బాబు ర‌గుల్చుతున్న కుల చిచ్చు

పార్టీల‌కు అతీతంగా అంద‌రికీ మేలు చేయాలి అనుకుంటున్నారు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ప్ర‌జా సేవే అధికారానికి ప‌ర‌మావ‌ధి అన్న‌ది ఆయ‌న సిద్ధాంతం. ప్ర‌జ‌ల‌తో ఛీ కొట్టించుకుని, అధికార దుర్వినియోగానికి త‌గిన శాస్తి అనుభ‌విస్తున్నచంద్ర‌బాబు మాత్రం ఇంకా ప్ర‌జ‌ల‌ను పార్టీల వారీగా, కులాల వారీగా విడ‌దీయాల‌నే అనుకుంటున్నాడు. అలా వేరు చేసి ప్ర‌యోజ‌నం పొందాల‌నే ఆశిస్తున్నాడు. స్థానిక ఎన్నిక‌లు చేరువ‌లో ఉన్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు చేస్తున్న వేర్పాటు చ‌ర్య‌లు ప్ర‌జాస్వామ్యానికి గొడ్డ‌లి పెట్టు. 

టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచే క‌మ్మ‌ల పార్టీగా ముద్ర ప‌డ్డ‌ది. ఆ కుల‌స్వామ్యాన్ని విప‌రీతంగా వాడుకుని ల‌బ్ది పొందింది మాత్రం చంద్ర‌బాబే. బిసిల ఓటు బాంకు టీడీపీకి ఉంది అని చెప్ప‌డం కేవ‌లం వోటు బాంకు రాజకీయాల కోస‌మే. ఏనాడూ టీడీపీ బీసీల‌కు రాజ్యాధికారం ఇవ్వ‌లేదు. బీసీల ఉప కులాల్లో చిచ్చు పెట్టింది చంద్ర‌బాబే. మ‌రో ప‌క్క కాపు ఓట్ల కోసం వారిని బీసీల్లో చేరుస్తామ‌ని మ‌భ్య‌పెట్టాడు. దాంతో అటు బీసీలు కాపుల మ‌ధ్య ఆగ్ర‌హ జ్వాల‌లు రేగాయి. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోవ‌డం ద‌ళితుల ప‌ట్ల చంద్ర‌బాబు ద్వంద నీతి బ‌ట్ట‌బ‌య‌లు అయ్యింది. ముస్లింల‌కు సైతం చంద్ర‌బాబు మొండిచెయ్యే చూపాడు. ఎన్నిక‌ల ముందు క్ష‌ణం వ‌ర‌కూ ముస్లిం నేత‌ల‌ను ప‌ట్టించుకోలేదు. ఉప ఎన్నిక‌ స‌మ‌యంలో నంద్యాల గెలుపు కోసం మాత్ర‌మే ముస్లిం నేత ఒక‌రికి ప‌ద‌విని ఇచ్చి ఊరుకోబెట్టాల‌నుకున్న చంద్ర‌బాబు వైఖ‌రిని ముస్లింలు వ్య‌తిరేకించారు.

ఇప్పుడు ఇదే చంద్ర‌బాబు, అదే కుల ప్రాధాన్య పార్టీ టీడీపీ రాష్ట్రంలో చిచ్చు పెట్టే విధంగా గొడ‌వ‌లు సృష్టిస్తున్నారు. సివిల్ గొడ‌వ‌ల‌ను, సాధార‌ణ స‌మ‌స్య‌ల‌ను కూడా రాజ‌కీయ రంగు పులిమి ప్ర‌చారం చేస్తున్నారు. ఇంట్లో భార్య భ‌ర్త‌ల గొడ‌వ‌ల‌ను, ఆర్థిక నేరాల‌ను కూడా రాజ‌కీయ క‌క్ష‌లుగా చిత్ర‌క‌రించేందుకు తీవ్ర ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రాయ‌ల‌సీమ ప్రాంతం మొత్తాన్నీ పాక్ష‌నిస్టు ప్ర‌భావిత ప్రాంత‌మ‌ని, ఆ ప్రాంత నాయ‌కులు రౌడీల‌ని అంటూ కించ‌ప‌రిచిన చంద్ర‌బాబు ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని కుల గొడ‌వ‌ల స్థావ‌రం అంటూ విష ప్ర‌చారం చేస్తున్నాడు. ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యేలా చేస్తున్నాడు. ఇది ఎంతో ప్ర‌మాద‌క‌రం. ప్ర‌తి చిన్న నేరాన్నీ కుల గొడ‌వ‌లుగా చిత్రించ‌డం ద్వారా లా అండ్ ఆర్డ‌ర్ స‌మ‌స్య‌ల‌ను పెంచేలా చంద్ర‌బాబు, లోకేష్ ల ట్వీట్లు ఉంటున్నాయి. దీన్ని ప్ర‌జ‌లు, సోష‌ల్ మీడియా తిప్పి కొడుతున్నాయి. ప్ర‌భుత్వం, పోలీసు వ్య‌వ‌స్థ కూడా ఈ వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్ గా తీసుకున్న రోజున బాబు అబ‌ద్ధాల‌కు చెక్ పెట్టిన‌ట్టు అవుతుంది. విష ప్ర‌చారానికి తెర ప‌డుతుంది.  

 

Back to Top