జ‌నం నినాదం.. ‘జగనన్నే మా భవిష్యత్తు’

ప్రజాప్రతినిధులు, సచివాలయాల క­న్వీ­నర్లు, వలంటీర్లు, గృహసారథులకు ప్రతి ఇంటా ఘనస్వాగతం 

అడిగి మరీ తీసుకుని ఇళ్లకు, ఫోన్లకు స్టిక్కర్లు..

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 8296082960 నంబర్‌కు పోటీలు పడి మిస్డ్ కాల్స్‌

అమరావతి: గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా చేస్తున్న మేలును ఇంటింటా వివరించి.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైయ‌స్ఆర్‌సీపీ  చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావారణంలో కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 15,004 సచివాలయాల పరిధిలో 1.65 కోట్ల కుటుంబాల్లోని ఐదు కోట్ల మందిని నేరుగా కలవడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం మంగళవారం ఐదో రోజుకు చేరుకుంది.


 
ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు, సచివాలయాల క­న్వీ­నర్లు, వలంటీర్లు, గృహసారథులకు ప్రతి ఇంటా ఆ కుటుంబ సభ్యులు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. ప్రభుత్వ పాఠశాలలను ‘నాడు–నేడు’ ద్వారా కార్పొరేట్‌ బడులకు దీటుగా అభివృద్ధి చేసి.. ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టి.. అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాల ద్వారా తమ పిల్లల భవితకు బంగారు బాటలు వేసిన జగనన్నే మా భవిష్యత్తు అంటూ ముక్తకంఠంతో అక్కాచెల్లెమ్మలు నినదిస్తున్నారు.

డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేస్తే.. వాటిని వడ్డీతో సహా నాలుగు విడతల్లో వైయ‌స్ఆర్ ఆసరా ద్వారా చెల్లిస్తానని ఇచ్చిన హామీని సీఎం వైయ‌స్‌ జగన్‌ నిలబెట్టుకుంటూ ఇప్పటికే మూడు విడతలు డబ్బులను ఖాతాల్లో వేశారని అక్కచెల్లెమ్మలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 8296082960 నంబర్‌కు పోటీలు పడి మిస్డ్‌ కాల్‌ ఇచ్చిన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు.. మళ్లీ వైయ‌స్‌ జగన్‌ సీఎం కావాలంటూ ఆశీర్వదించారు. 

వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. 
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. నాలుగు రోజుల్లో 39 లక్షల కుటుంబాలను కలిస్తే.. అందులో 28 లక్షల మంది ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ మిస్డ్‌ కాల్‌ ఇవ్వడాన్ని బట్టి చూస్తే అన్ని వర్గాల ప్రజలు సీఎం వైయ‌స్‌ జగన్‌తోనే ఉన్నారని స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు.

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రజా సర్వేకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం నాలుగో రోజు అంటే సోమవారం ముగిసేసరికి 39 లక్షల కుటుంబాలను ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, వలంటీర్లు, గృహసారథులు కలిశారు. ప్రజా మద్దతు పుస్తకంలో స్లిప్పుల్లోని ఐదు ప్రశ్నలను చదివి.. టీడీపీ సర్కార్‌కూ, వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానికి మధ్య తేడాలను వివరించారు.

చంద్రబాబు సర్కార్‌ హయాంలో ఇంటి స్థలం కావాలన్నా.. పెన్షన్‌ కావాలన్నా జన్మభూ­మి కమిటీల్లోని టీడీపీ నేతలకు లంచాలు ఇచ్చుకున్నామని.. అయినా సరే పథకాలను తమకు మంజూరు చేయలేదని అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు ధ్వజమెత్తారు. వైయ‌స్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక ఎవరి దగ్గరికి వెళ్లకుండా, ఒక్క రూపాయి లంచం కూడా ఇవ్వకుండా పథకాలు అందుతున్నాయని కొనియాడారు.
 
సోమవారం నాటికి 28 లక్షల మంది ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 8296082960 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చారు. మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం వైఎస్‌ జగన్‌ సందేశంతో ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ రాగానే సంతోషంతో కేరింతలు కొట్టారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ ఫొటోతో కూడిన స్టిక్లర్లను గృహసార«థుల వద్ద అడిగి మరీ తీసుకుని.. ఇంటి తలుపులకు, మొబైల్‌ ఫోన్‌లకు అతికించుకుని సంబరపడిపోయారు.  

Back to Top