నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్ధం..మీరు సిద్ధ‌మా..!

ఒక ఓటు-ఐదు కోట్లు

హైద‌రాబాద్: అసెంబ్లీలో తెలుగుదేశం బండారం మ‌రోసారి బ‌ద్ద‌లైంది. ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ సూటిగా వేస్తున్న ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు చెప్ప‌లేక చ‌తికిల పడింది. ఆరోప‌ణ‌లు రుజువు చేస్తే తాను రాజీనామాకు సిద్ద‌మ‌ని, లేదంటే చంద్ర‌బాబు రాజీనామా చేస్తారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబేది..!
ఓటుకి కోట్లు కుంభ‌కోణం మీద చ‌ర్చించాల‌న్న అంశం మీద ప‌క్క దారి ప‌ట్టించేందుకు అధికార తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. ఈ స‌మ‌యంలో మంత్రి అచ్చెన్నాయుడు మ‌రోసారి నోరు పారేసుకొన్నారు. దీనిపై స్పందించిన వైఎస్ జ‌గ‌న్ సూటిగా ప్ర‌శ్న‌లు గుప్పించారు. గ‌త రాత్రి కేసీఆర్ త‌న‌తో ఫోన్ తో మాట్లాడారు అని రుజువు చేస్తే తాను రాజీనామా చేస్తాన‌ని స‌వాల్ విసిరారు. లేని పక్షంలో చంద్ర‌బాబు రాజీనామా చేస్తారా అని నిల‌దీశారు. దీనిపై ఎటువంటి స‌మాధానం రాలేదు. అస‌లు కేసీఆర్ తో ఎన్నిక‌ల పొత్తు పెట్టుకొని గ‌తంలో పోటీ చేసింది చంద్ర‌బాబు కాదా అని ఆయ‌న అడిగారు. అప్ప‌టి స్నేహం గురించి ఇప్పుడు ఎందుకు దాచిపెడుతున్నార‌ని ఆయ‌న అడిగారు.

మ‌న‌వాళ్లు బ్రీఫ్ డ్ మీ..!
ఓటుకి కోట్లు కుంభ‌కోణంలో పూర్తిగా దొరికిపోయిన వ్య‌క్తి చంద్ర‌బాబు అని గుర్తు చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం బ‌య‌ట ప‌డింద‌ని చెప్పారు. అస‌లు రేవంత్ రెడ్డికి డ‌బ్బు స‌మ‌కూర్చింది చంద్ర‌బాబు అవునా.. కాదా..అని ఆయ‌న నిల‌దీశారు. ఆడియో టేపుల్లో వినిపించిన గొంతు చంద్ర‌బాబుది అవునా కాదా అని ప్ర‌శ్నించారు. దీని మీద కూడా జ‌వాబు రాలేదు.

బోలెడు సాకులు
చంద్ర‌బాబు నేరాల గురించి మాట్లాడితే కోర్టు ప‌రిధిలో ఉన్న అంశ‌మ‌ని చెప్ప‌టం ఎంత వ‌ర‌కు స‌బ‌బ‌ని ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. మ‌రి అటువంటప్పుడు త‌మ‌కు సంబంధించిన కేసుల గురించి ప‌దే ప‌దే తెలుగుదేశం స‌భ్యులు మాట్లాడ‌టం కోర్టు ప‌రిధి అంశం కాదా అని ఆయ‌న నిల‌దీశారు. దివంగ‌త మ‌హా నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేరును కూడా ప‌దే ప‌దే ప్రస్తావించిన విష‌యాన్ని ప్ర‌శ్నించారు. 
Back to Top