నాడు బతుకు భయం..నేడు కొండంత ధైర్యం..

అర్చకత్వం వారి వృత్తి. గ్రామంలో ఉన్న శివాలయాన్నే నమ్ముకుని ఓ కుటుంబం జీవిస్తోంది. సొంత భూమి లేదు. కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే శక్తి లేదు. ఆలయానికి చెందిన రెండెకరాల భూమి వేరేవారి ఆదీనంలో ఉంది. దానిపై వచ్చే ఆదాయం అంతంతమాత్రమే. భూమి సొంతం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరకు వారు ఎంతిస్తే అంత తీసుకుని బతుకు గడిచిపోతే చాలనుకున్న స్థితికి చేరుకున్నారు. దేవాలయానికి వచ్చే భక్తులు ఇచ్చిన దక్షిణలతోనే వారి కుటుంబపోషణ సాగుతోంది. దీనికి తోడు పుట్టిన కొడుకు, కూతురు ఇద్దరూ బధిరులే.

 

ఇద్దరిలో కొడుక్కు అతికష్టమ్మీద పెళ్లి చేసినా... కూతురుకు పెళ్లికాక జీవితాంతం తమతోనే గడపాల్సి వస్తోంది. కట్టుకునేందుకు సరైన బట్టలే లేని వారికి ఉండే ఇల్లు ఎలా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. ఆదుకోవాల్సిన గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులనుంచి గట్టెక్కించింది. బతుకుపై మళ్లీ ఆశలు కల్పించింది. ఇదీ శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామానికి చెందిన వారణాసి కుమార స్వామి, శ్యామలాంబ కుటుంబ గాథ. 

అడగకుండానే.. అన్నీఇచ్చిన జగనన్న ప్రభుత్వం 
2019లో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఏదో రకంగా ఏడాది పొడవునా ప్రభుత్వం నుంచి సహాయం అందుతోంది. ఇంటి ఇల్లాలు శ్యామలాంబకు వైఎస్సార్‌ఆసరా(రుణమాఫీ), వైఎస్సార్‌ సున్నా వడ్డీ, కుమార స్వామికి పింఛన్, కొడుకు, కూతురుకు దివ్యాంగ పింఛన్లు, కొడుకు చంద్రశేఖర్‌ కుట్టు పని నేర్చుకోవడంతో మెషీన్‌ ఉన్నందున జగనన్న చేదోడు అందుతున్నాయి.

అతని భార్య పేరున కాలనీలో ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం అందింది. ఇప్పుడు పనులు పురోగతిలో ఉన్నాయి. వారి పిల్లలు బడికి వెళ్తున్నందున అమ్మ ఒడి నిధులు జమవుతున్నాయి. తమకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం ఆదుకోగలదన్న నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఆ కుటుంబం ఎంతో దర్జాగా బతికేస్తోంది. 

మా ఆర్థిక సమస్యలన్నీ తీరాయి 
మా ఆర్థిక సమస్యలన్నీ తీరాయి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక మా ఆర్థిక సమస్యలన్నీ తీరాయి. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క నయాపైసా సహాయం అందలేదు. కుటుంబ ఖర్చులకు కూడా నానా అవస్థలు పడేవాళ్లం. చిన్నపాటి అవసరాలకూ అప్పులు చేయాల్సి వచ్చేది. మా ఇద్దరు పిల్లలూ బధిరులే అయినా ఎలాంటి సాయమూ అందలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతీ నెల పండగే. ఏదో ఒక పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతోంది. తద్వారా మేము నిశ్చింతగా జీవిస్తున్నాం. మా కుటుంబానికి ఈ ఐదేళ్ల కాలంలో సుమారు రూ. ఏడు లక్షలకు పైబడి లబ్ధి  చేకూరింది.

ప్రస్తుత ప్రభుత్వంలో ఏ కష్టం వచ్చినా దానిని ప్రభుత్వం సాయంతో ఎదుర్కోగలమనే నమ్మకం ఏర్పడింది. మా అబ్బాయి చంద్రశేఖర్‌కు ప్రభుత్వం అందజేసిన ప్రోత్సాహంతో కొత్త కుట్టుమెïÙన్‌ కొన్నాం. బట్టలు కుట్టుకుంటూ వచ్చిన కుట్టుకూలితో ఆనందంగా బతుకు తున్నాం. రూ. 10 లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాం.  – వారణాసి కుమార స్వామి 

సుస్థిర ఆర్థిక వ్యవస్థకు దోహదం 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాల వల్ల ప్రతీ కుటుంబంలోనూ ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యాయి. రైతులకు వైఎస్సార్‌ రైతుభరోసా వల్ల వ్యవసాయం కోసం అప్పు చేయాల్సిన బాధ తప్పింది. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వల్ల నిరుపేదలకు అత్యవసర వేళ కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందుతోంది. పిల్లల చదువు తల్లి దండ్రులకు భారం కాకుండా అమ్మ ఒడి, బతుకుపై భరోసా కల్పించేందుకు పింఛన్లు అందుతున్నాయి.

ఇంకా ఉన్నత విద్యకోసం విద్యాదీవెన, వసతి దీవెన, నిరుపేదలకు ఇళ్లు వంటివి ఎంతోమందికి అందాయి. దీనివల్ల ఆర్థిక లావాదేవీలు విస్తృతంగా జరిగి వారిలో కొనుగోలు శక్తి పెరుగుతోంది. దీనివల్ల వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగు పడింది. ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయం వల్ల పరోక్షంగా రాష్ట్రంలో సుస్థిర ఆర్థిక వ్యవస్థ ఏర్పడటానికి ఎందో ఉపయోగపడుతోంది.  – కె.కె.కామేశ్వరరావునాయుడు, ఎకనమిక్స్‌ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, బూర్జ 

గత ప్రభుత్వ హామీలు నీటిమీద రాతలు 
2014లో లెక్కలేనన్ని హామీలతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు. ఫలితంగా కమారస్వామి లాంటి వారి ఆశలు అడియాసలయ్యాయి. డ్వాక్రా రుణమాఫీ కాకపోవడం... కొత్తగా పింఛన్లు మంజూరు కాకపోవ డం... మరే ఇతర సౌకర్యాలు అందకపోవడంతో ఆ కుటుంబం అల్లాడిపోయింది.

ఏనాటికైనా ప్రభుత్వ సహాయం అందకుండా పోతుందా... అని నెలల తరబడి నిరీక్షించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. పిల్లల పోషణకు తోడ్పాటు అందక, కుటుంబ అవసరాలు తీర్చే ఆధారం లేక, ఒంటికి కష్టం వస్తే నయం చేయించుకునే శక్తి లేక, పెరిగిన కుటుంబానికి తగినంత ఇల్లు లేక రోజు వారీ బతుకులు భారమై పో యాయి. అప్పుడప్పుడు పస్తులు ఉండాల్సి వచ్చేది.  

Back to Top