అల్లూరి జిల్లా పాడేరు: వైయస్ఆర్ సీపీ సామాజిక సాధికార యాత్ర గిరిసీమలో గిరిజనుల జాతరగా సాగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. సామాజిక సాధికార యాత్రలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు చేరుకున్న వైయస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులకు,నేతలకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. పాడేరు ప్రధానవీధుల్లో ప్రజలు మేళతాళాలతో , అదివాసీ సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. సామాజిక సాధికార యాత్రలో భాగంగా జరిగిన సభకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాల నాయుడు, పీడిక రాజన్నదొర, అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి, స్థానిక ఎమ్మెల్యే కొట్టుగుళ్ల భాగ్యలక్ష్మీ, అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణతో పాటుగా పలు కార్పొరేషన్ల డైరక్టర్లు,పార్టీ నేతలు హాజరయ్యారు. ముందుగా విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనలో చనిపోయిన మృతులకు సంతాపం తెలుపుతూ కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గిరిపుత్రుల అభ్యున్నతి వైయస్ జగన్ తోనే సాధ్యం: రాజన్న దొర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర మాట్లాడుతూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రజలకు ఏది చేప్పారో అది చేసి చూపించారన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అనేక అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా రుజువు చేసుకున్నారన్నారు. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి గతంలో ఉన్న జీఓ నెంబర్ 97 ను రద్దు చేసి వైయస్ జగన్ తన చిత్తశుద్ది చాటుకున్నారన్నారు. ఎన్నికలకు ముందు చింతపల్లి సభలో ఇచ్చిన హామీ మేరకు బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసి గిరిజనుల పట్ల తనకున్న ప్రేమ, ఆప్యాయతను చాటుకున్నారన్నారు. రాష్ట్రంలోని ఏడు గిరిజన నియోజకవర్గాల్లోనూ వైయస్ జగన్ ను గెలిపించారన్నారు. గిరిజనుల ఆరోగ్యం పట్ల గత ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్సించగా, సీఎం వైయస్ జగన్ ఎవరూ ఆలోచించని రీతిలో పాడేరు మెడికల్ కాలేజీ మంజూరు చేసి ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. గతంలో గిరిజనులు వైద్యం కావాలంటే విశాఖపట్నానికి వెళ్లవలసి వచ్చేదన్నారు. సీఎం వైయస్ జగన్ రూ. 500 కోట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో ఇక కష్టాలు తీరిపోనున్నాయన్నారు. గతంలో గిరిజనులకు మంత్రి పదవి లేకుండా చేసి మోసం చేసిన ఘనడు చంద్రబాబు కాగా, ఉప ముఖ్యమంత్రులను చేసి రాజ్యాధికారం అందించిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. జీసీసీకి చైర్మన్ కూడా వేయకపోగా, గిరిజన సలహా మండలిని కూడా నియమించకుండా ఆదివాసీల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని చంద్రబాబు ప్రదర్శిస్తే తాము అప్పట్లో న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. సీఎం శ్రీ వైయస్ జగన్ అధికారంలోకి రాగానే ఎస్టీ కమిషన్ ని నియమించి గిరిజన హక్కుల విషయంలో తన అంకితభావం తెలియ చేశారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం అన్ని మాటలు మాత్రమే చెప్పారని, చంద్రబాబు రూ. 87,612 కోట్లు రైతు రుణ మాఫీ చేస్తామని చెప్పి, రూ 15 వేల కోట్ల మాత్రమే మాఫీ చేసి రైతాంగాన్ని మోసం చేసారన్నారు. డ్వాక్రా రుణ మాఫీ విషయంలో కూడా రాష్ట్రంలోని డ్వాక్రా తల్లికి, చెల్లికి, అక్కకు కూడా మోసం చేయగా, శ్రీ వైఎస్ జగన్ రూ. 27 వేల కోట్ల నాలుగు దఫాలుగా ఇస్తున్నారని గుర్తు చేసారు. చంద్రబాబు హయాంలో 48 వేల బెల్టు షాపులు తెరవగా, వైయస్ జగన్ సీఎం కాగానే వాటిని తొలగించి మహిళల జీవితాల్లో ఆనందం నింపారన్నారు. 2014 లో బాబు వస్తాడు.. జాబు ఇస్తాడు అని ప్రచారం చేసారని, అధికారంలోకి రాాగానే రాష్ట్రంలో గిరిజనులు ఎవ్వరికీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా, ఆయన కుమారుడు లోకేశ్ కు మూడు శాఖలు ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారన్నారు. టీీడీపీ హయాంలో రూ.. 12 వేల కోట్లు మాత్రమే గిరిజనులకు ఖర్చు చేయగా, వైయస్ జగన్ వచ్చాక రూ. 17,132 కోట్లు ఖర్చు చేసి 59 లక్షల మందికి లబ్ధి చేకూర్చారన్నారు. సుమారు రూ. 