అలుపు లేదు..గేలుపే ల‌క్ష్యం

విస్తృతంగా వైయ‌స్ఆర్‌సీపీ శాస‌న మండ‌లి అభ్య‌ర్థుల ఎన్నిక‌ల ప్ర‌చారం

రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వ‌ర్యంలో ఊరూరా ఎన్నిక‌ల ప్ర‌చారం

విశాఖ‌:   ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ బలపరిచిన సీతంరాజు సుధాకర్‌ గెలుపు కోరుతూ పార్టీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి  ఆధ్వర్యంలో విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశారు.  వ‌రుస‌గా ఆత్మీయ స‌మ్మేళ‌నాలు నిర్వ‌హించి పార్టీ అభ్య‌ర్థి విజ‌యానికి వైవీ సుబ్బారెడ్డి బాట‌లు వేస్తున్నారు. బ్యాలెట్‌లో సీరియల్‌ నంబరు–3లో సీతంరాజు సుధాకర్‌ పేరుకు ఎదురుగా 1వ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను అభ్యర్థించారు. సీతంరాజు గెలుపే ధ్యేయంగా అందరూ సమష్టిగా పనిచేయాలని పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.  


మంగ‌ళ‌వారం విశాఖ న‌గ‌రంలో మంత్రిరిష్ హోటల్ లో మహేష్ రెడ్డి  ఆధ్వర్యం లో రెడ్డి సంఘ సభ్యులు తో ఆత్మీయ స‌మ్మేళ‌నం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొని   ప్ర‌భుత్వం నాలుగేళ్ల‌లో చేసిన సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు. అలాగే పెద్ద వాల్తేర్ ,లాసన్ బె కాలనీ జయదేవి మాన్సన్ లో పుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ కాంతారావు ఆధ్వర్యం లో కాలేజీలు , స్కూల్స్ యజామాన్యాలతో జరిగిన స‌మావేశంలో వై .వి .సుబ్బారెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు.  ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. పట్టభద్రుల సమస్యలను శాసన మండలిలో లేవనెత్తి పరిష్కరించగల సత్తా సుధాకర్ కే ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే సీతంరాజు సుధాకర్ విజయానికి దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో వార్డు కమిటీ ప్రధాన కార్యదర్శి పెద్దిoటి మంగునాయుడు, మహిళా అధ్యక్షురాలు జుత్తు లక్ష్మీ, సింగంపల్లి దేముడు, పిట్టా అప్పలరెడ్డి, సచివాలయం కన్వీనర్ విఘ్నేష్, జానా సతీష్, పెండ్ర రాజు, యర్రా స్వామి నాయుడు, అర్జున్, లక్ష్మీ నారాయణ, బాబా, గౌరి నాయుడు, తవుటు నాయుడు, రమేష్, వి నాగేంద్ర, ఆర్మీ రాజు, సలాది, కె వెంకట అప్పారావు, ఎ పరదేశి నాయుడు,ఎ మహాలక్ష్మి నాయుడు, పులి పెంటయ్య రెడ్డి, గొల్లపల్లి రాంబాబు, నాయుడు, వై భూలోక, సిహెచ్ తిరుపతి రావు, బి కోటి తదితరులు పాల్గొన్నారు

Back to Top