అభాగ్యులకు అండ‌గా నిలిచిన ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి హామీలను తక్షణమే అమలు

  బాప‌ట్ల‌: బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.యస్.జగన్ మోహన్ రెడ్డి మానవత్వంతో మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. నిరాదరణకు గురై నిస్సహాయ స్థితిలో ఉన్న ఆపన్నులను అక్కున చేర్చుకున్నారు. తనను కలిసేందుకు ఎదురుచూస్తున్న అభాగ్యులను ప్రత్యేకంగా హెలిప్యాడ్  ప్రాంగణంలోకి పిలిపించుకుని, వారి సమస్యలను సావధానంగా ఆలకించారు. చమర్చిన కళ్లతో సాయం కోరుతూ వచ్చిన బాధితులు వినతిపత్రాల ద్వారా విజ్ఞప్తి చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రికి ఆవేదనతో వెలుబుచ్చారు. వారి భుజం తట్టి ఓదారుస్తూ నేనున్నానని కొండంత భరోసా ఇచ్చారు. వీరి సమస్యలను ఆలకించిన ముఖ్యమంత్రి తక్షణసాయంగా ఒక్కొక్కరికి రూ.ఒక లక్ష నగదు, అవసరమైన వైద్య సేవలు సత్వరమే ఆరుగురికి అందించాలని  జిల్లా కలెక్టర్ ను ఆయన ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ప్రత్యేకంగా అభాగ్యుల వద్దకు వెళ్లి వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తానే స్వయంగా నమోదు చేసుకుని, ప్రభుత్వపరంగా అన్ని ప్రయోజనాలు కల్పించారు.
          
       అభాగ్యులకు రాష్ట్ర ముఖ్యమంత్రి అండగా నిలిచారని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హామీలను తక్షణమే అమలు చేస్తూ నిరుపేదలైన ఆరుగురికి ఆర్థిక సహాయం చెక్కులను బుధవారం స్థానిక కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అందజేశారు. తదుపరి ఆర్థిక సహాయం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి వివరాలు పంపుతామని ఆయన తెలిపారు. మీరంతా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.
         
           
ముఖ్యమంత్రిని కలిసిన అభాగ్యుల వివరాలు..

1). కొక్కిలిగడ్డ వీర్రాజు
తండ్రి తిరుపాలు
నిజాంపట్నం గ్రామం, నిజాంపట్నం మండలం, బాపట్ల  జిల్లా.

( వేట నిషేధ సమయంలో కరెంటు పని చేస్తుండగా విద్యుత్ షాక్ తో ఎత్తు ప్రాంతం నుంచి కింద పడటంతో వెన్నెముక దెబ్బతిని గత కొంతకాలంగా మంచంలోనే ఉండిపోయాడు. కుటుంబం గడవక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. వైద్యం కోసం ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోగా, ముఖ్యమంత్రి గారు లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు.) 

2). కె. బాబూరావు,
తండ్రి కె.ప్రభాకరరావు,
 కనగాలవారిపాలెం గ్రామం, రేపల్లె మండలం, బాపట్ల జిల్లా.
(రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయి ఇబ్బందులు పడుతున్నాడు. 32 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండగా ప్రైవేటు ఉద్యోగం దెబ్బ తినడం, డయాలసిస్ తో భార్య పిల్లలను పోషించుకోలేని పరిస్థితి. కిడ్నీలు తొలగించి అతని తల్లి కిడ్నీని వేయడానికి  ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రిని కలవగా, లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు.) 

3). జ్యోతుల యామిని,
తల్లి జె.ప్రేమకుమారి,
గుడవల్లి గ్రామము, చెరుకుపల్లి మండలం, బాపట్ల జిల్లా.
( అరుదైన బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతుంది. అయిదు సంవత్సరాల బాలికకు ఏడాది క్రితమే క్యాన్సర్ ఉందని బయటపడింది. ఇప్పటికే వైద్యం కోసం రూ.రెండు లక్షల ఖర్చు అయ్యింది. మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సహాయం కొరకు ముఖ్యమంత్రిని కలవగా లక్ష రూపాయలు సాయం చేశారు.) 

4). కొక్కిలిగడ్డ విజయరామరాజు,
తండ్రి కె. వెంకట్రావు,
కొత్తపాలెం గ్రామం, నిజాంపట్నం మండలం, బాపట్ల జిల్లా.
( కండరాల బలహీనతతో బాధపడుతున్నాడు. 24 ఏళ్ల యువకుడు డిగ్రీ పూర్తి చేశాడు. అనారోగ్యంతో ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. వైద్యం చేయిస్తున్నా కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రి గారిని కలవగా లక్ష రూపాయలు సాయం చేశారు.) 

5). బుల్ల శివయ్య
తండ్రి బి.యేసురత్నం
వలివేరు గ్రామం, చుండూరు మండలం, బాపట్ల జిల్లా.
( పుట్టుకతోనే దివ్యాంగుడు, ఆపైగా పక్షవాతం... ప్రమాదవశాత్తు కింద పడిపోయి వెన్నుముక దెబ్బతిని బాధపడుతున్నారు. తాత్కాలికంగా వైద్యం చేయిస్తూ మంచానికే పరిమితమయ్యాడు. తన వ్యక్తితంగా పని చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రిని కలవగా, లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు) 

6). వలివేటి అగ్ పే రేచల్,
తండ్రి రవీంద్రబాబు, 
వలివేరు గ్రామం, చుండూరు మండలం, బాపట్ల జిల్లా.

(జన్యుపరమైన సమస్యతో 16 ఏళ్ల బాలిక  ఎదుగుదల లేక ఇబ్బంది పడుతుంది. పూర్తిగా తల్లిదండ్రులపై ఆధారపడి బాలిక జీవిస్తుంది. ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రిని కలవగా, లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు.) 

Back to Top