సామాన్యులే స్టార్‌ క్యాంపెయినర్లు

చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా వైయ‌స్ఆర్‌సీపీ ఎన్నికల సమరం 

12 మంది సామాన్యులతో ఎన్నికల సంఘానికి స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా 

వీరంతా నాయకులు కాదు.. నిరుపేదలే 

సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వంలో లబ్ధిదారులు 

ఇతరుల అభ్యున్నతిని కూడా చూసిన వారు 

సీఎం వైయ‌స్ జగన్‌ ప్రజలకు చేసిన మేలును వివరిస్తూ ప్రచారానికి సిద్ధం

అమరావతి: స్టార్‌ క్యాంపెయినర్లు.. ప్రతి పార్టీలోనూ ప్రముఖ నాయ­కులు వీళ్లు.. సభలకు వ­స్తారు.. చేతులూపుతారు.. ఏదేదో చెప్పే­స్తారు.. వారి పార్టీ వారికి ఓటేయమని కోరుతూ ఓ దండం పెట్టేసి హెలికాప్టరో, విమానమో ఎక్కేసి వెళ్లిపోతారు. కానీ,  జగన్‌ నేతృత్వంలోని ప్రజల పార్టీ అయిన వైయ‌స్ఆర్‌సీపీకి స్టార్లు, స్టార్‌ క్యాంపెయినర్లు కూడా సామాన్య ప్రజలే.  జగన్‌ ప్రభుత్వం అందించిన చేయూతతో అభివృద్ధి సాధించి, కుటుంబ జీవన ప్రమాణాలను పెంచుకున్న సాధారణ ప్రజలే. చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా ఈ సామాన్యులే స్టార్‌ క్యాంపెయినర్లుగా వైయ‌స్ఆర్‌సీపీ ఎన్నికల సమారానికి సిద్ధమైంది.

ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారే తన స్టార్‌ క్యాంపెయినర్‌లంటూ సీఎం జగన్‌ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. దీనినే కార్యరూపంలోకి తెస్తూ దేశంలో ఏ పార్టీ కనీసం ఆలోచన కూడా చేయలేని సాహసోపేత నిర్ణయం తీసుకుని, వైయ‌స్ఆర్‌సీపీ 12 మంది సామాన్యులతో తన రాష్ట్రస్థాయి స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ఎన్నికల కమిషన్‌కు అందజేసింది. వీరంతా జిల్లా, నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయిలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవుతారు.  సోమవారం తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యాలయాన్ని వీరు సందర్శించారు. సీఎం వైయ‌స్‌ జగన్‌కు స్టార్‌ క్యాంపెనర్‌లుగా ఏ విధంగా మారారో వారిలో కొందరు వివరించారు.  

50 ఇళ్లకు నేనే ఎమ్మెల్యేగా పనిచేశా 
ఈ ప్రభుత్వంలో వలంటీర్‌గా పనిచేశా. నా 50 ఇళ్లకు నేనే ఎమ్మెల్యే అన్నట్లు పనిచేశా. ప్రతి ఇంటికి వారికి ఏ పథకాలు అందాలో వాటన్నింటినీ పక్కాగా అందించాం. అదే ఊరికి చెందిన నాకు ఆ కటుంబాలు గతంలో ఎలా ఉండేవి, నవరత్నాలతో ఆర్థిక భరోసా అందిన తరువాత ఎలా మారాయో నాకు స్పష్టంగా కనిపించింది. ఈ ఐదేళ్లలో నిజమైన అభివృద్ధిని చూశా. ఆర్థిక కారణాలతో పిల్లలను చదువించుకోలేని ప్రతి కుటుంబానికీ సీఎం వైఎస్‌ జగన్‌ అండగా నిలిచారు. 