20 వేల కోట్లు వైయస్సార్ సీపీ ప్రభుత్వం గిరిజనులకు ఖర్చు చేసి సామాజిక న్యాయం చేసిందన్నారు. గతంలో పాలకులు గిరిజనులను విస్మరించారన్నారు. సీఎం శ్రీ వైఎస్ జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందన్నారు గిరిపుత్రుల అభ్యున్నతి జగన్ తోనే సాధ్యం: బూడి ముత్యాల నాయుడు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆర్థిక వనరులు పెంచేందుకు నాలుగున్నరేళ్లుగా కృత నిశ్చయంతో పని చేశారని గుర్తు చేశారు. నాడు - నేడు పథకంతో గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ విద్యకు ధీటుగా పాఠశాల విద్యను తీర్చిదిద్దారన్నారు. గిరిజనుల ఉన్నత చదవుల కోసం విద్యా దీవెన ను విస్తృతంగా అమలు చేస్తున్నారన్నారు. పేదవిద్యార్దులకు అందని ద్రాక్షలా మారిన ఇంగ్లీషు మీడియంను గిరి పుత్రుల చెంతకు తెచ్చిన ఏకైక నేతగా వైయస్ జగన్ ప్రఖ్యాతి గాంచారన్నారు. అలాగే సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి పరిపాలనను ప్రజల గడప వద్దకు తీసుకువచ్చారన్నారు. గతంలో కలెక్టర్ ను కూడా చూసే భాగ్యం కలగని గిరిజనులకు, పాడేరును జిల్లాను చేసి ఏకంగా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులను ఇక్కడకే తెచ్చిన యువ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఒక్కరే అని అన్నారు. చేయూత పథకంలో లంచగొండులు, బ్రోకర్లు లేకుండా ఉచితంగా ఆర్థిక సహాయం అందచేస్తున్న మానవతా వాది వైయస్ జగన్ అని కొనియాడారు. డ్వాక్రా గ్రూపుల అప్పులను గత ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుని మాఫీ హామీ ఇచ్చారన్నారు. మనందరి ముుఖ్యమంత్రి ఆసరా పథకంగా నాలుగు విడతల్లో డ్వాక్రా మహిళల అప్పును తీర్చేస్తున్నారన్నారు. గిరిజన విద్యార్థులకు చదువులు మధ్యలో నిలిచిపోకుండా వైయస్ జగన్ ఫీజు రీయింబర్స్ మెంట్ ను అమలు చేసి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సంతోషంగా ఉండేలా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. వెనకబడిన వర్గాలకు నాలుగు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి సామాజిక సాధికారత ఇచ్చిన తిరుగులేని నేత వైయస్ జగన్ అని కొనియాడారు. ఏ ప్రాంతానికి ఏం కావాలి...ఏయే వర్గాల ప్రజలకు ఏమి కావాలో తెలుసుకుని వాటిని తీరుస్తూ దార్శినికత కలిగిన నాయకుడు వైయస్ జగన్ అని ప్రశంసించారు. డోలీ మోతల కారణంగా ఎక్కువగా గిరిజనుల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనే పాడేరులో రూ. 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి, శంకుస్థాపన చేశారని గుర్తు చేసారు. మైదాన ప్రాంతం కంటే గిరిజన ప్రాంతానికే మెడికల్ కాలేజీ ముఖ్యమని వైయస్ జగన్ భావించి మంజూరు చేశారన్నారు. చంద్రబాబు గిరిజనులకు మంత్రి పదవే ఇవ్వలేదు: పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సామాజికంగా, అర్థికంగా , రాజకీయంగా వెనుకబడిన గిరిజనులకు, బీసీలకు సీఎం వైయస్ జగన్ సాధికారతను ఇచ్చారని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ వెల్లడించారు. గిరిజనులకు రాజ్యాంగ పదవులు, ప్రాధాన్యతను ఇచ్చిన ఘనత సీఎం వైయస్ జగన్ కే సాధ్యమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర కేబినెట్ లో 67శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కల్పించి ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని వైయస్ జగన్ ను కొనియాడారు. గిరిజనులు ఎక్కువ జనాభా కలిగిన నియోజకవర్గమైన పాడేరు ను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని గుర్తు చేసారు. చంద్రబాబు హయాంలో గిరిజన శాఖకు మంత్రి పదవి కూడా లేకుండా చేసారని, ఆదివాసీలకు మంత్రి పదవి అవసరమా అని భావించారని ధ్వజమెత్తారు. అదే వైయస్ జగన్ సీఎం కాగానే ఇద్దరు గిరిజన నాయకులకు మంత్రి పదవి ఇవ్వడంతో పాటుగా ఏకంగా ఉప ముఖ్యమంత్రులను చేసిన అరుదైన నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని ప్రశంసించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో గిరిజనులకు పోడుభూముల పట్టాలు, ఆరోగ్యశ్రీ , ఫీజు రీయింబర్స్ మెంట్, ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కూడా చేసి గిరిజనుల సంక్షేమం చేపట్టారన్నారు పాడేరుకు మెడికల్ కాలేజీ మంజూరుతో గిరిజనుల్లో వెలుగు: అరకు ఎంపీ మాధవి అరకు ఎంపీ గొట్టేటి మాధవి మాట్లాడుతూ, ఇతర ప్రాంతాలతో పాటుగా గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందిస్తూ, రాజకీయంగా ప్రాధాన్యతను ఇవ్వగల నేత వైయస్ జగన్ ఒక్కరేనని ఉద్ఘాటించారు. ఇతర ప్రాంత ప్రజలతో పాటుగా గిరిజనుల పిల్లలకు కూడా ఇంగ్లీషు మీడియం అందుబాటులోకి తేవాలని వైయస్ జగన్ భావిస్తే, ఇతర పార్టీలు అడ్డుకునే ప్రయత్నం చేసాయన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న వైయస్ జగన్ ను అడుగడుగునా అడ్డుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసునన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సరే ప్రజల కోసం,ప్రజల సంక్షేమం కోసం సీఎం వైయస్ జగన్ ఏనాడు వెనుకడుగు వేయలేదని గుర్తు ఎంపీ మాధవి గుర్తు చేశారు.