కోటి సంతకాలతో కూట‌మి ప్రభుత్వాన్ని నిలదీద్దాం

కదిరి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త  బి.యస్.మక్బూల్

తలుపుల మండలంలో కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా:  పాలన చేతకాక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న అసమర్థ కూటమి ప్రభుత్వాన్ని కోటి సంతకాల కార్యక్రమం ద్వారా నిలదీద్దామంటూ ప్రజలకు కదిరి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త  బి.యస్.మక్బూల్ పిలుపునిచ్చారు. శుక్ర‌వారం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలం నూతన కాలవ పంచాయతీలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో మ‌క్బూల్ పాల్గొని కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..  దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలకు అనుమతులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా వైద్య కళాశాల నిర్మాణాలు చేపడితే.. వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూడడం సిగ్గుచేటన్నారు. వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వర్ రెడ్డి, కదిరి పరిశీలకులు నాగభూషణ్, జోనల్ ఇంచార్జ్ డీకే బాబు, కన్వీనర్ ఫయాజ్‌, స‌ర్పంచ్‌ శేషావలి  , గ్రామ కన్వీనర్ ఆరి ఉల్లాఖాన్నా, పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

Back to Top