భర్త సంపాదన మీద మాత్రమే బతికే ప్రతి అక్కకు, చెల్లెమ్మకు సీఎం జగనన్న అండగా నిలిచి ఆర్థిక భరోసా కల్పించారు. ఏదో ఒక చిరు వ్యాపారం చేసుకునేలా తీర్చిదిద్దారు. ఈ ప్రభుత్వం మహిళలను నిజమైన ఇంటి యజమానిని చేసింది. నా క్లస్టర్‌లోని సగం కుటుంబాలు స్థానికంగా, పక్కనే ఉన్న పట్టణాల్లో సొంత వ్యాపారాలు ప్రారంభించాయి. తద్వారా ప్రతిరోజూ రూ. 1,000 వరకు సంపాదించుకుంటున్నాయి. వారి జీవితాల్లో చాలా మార్పు వచి్చంది.  ఒక తల్లిగా ఆలోచిస్తే మా పిల్లలకు అవసరమైన చదువులు, అవసరాలు అన్నీ పాఠశాలల్లో లభిస్తున్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్ర భవిష్యత్తును మారుస్తున్న నాయకుడని నేను నమ్ముతున్నాను. – ఈశ్వరి, కొండపల్లి, ఎన్టీఆర్‌ జిల్లా

సీఎం జగన్‌ చలవతో నా కుమారుడు అమెరికాలో చదువుతున్నాడు 
నాకు ఇద్దరు కుమా­రులు. పెద్దబ్బాయి కిషోర్‌ డిగ్రీ పూర్తి చేసి డిల్లీలోని మారుతి సుజుకీలో ఉద్యోగం చేసే­వాడు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్‌ ఇన్‌ పొలిటికల్‌ అఫైర్స్‌లో సీటు సంపాదించాడు. కోర్సు ఫీజు రూ.1.36 కోట్లు అవుతుందన్నారు. ఈ మాట నాకు చెప్పగానే కనీసం రూ. లక్ష అయినా మనం కట్టలేం.. మంచి ఉద్యోగం చూసుకో అని చెప్పా. ఆ తరువాత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో విదేశీ విద్య పథకం గురించి తెలుసుకుని దరఖాస్తు చేశాం.

నా కొడుకు చదువుకు కావాల్సిన డబ్బు విదేశీ విద్య కింద మంజూరైంది. ఇప్పటికే రెండు సెమిస్టర్లు పూర్తి చేసిన నా కుమారుడికి రెండు దఫాలుగా రూ. 50 లక్షలు అందింది. ఇది చూసిన నాకు లక్ష రూపాయలు కట్టలేని నా కుమారుడు ఇంత పెద్ద మొత్తం ఫీజుతో విదేశీ విశ్వవిద్యాలయంలో చదవగలుగుతున్నాడని గర్వంగా అనిపించింది. ఒక్క నా కుమారుడే కాదు.. ఇలా చాలా మంది పేదల పిల్లలు విదేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో ఉన్నత విద్య చదువుతున్నారు. ఇదంతా సీఎం వైఎస్‌ జగన్‌ చలవే. అందుకే సీఎం జగన్‌ కోసం స్టార్‌ క్యాంపెయినర్‌ అయ్యాను.       – పండలనేని శివప్రసాద్, మోపిదేవి మండలం, కృష్ణా జిల్లా

సీఎం జగన్‌ ఆలోచనలకు సంపూర్ణ మద్దతు 
జగనన్న చేదోడు అందుకున్న మా ఇంటి పక్కనే నివాసం ఉండే శారద బట్టల షాపు ఏర్పాటు చేసుకుని కుటుంబానికి అండగా నిలుస్తోంది. దాసరి మహాలక్ష్మి అనే మహిళకు భర్త మరణిస్తే రూ. 2 లక్షల బీమా అందింది. దీంతోపాటు పెన్షన్, ఆసరా, అమ్మఒడి పథకాలూ అందుతున్నాయి. మాది కూడా నిరుపేద కుటుంబం. జగననన్న ప్రభుత్వంలో అందిన నవరత్నాలతో రోజు గడవడమే కష్టంగా ఉండే దుస్థితి నుంచి నిలకడ ఆదాయం అందుకునే స్థితికి వచి్చంది. 

