పెద్ద మనసు చాటుకున్న సీఎం వైయ‌స్‌ జగన్‌ 

చిన్నారి వైద్యానికి రూ.22 లక్షల సాయం మంజూరు  

 అమలాపురం : తలసేమియా వ్యాధితో బాధపడుతోన్న బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం నారాయణపేటకు చెందిన బాలుడు దంగేటి యశ్వంత్‌(7) చికిత్సకు సీఎం వైయ‌స్‌ జగన్‌ సహాయం అందించారు. బాలుడు హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యానికి రూ.22 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. 
శుక్రవారం గోకవరం మండలం గుమళ్లదొడ్డిలో ఇథనాల్‌ ప్రాజెక్ట్‌ శంకుస్థాపనకు వచ్చిన సీఎంను గోదావరి సెంట్రల్‌ డెల్టా బోర్టు చైర్మన్‌ కుడుపూడి వెంకటేశ్వరబాబు కలిశారు. బాలుడు తండ్రి ఆర్థిక పరిస్థితిని విన్నవించారు. దీనిపై చలించిన సీఎం వెంటనే స్పందించారు. సీఎం సహాయ నిధి నుంచి రూ. 22 లక్షలు మంజూరు చేస్తున్నట్లు సంతకం చేసి కార్యదర్శి జవహర్‌రెడ్డికి అందజేశారు.    

ఎంత ఖర్చయినా వైద్యం చేయించండి: సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆదేశం
 తాడేప‌ల్లి: వెన్నెముక సంబంధిత సమస్యతో బాధపడుతున్న చిన్నారి సాయిలక్ష్మీచంద్రకు ప్రభుత్వం పూర్తివైద్యం చేయిస్తుందని ఆమె తల్లి ఆరుద్రకు ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి భరోసా ఇచ్చారు. ఆయన శుక్రవారం కాకినాడకు చెందిన రాజులపూడి ఆరుద్రతో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. అనారోగ్యానికి గురైన తన కుమార్తెను ఆదుకోవాలంటూ రెండురోజుల కిందట ఆరుద్ర సీఎం కార్యాలయానికి విన్నవించారు.

 
ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుద్రను ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, సీఎం ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ పరామర్శించి వివరాలు తెలుసుకుని సీఎంకు నివేదించారు. దీంతో మరోసారి ఆమెతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరించాలని సీఎం వైయ‌స్‌ జగన్‌ తన కార్యదర్శి ధనుంజయరెడ్డిని ఆదేశించారు. కలెక్టర్‌ డిల్లీరావు స్వయంగా ఆరుద్రను సీఎం కార్యాలయానికి తీసుకొచ్చారు.

సాయిలక్ష్మీచంద్ర వైద్యానికి అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వం భరిస్తుందని, ఈమేరకు సీఎం ఆదేశాలు జారీచేశారని ధనుంజయరెడ్డి ఆమెకు వివరించారు. జీవనోపాధి కోసం ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చి.. ఆమె సమక్షంలోనే కాకినాడ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. స్థిరాస్తిని అమ్ముకునే క్రమంలోను ఎవరైనా ఇబ్బందిపెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎస్పీకి సూచించారు.

ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా ఉంటుందని, నిరాశకు గురికావద్దని ధైర్యం చెప్పారు. అనంతరం ఆరుద్ర మాట్లాడుతూ తనలాంటి నిస్సహాయులకు సీఎం అండగా నిలుస్తారనే ధైర్యం, నమ్మకంతోనే ఇక్కడికి వచ్చానన్నారు. తన కుమార్తెకు వైద్యం చేయించడంతోపాటు తనకు ఉద్యోగం ద్వారా జీవనోపాధి కల్పిస్తున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రెండురోజులుగా అధికారులు ఎప్పటికప్పుడు తన యోగక్షేమాలు కనుక్కుంటూనే ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు.  

Back to Top