. అడుగడుగునా ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. అసలే విడిపోయిన రాష్ట్రం. రాజధాని అంటూ లేని ప్రాంతం. సమస్యల వలయం. ఉన్న సమస్యలకు తోడు...నేల విడిచి సాముచేసిన బాబుగారి కొత్త సమస్యల ముడి మరోవైపు. 2019 మే నాటికి ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి...చెప్పాలంటే దిక్కుతోచని పరిస్థితి. రాష్ట్రపయనం ఎటువైపు తెలీని అయోమయం. నిరంతరం రాజధాని పేరిటి గ్రాఫిక్‌ కథనాలు మినహా సాధించేదేమీ లేదు. అప్పుల కుప్పలు పెరిగిపోయాయి. రెండులక్షల కోట్లకు మించిపోయాయి. ఇక అప్పు పుట్టని స్థితికి చేరిపోయింది రాష్ట్రగతి. అన్ని వర్గాల ప్రజలు ఈసురోమని వున్న వేళ...నేనున్నానంటూ అప్పటి విపక్షనేత వైఎస్‌జగన్‌ ప్రజల మధ్యకు నడిచొచ్చారు. వారికి ధైర్యాన్నిచ్చారు. భరోసానిచ్చారు. రేపటి వెలుగులు తెస్తాను...పంచిపెడతాను అంటూ హామీలిచ్చారు. ప్రజలు నమ్మారు. ముఖ్యమంత్రిని చేశారు. అయిన మరుక్షణం నుంచే...ఇచ్చిన ప్రతిమాటను నిలబెట్టుకుంటూ...ప్రజలకు తక్షణమేలును తలపెట్టారు. సంక్షేమపథకాల వెల్లువ సృష్టించారు. కేవలం ఏడే..ఏడు నెలల పాలనలో తనదంటూ ఓ రాజకీయ పరిణతి చూపారు. దార్శనికతను చాటారు. ప్రజాసంక్షేమం మినహా మరో ఆలోచన చేయనంటూ ముందుకు సాగుతున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి...ఏ ఏటి మేటిగా నిలిచాడు. ఓరకంగా దేశంలోనే తన ప్రత్యేకతను చాటారు.
సంకల్పబలం వుంది. ప్రజలకు మంచి చేయాలన్న తపన ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడపాలన్న ఆశయం ఉంది. నాలుగుకాలాలపాటు ప్రజల మధ్యన ప్రజాసేవలలో ఒదగాలని వుంది. జగన్‌ విశ్వాసబలానికి ఓటమి లేదు. ఆత్మవిశ్వాసానికి తరుగు లేదు. నవరత్నాల సాహసీ...జయహో. ది పవర్‌ ఆఫ్‌ ఆంధ్ర...సెల్యూట్‌. ఏపీ నీడ్స్‌ యు వైఎస్‌ జగన్‌.....

 

Back to Top