జోరు వాన‌లో "గడపగడపకు మనప్రభుత్వం"

విశాఖ‌:  గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్విగ్నంగా సాగుతోంది. జోరు వాన‌ను సైతం లెక్క చేయ‌కుండా ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌తి గ‌డ‌ప‌కు వెళ్లి ప్ర‌భుత్వం చేసిన సంక్షేమ ప‌థ‌కాల‌ను, అభివృద్ధిని వివరిస్తూ ప్ర‌జ‌ల ఆశీస్సులు పొందుతున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్నారు. గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే అలజంగి జోగారావు బలిజిపేట మండలం, అంపావల్లి సచివాలయం పరిధిలో మంగ‌ళ‌వారం ప‌ర్య‌టించారు. జోరు వాన‌ను సైతం లెక్క చేయకుండా విరామం లేకుండా పర్యటిస్తూ గడప గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుని వారికి ప్రభుత్వం చేసిన సహాయాన్ని వివరిస్తూ, వారికి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిగారిని మరోసారి ముఖ్య‌మంత్రిగా ఆశీర్వదించాలని అని కోరుతూ గడప గడపకు కార్యక్రమం నిరంతరంగా కొనసాగిస్తున్నారు. జోరు వానలో సహితం ఆగకుండా ఎమ్మెల్యే  వెంట  ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ..
నంద్యాల‌: శ్రీ‌శైలం ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి క‌రివేన గ్రామంలో రెండో రోజు గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్యక్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలోని ప్ర‌తి ఇంటికి వెళ్లి పేరు పేరునా ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ వారి యోగ‌క్షేమాలు తెలుసుకుంటున్నారు. ప్ర‌భుత్వం ఈ మూడేళ్ల‌లో చేసిన మంచిని వివ‌రిస్తూ..మ‌రోసారి ముఖ్య‌మంత్రిగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆశీర్వ‌దించాల‌ని మ‌న‌సారా కోరుతున్నారు. ఎమ్మెల్యే వెంట వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, అధికారులు, స‌చివాల‌య సిబ్బంది పెద్ద సంఖ్య‌లో పాల్గొంటున్నారు. నాయ‌కులు, అధికారుల రాక‌తో గ్రామ‌మంతా కోలాహ‌లంగా మారింది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top