సీబీఎన్ కేసులు నీరుగార్చ‌డ‌మే సీఐడీ ల‌క్ష్యం

ఐఏఎస్‌ అధికారి చెరుకూరి శ్రీధర్‌ వాంగ్మూలం రీరికార్డింగ్‌!

రాజధానిలో గత టీడీపీ ప్రభుత్వ అక్రమాలను వెల్లడించిన శ్రీధర్‌

ఆ మేరకు గతంలో కోర్టులో వాంగ్మూలం

అందుకు విరుద్ధంగా మరోసారి వాంగ్మూలం ఇవ్వాలని కూటమి ఒత్తిడి

సీఐడీ, మఫ్టీ పోలీసుల పహారా మధ్య రీరికార్డింగ్‌

అమరావతి : చంద్రబాబుపై అవినీతి కేసులను నీరుగార్చడమే ఏకైక కర్తవ్యంగా భావిస్తున్న సీఐడీ అందుకు చర్యలు వేగవంతం చేసింది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిలో అసైన్డ్‌ భూముల దోపిడీ, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ అక్ర మాలను ఆధారాలతో సహా వెల్లడించిన అప్పటి సీఆర్‌డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌పై ఒత్తిడి తెచ్చి, గతంలో ఆయనిచ్చిన వాంగ్మూలాన్ని మా ర్పించి, కొత్తగా వాంగ్మూలం ఇప్పించడంలో విజ యవంతమైంది. 

చంద్రబాబు ప్రభుత్వ అక్ర మాలను వెల్లడిస్తూ ఆయన గుంటూరులోని న్యాయస్థానంలో ఇంతకుముందు 164 సీఆర్‌పీసీ వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆయనతో గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తి విరుద్ధంగా వాంగ్మూలం ఇవ్వాలని సీఐడీ ద్వారా బెదిరింపులకు పాల్పడింది. ఇందుకు ఆయన అంగీకరించలేదు. రెండుసా ర్లు ఆయనతో 164 సీఆర్‌సీపీ వాంగ్మూలాన్ని రీరి కార్డింగ్‌ చేసేందుకు సీఐడీ యత్నించి విఫలమైంది. 

ఓ సారి న్యాయాధికారి సెలవులో ఉండటంతో వాయిదా పడింది.  మరోసారి న్యాయస్థానం ప్రాంగణం వరకూ వచ్చిన శ్రీధర్‌ బయటే చాలాసేపు తన వాహనంలో ఉండిపోయారు. న్యాయస్థానం లోపలికి వెళ్లలేదు. ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరోసారి వాంగ్మూలం ఇవ్వడం నేరంగా పరిగణిస్తారని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను  పలువురు న్యాయ­వా­దులు ఆయన దృష్టికి తీసుకువెళ్లడంతో వాంగ్మూలం ఇవ్వకుండానే వెనుదిరిగారు. 

మూడో ప్రయత్నంలో బుధవారం సీఐడీ అధికా­రులు ఆయన్ని గుంటూరులోని న్యాయస్థా­నానికి తీసుకువచ్చారు. సీఐడీ అధికారులు, మఫ్టీలో ఉన్న పోలీసు అధికారుల పహారా మధ్య దాదాపు రెండు గంటలపాటు ఆయన న్యాయస్థానంలోనే ఉన్నారు. ఆ సమయంలో ఇతరులు ఎవరూ ఆయన్ని కలిసేందుకు కూడా సీఐడీ అధికారులు అనుమ­తించలేదు.

సీఆర్‌పీసీ 164 కింద శ్రీధర్‌ తన వాంగ్మూలాన్ని రీరికార్డింగ్‌ చేసినట్టు సమాచారం. అనంతరం ఆయన ఎవరితోనూ మాట్లాడకుండా తన వాహనంలో వెళ్లిపోయారు. వాంగ్మూలం రీరికార్డింగ్‌పై అధికారికంగా సీఐడీ, ఇతర అధికారులుగానీ స్పందించలేదు.  

Back to Top