చెప్పిన స‌మ‌యానికే..చెప్పిన విధంగా..

నేడు మూడో విడత వైయ‌స్ఆర్ రైతుభరోసా

48.86 లక్షల మందికి రూ.2వేల చొప్పున రూ.977.27 కోట్లు

1.51 లక్షల మంది కౌలుదారులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ రైతులకు రూ.2వేల చొప్పున రూ.30.20 కోట్లు 

కొత్తగా అర్హత పొందిన 21,140 మంది కౌలుదారులకు రూ.13,500 చొప్పున రూ.28.53 కోట్లు

నేడు తాడేపల్లి నుంచి బటన్‌ నొక్కి జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌

మొత్తం మీద 2021–22లో 50.58 లక్షల మందికి రూ.6,899.67 కోట్లు లబ్ధి

మూడేళ్లలో రూ.19,812.79 కోట్లు పెట్టుబడి సాయం జమ

 అమరావతి: వైయ‌స్ఆర్ రైతుభరోసా–పీఎం కిసాన్‌ కింద మూడోవిడత పెట్టుబడి సాయం జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుచేసింది. మొత్తం 50,58,489 మందికి రూ.1,036 కోట్లు జమకానుంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. ఈ మొత్తంతో కలిపి 2021–22 సీజన్‌లో రూ.6,899.67 కోట్లు జమ కానుండగా, గడిచిన మూడేళ్లలో ఈ పథకం కింద రూ.19,812.79 కోట్లు పెట్టుబడి సాయం అందిస్తోంది. వైయ‌స్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది.

భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సాగుదారు లతో పాటు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌–ఎండోమెంట్‌ భూమి సాగుచేస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వమే రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. 2019 అక్టోబర్‌ 15న శ్రీకారం చుట్టిన ఈ పథకం కింద తొలి ఏడాది 45 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,162.45 కోట్లు జమచేశారు. ఈ మొత్తంలో పీఎం కిసాన్‌ కింద రూ.2,525 కోట్లు కేంద్రం, వైయ‌స్సార్‌ రైతుభరోసా కింద రూ.3,637.45 కోట్లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం భరించాయి. ఇక రెండో ఏడాది 2020–21లో 49.40 లక్షల రైతు కుటుంబా లకు రూ.6,750.67 కోట్లు జమచేశారు. ఇందులో వైఎస్సార్‌ రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.3,784.67 కోట్లు జమచేయగా, పీఎం కిసాన్‌ కింద రూ.2,966 కోట్లు కేంద్రం అందించింది.

ఈ ఏడాది ఇప్పటికి రూ.5,863 కోట్లు జమ
2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రెండు విడతల్లో 50.37 లక్షల రైతు కుటుంబాలకు రూ.5,863.67 కోట్లు జమచేశారు. ఈ మొత్తంలో వైయ‌స్సార్‌ రైతుభరోసా కింద రూ.3,848.33 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమచేయ గా, పీఎం కిసాన్‌ కింద రూ.2,015.34 కోట్లు కేంద్రం కేటాయించింది. లబ్ధిపొందిన వారిలో 48,86,361 మంది భూ యజమానులు కాగా, 82,251 మంది ఆర్‌ఓఎఫ్‌ఆర్‌–దేవదాయ భూము లు సాగుచేస్తున్న రైతులతోపాటు 68,737 మంది కౌలుదారులున్నారు. భూ యజమానులకు రూ.7,500 చొప్పున రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం జమచేయగా, పీఎం కిసాన్‌ కింద కేంద్రం అందించిన రూ.4వేలు సర్దుబాటు చేసింది. ఇక తొలిరెండు విడతల్లో అర్హత పొందిన 1,50,988 మంది కౌలుదారులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ రైతులకు మాత్రం రెండు విడతల్లో రూ.11,500 చొప్పున  రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా జమచేసింది.

ఇప్పుడు మూడో విడతలో ఇలా..
ఇక మూడో విడతలో 48,86,361 మంది భూ యజమానులకు పీఎం కిసాన్‌ కింద రూ.2వేల చొప్పున రూ.977.27 కోట్లు జమచేయనుండగా, గతంలో అర్హత పొందిన 1,50,988 మంది ఆర్‌ఓఎఫ్‌ఆర్, కౌలుదారులకు రూ.2వేల చొప్పున వైఎస్సార్‌ రైతుభరోసా కింద రూ.30.20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తోంది. కొత్తగా సాగుహక్కు పత్రాలు æ(సీసీఆర్‌సీ) పొందిన 21,140 మంది కౌలుదారులకు వైఎస్సార్‌ రైతుభరోసా కింద ఒకేవిడతగా రూ.13,500 చొప్పున రూ.28.53 కోట్లు నేడు రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తోంది.

మూడు విడతలు కలిపి 2021–22లో 50,58,489 మందికి రూ.6,899.67 కోట్లు పెట్టుబడి సాయం అందించినట్లు అవుతుంది. ఈ మొత్తంలో వైయ‌స్సార్‌ రైతుభరోసా కింద రూ.3,907.06 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తుండగా, పీఎం కిసాన్‌ కింద రూ.2,992.61 కోట్లు కేంద్రం అందిస్తోంది. లబ్ధిపొందిన వారిలో 48,86,361 మంది భూ యజమానులు, 82,251 మంది ఆర్‌ఓఎఫ్‌ ఆర్‌–దేవదాయ భూముల సాగుదారులు, 89,877 మంది భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులున్నారు. ఇక సామాజిక తనిఖీలో భాగంగా రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top