అక్ర‌మ క‌ట్ట‌డాల‌పై ఉక్కుపాదం

ప్ర‌జావేదిక నుంచి తొల‌గింపు మొద‌లు

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం

అమ‌రావ‌తి: నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం ప్ర‌జ‌లంద‌రి క‌ర్త‌వ్యం. పాల‌కులే వాటిని బేఖాత‌రు చేస్తే ఎలా అని క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ప్ర‌శ్నించారు ముఖ్య‌మంత్రి. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో ఇల్లు క‌ట్టుకుని నిబంధ‌న‌లు బేఖాత‌రు చేసారు. ముఖ్య‌మంత్రి అంత‌టి వ్య‌క్తే అలా నిబంధ‌న‌ల‌కు తిలోద‌కాలిస్తే సామాన్యులు మాత్రం వాటిని పాటిస్తారా అని సూటిగా అడిగారు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిర్మాణాల‌ను స‌హించే ప్ర‌స‌క్తే లేదు అన్న నిర్ణ‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి అధికారుల్లోకి స్ప‌ష్టంగా తీసుకువెళ్లేందుకే ప్ర‌జా వేదిక‌లో స‌మావేశం పెట్టి మ‌రీ దీన్ని కూలుస్తున్నాం అని చెబుతున్నాం అన్నారు. 
అక్ర‌మంగా క‌ట్టిన వాటికి సాధార‌ణ పెనాల్టీలు వేస్తూనో లేక అధికారుల‌కు లంచాలు ఇస్తూనో కాలం గ‌డిపేయ వ‌చ్చు అనుకుంటే ఇక కుద‌ర‌దు. అక్ర‌మ క‌ట్ట‌డాల‌పై కొర‌డా ఝుళిపించ‌డం త‌ధ్యం. ప్ర‌భుత్వం అంటే కార్య‌నిర్వాహ‌క వ‌ర్గ‌మే. క‌నుక ఉన్న‌తాధికారులు త‌మ ప్రాంతంలో ఉన్న అన్ని అక్ర‌మ క‌ట్ట‌డాల‌పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసారు ముఖ్య‌మంత్రి.  

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, కేంద్ర పర్యావరణ శాఖ లాంటివి చెప్పినా నన్ను ఎవడేం చేస్తాడులే అన్న అహంకారానికి చిహ్నం ఆ ప్రజావేదిక అక్రమ కట్టడం. కొన్ని సార్లు ఒక దృఢమైన సందేశం ప్రజలకు పోవాలంటే వాటిని కూల్చడం లాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోక తప్పదు. ప్రతీ అక్రమాన్ని తేలిగ్గా తీసుకోవడం అనేది అలవాటైపోయి ఎంత పెద్ద అక్రమం జరిగినా సమాజమన్నాక ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనే నిర్లిప్తత వచ్చేస్తుంది. అది ప్రమాదకరం.
ముఖ్య‌మంత్రిగా శ్రీ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న రెడ్డిగారి క‌లెక్ట‌ర్లు, ఎస్పీల సమావేశం చూసిన ప్ర‌జ‌ల‌కు అనిపించింది ఏమిటంటే ఇంత పట్టుదల గ‌ల సీఎం ఏదైనా సీరియస్ గా తీసుకుంటే తప్పులు జరిగే అవకాశం ఎక్కడ ఉంటుంది అని. ప్రభుత్వం తలచుకుంటే ఎన్ని మంచి పనులు చేసి గుణాత్మక మార్పులు తేవచ్చో చేసి చూపిస్తున్నారు ఈ ముఖ్యమంత్రి. ప్రజల ఆలోచనల్లో కూడా మంచి వైపు వెళ్లాలన్న విప్లవం వస్తుంది. అన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడానికి కావలసిన స్థైర్యం పరిపాలనలో కూడా చూపిస్తున్నారు గ‌న‌కు ఆ మార్పు ఖ‌చ్చితంగా సాధ్యం అవుతుంది.

Back to Top