ఏపీలో ఎకాన‌మీ జోష్‌!

  గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్  

 ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అధ్యాయనంలో వెల్లడి

అమ‌రావ‌తి:  కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న తరుణంలో కూడా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ధిక వ్యవస్థ జోరు ఏమాత్రం తగ్గలేదు. పలు రాష్ట్రాల్లో ఆర్ధిక వ్యవస్థ కుదేలై, కోలుకునేందుకు సతమతమౌతుండగా ఏపీ రాష్ట్రంలో మాత్రం పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంచే రీతిలో దూసుకుపోతుండటం విశేషం. గ్రామాల్లో ఎక్కడా కూడా ప్రజల జీవనోపాధికోసం ఇబ్బంది పడుతున్న దాఖలాలు కనిపించడంలేదు. ఎకానమీ సైకిల్ పటిష్టంగా ఉండటం మూలానే కూలీ పనులకు ఎక్కువ డిమాండ్ ఏర్పడి రేట్లు పెరుగుదల కనిపిస్తుందని ఆర్ధిక నిపుణులు పేర్కోంటున్నారు.. రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు మొదలు అసంఘటిత కార్మికులు, చేతి వృత్తి పనులు చేసుకునే వారి వరకు రోజు వారి సంపాదన ఏడాదిలో 9 నుంచి 13 శాతం వరకు పెరిగినట్టు ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరక్టరేట్ అద్యాయనంలో తేలింది. అసంఘటిత కార్మికవర్గంలో అత్యంత బలహీన కేటగిరీగా భావించే గ్రామీణ ప్రాంతంలోని చేతి వృత్తి దారులు వ్యవసాయ కూలీలు రోజు వారీ కూలీ రేట్లపై ఈ సంస్థ రాష్ట్ర వ్యప్తంగా 42 రెవెన్యు డివిజన్ల పరిధిలోని 44 ప్రాంతాల్లో 16 రకాల వృత్తులలో కూలీ రేట్లపై అధ్యాయనం చేసింది.  

వ్యవసాయ కూలి రేటు రూ-48 పెరుగుదల :  

సాధార‌ణ వ్యవసాయ కూలీకి 2019-20 ఆర్ధిక సంవత్సరంలో రోజుకు రూ-368 కూలీ దక్కితే, కరోనా విపత్తు సంభవించిన 2020-21 ఆర్ధిక సంవత్సరంలో రూ-416 చొప్పున అందింది.  అంటే విపత్తువేళ కూడా కూలీ 48 రూపాయలు పెరగడం అంటే చిన్న విషయం కాదని ఆర్ధిక రంగ నిపుణులు అంటున్నారు. వ్యవసాయ కూలీల  రేట్లలో కూడా 13% పెరుగుదల నమొదైంది. అదే సమయంలో వండ్రంగి పని చేసేవారికి 9%, చెప్పులు కుట్టుకునే వారి రోజు కూలీ 8% పెరిగినట్టు అద్యాయనంలో తేలింది. అయితే ఇదే సమయంలో వ్యవసాయ పనులు చేసుకునే వారిలో స్త్రీ పురుషుల కూలీ రేట్ల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. పురుషుల రోజువారీ కూలి సరాసరి 416 చోప్పున దక్కితే మహిళలకు మాత్రం సరాసరి 298 చొప్పునే అందుకోగలిగారు. కాగా మహిళల కూలీ రేట్లలో ఏడాదిలో 12% పెరుగుదల నమొదవ్వటం గమనార్హం. 

రాష్ట్ర గ్రామీణ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపని కరోనా:

2019-20 ఆర్ధిక సంవత్సరంతో పోల్చితే 2020-21 ఆర్ధిక సంవత్సరం హోల్సేల్ ప్రెస్ ఇండెక్స్ (ధరల సూచి)లో పెరుగుదల 8.5% గా ఉంది. అంటే వినియొగ వస్తువుల ధరల సూచిలో పెరుగుదల కంటే గ్రామాల్లో చేతి వృత్తిదారులు, వ్యవసాయ కూలీల రోజు వారి వేతనాల పెరుగుదల ఎక్కువగా ఉన్నట్టు అద్యాయనం తేల్చిది. గత ఏడాది కాలంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని వ్యవస్తలను అతలాకుతలం చేస్తున్న కరోనా మన రాష్ట్రంలోని గ్రామీణ ఆర్ధిక వ్యవస్థపై ఏమాత్రం ప్రభావం చూపలేదని స్పష్టం అని ఆర్ధిక నిపుణులు పేర్కోంటున్నారు. వివిద రంగాల్లో కూలీలకు అధిక రేట్లు దక్కడానికి, గ్రామాల్లో ఎకానమీ జోష్ పెరగటానికి నిపుణులు చెబుతున్న కారణాలు చూస్తే..   

  రాష్ట్రంలోని ఎకానమీ జోష్ పెరగటానికి కారణాలు: 

వైయ‌స్ జగన్ ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా గత 23 నెలల కాలంలో ప్రజలకు నేరుగా రూ.95,528 కోట్లు.. ఇతర పథకాల ద్వారా మరో రూ.36,197 కోట్లు .. మొత్తంగా రూ.1.31 లక్షల కోట్లు రూపాయలు రైతులకి , మహిళలకు, పేదలకు నేరుగా నగదు రూపంలో అందచేశారు. ఇందులోనూ అధిక మొత్తం గ్రామీణులకే లబ్దిచేకూరింది. ఫలితంగా గ్రామీణ ప్రాంతంలో పేదలకు కోనుగోలు శక్తిలో కరోనా సమయంలో కూడా పెద్ద మార్పు చోటు చేసుకోలేదు. అందువలన గ్రామీణ ప్రాంతంలో పనులకు డిమాండ్ పెరిగిందే తప్ప తగ్గలేదు. జగన్ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో అత్యధికంగా గత ఏడాది 26.03 కోట్ల రూపాయల పనిదినాలు కల్పించింది. రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితి సైతం గతంతో పోల్చుకుంటే రెండు ఏళ్ళుగా బాగా మెరుగుపడింది. గ్రామీణ ప్రాంతంలో ఆర్ధిక వ్యవహారాలన్నీ వ్యవసాయ రంగంతోనే ముడిపడి ఉంటాయి. వ్యవసాయ పనులు తక్కువగా ఉండే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, నెలల్లో కరోనా తీవ్రత అధికంగా కనిపించడంతో వ్యవసాయ రంగంపై ప్రభావం తక్కువగానే కనిపించింది. మొత్తంగా  చూస్తే జగన్ సంక్షేమ ఫలాల కారణంగా ప్రపంచ విపత్తు సమయంలో కూడా రాష్ట్రంలో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను గాడిలోనే ఉందని ఆర్ధిక వేత్తల అధ్యాయనంలో వెళ్లడైంది.
 

Back to Top