మా కుటుంబాలను ఆర్థికంగా నిలబడేలా ఆదుకున్న ప్రభుత్వానికి మేమెందుకు అండగా నిలవకూడదు? పేదలను పేదరికం నుంచి తప్పించి మెరుగైన జీవితం కల్పించాలనే సీఎం జగన్‌ ఆలోచనకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. అందుకే సీఎం జగన్‌ కోసం స్టార్‌ క్యాంపెయినర్‌గా పనిచేసేందుకు ముందుకు వచ్చా.      – ఎ. అనంతలక్ష్మి, రాజమండ్రి సిటీ నియోజకవర్గం, తూర్పు గోదావరి జిల్లా

ప్రభుత్వ పాఠశాలల్ని చూస్తే తేడా తెలుస్తుంది 
సీఎం జగన్‌ పరిపాలన ఏమిటో చెప్పేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలే ఉదాహరణ. నేను డిగ్రీ పూర్తి చేసి ఐదేళ్లే అయ్యింది. మేం చదువుకునే సమయంలో ప్రభుత్వ పాఠశాలలి్న, ఇప్పడు నాడు – నేడు కింద పూర్తిగా మారిన ప్రభుత్వ పాఠశాలలను చూస్తే తేడా అర్ధమవుతుంది. అప్పటి ప్రభుత్వ పాఠశాలలు తలుపులు లేక గేట్లు లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేవి. కనీసం బాలికలకు టాయిలెట్లు కూడా లేని దుస్థితి. 

ఇలాంటి స్కూళ్లలో బాలికల విద్య ఎలా ఉంటుందో మనం ఒక్కసారి ఆలోచిస్తే అర్ధమ­వుతుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే అంతర్జాతీయ స్థాయి. సకల సౌకర్యాలు, డిజిటల్‌ క్లాస్‌ రూంలు, ట్యాబ్‌లతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్యను బోధిస్తున్నారు. మరో పదేళ్లలో ఈ ప్రభుత్వ పాఠశాలల నుంచి బయటికి వచ్చే వారితో రాష్ట్రం మరో ఎత్తుకు ఎదుగుతుంది. ఇంగ్లిష్‌ చదువులతో  కొన్ని లక్షల కుటుంబాల తలరాత మారిపోతుంది. సీఎం జగన్‌ ప్రభుత్వాన్ని ప్రతి గ్రామానికి తీసుకొచ్చారు.  వీటన్నింటినీ ప్రజలకు వివరిస్తాను.      – అన్వర్, నెల్లూరు జిల్లా

ఒక అడుగు ముందుకు వేశాం 
ద్విచక్ర వాహనాలకు సీట్‌ కవర్లు కుట్టే ఒక చిన్న షాపు నాది. రోడ్డు పక్కన పెట్టుకున్నాను. నాకు ముగ్గురు పిల్లలు. నా రోజువారీ సంపాదన కుటుంబ పోషణకే సరిపోతుంది. పిల్లలను బాగా చదివించాలని ఆశ ఉన్నా చదివించే ఆర్థిక స్థోమత లేదు. 2019లో సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక ఇంజనీరింగ్‌లో చేరిన నా కొడుకుకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాలతో ఆదుకున్నారు. నా కుమారుడు బాగా చదువుకున్నాడు. 

రెండో కొడుకు కూడా ఫీజు రియింబర్స్‌మెంట్‌ డబ్బుతో డిగ్రీ చదువుతున్నాడు. మూడో కొడుకుకి అమ్మఒడి అందుతోంది. నా సంపాదన అరకొరే అయినా, నా పిల్లల చదువు ఏ ఆటంకం లేకుండా సాగుతోంది. పెద్ద కొడుకు ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగం సాధించాడు. సీఎం జగన్‌ ఇచ్చిన ఒక్క పథకం కింద చదువుకున్న నా కొడుకు నా కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చాడు. మేము సమాజంలో ఒక అడుగు ముందుకు వేసినట్లైంది. ఇలాంటి వేలాది పేదింటి పిల్లలకు సీఎం జగన్‌ చదువులు చెప్పిస్తున్నారు.      – కటారి జగదీష్ , మల్లవీధి, అనకాపల్లి
 

Back to Top