మీరే రేపటి "ఏపీ బ్రాండ్‌' క్రియేటర్

‘ఏపీ బ్రాండ్‌ థాన్‌’ ఎంట్రీలకు ప్రభుత్వం ఆహ్వానం

అమరావతి:  సంక్షేమం- అభివృద్ధి దిశలో సాగుతున్న ప్రజా పాలనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ క్రియేటర్‌ని నేనే అని సగర్వంగా చాటాలనుకుంటున్నారా? అలాంటి వారికి ప్రభుత్వం ఓ సదవకాశాన్ని ఇచ్చింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా ఆంధ్రప్రదేశ్‌కి బ్రాండ్‌ ఇమేజ్‌ను తీసుకురావాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ‘ఏపీ బ్రాండ్‌ థాన్‌’ పేరిట ఓ కార్యక్రమాన్ని చేపట్టింది.  ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ ఇమేజ్‌కు సంబంధించి లోగో, ట్యాగ్‌లైన్ రూపొందించే అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తోంది. ఇందుకోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది.

మీరే ఓ బ్రాండ్‌ ఇమేజ్‌ను క్రియేట్‌ చేయండి. చదవగానే ఆంధ్రప్రదేశ్‌ అంతరంగం ప్రతిబింబించేలా ట్యాన్‌లైన్‌ రాయండి. ఆసక్తికలిగిన వారు తమ ఎంట్రీలను అక్టోబర్‌ 28 రాత్రి 11 గంటల వరకు ప్రభుత్వ వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. అత్యున్నతమైన మూడు ఎంట్రీలకు నగదు పురస్కారాలు అందజేస్తామని తెలిపింది. మొదటి బహుమతి రూ.50 వేలు, రెండో బహుమతి రూ.25 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.  మీ సృజనాత్మకత శక్తిరూప కల్పన రేపటి ఏపీ బ్రాండ్‌ డిజైన్‌ కావచ్చు..మరెందుకు ఆలస్యం..వెంటనే పని ప్రారంభించండి.

రిజిస్ట్రేషన్‌, ఎంట్రీలు దాఖలు చేయడానికి సందర్శించండి..https://bit.ly/2m1KVml

Read Also: అధికారం కోల్పోయాక శ్రీరంగ నీతులా?

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top