జ‌న‌నేత పోరుబాట

ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించ‌డం కోసం గ‌త నాలుగేళ్లుగా వైయ‌స్ జ‌గ‌న్ పోరాటం చేస్తుంటే చంద్ర‌బాబు మాత్రం త‌న స్వార్థ రాజ‌కీయాల కోసం హోదాను తాక‌ట్టు పెట్టారు. జ‌గ‌న్ పోరు బాట ప‌ట్టితే.. చంద్ర‌బాబు అవినీతి బాట ప‌ట్టారు. వెన్నుపోటు నాయ‌కుడు ఎవ‌రు?  అండ‌గా ఉండే నాయ‌కుడు ఎవ‌రు? అనేది ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంది. హోదా కోసం వైయ‌స్ జ‌గ‌న్ ఎన్ని పోరాటాలు చేశారు.. అదే హోదా కోసం బాబు ఏం చేశారు  అనే పూర్తి వివ‌రాలు ఇలా..

జగన్‌.. పోరుబాట
12.06.2014:  రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో రాష్ట్రానికి 20 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్‌. 
05.12.2014:  ప్రత్యేక హోదా సాధించని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్‌సీపీ ధర్నాలు.. విశాఖలో పాల్గొన్న జగన్‌    
16.02.2015:  లోక్‌సభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఏపీకి తక్షణం ప్రత్యేక హోదా ప్రకటించాలని పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌  
03.06.2015: ఏడాది గడిచినా సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి పట్టించుకోలేదని వైఎస్‌ జగన్‌  రెండు రోజుల పాటు మంగళగిరిలో సమర దీక్ష చేపట్టారు. బాబు పాలనపై ప్రజా బ్యాలట్‌ నిర్వహించారు. 15.06.2015: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి వైఎస్‌ జగన్‌ వినతి పత్రం    
10.08.2015: ఢిల్లీలో జగన్‌  నేతృత్వంలో ఒకరోజు ధర్నా    
29.08.2015: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పిలుపు మేరకు సంపూర్ణంగా రాష్ట్ర బంద్‌   
07.10.2015: గుంటూరులో ఏడు రోజుల దీక్ష ... ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ 07 నుంచి 13 వరకు  జగన్‌ నిరవధిక నిరాహార దీక్ష. ప్రధాని మోదీ ఏపీకి రానున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా ఆకాంక్ష  ఎంత బలీయంగా ఉందో చాటి చెప్పడానికి దీక్ష చేపడితే ప్రభుత్వం పోలీసుల ద్వారా భగ్నం చేసింది.  
17.10.2015: జగన్‌  పిలుపుతో మూడు రోజుల పాటు (17 నుంచి 21 వరకు) పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు   
10.05.2016: కలెక్టరేట్ల వద్ద ధర్నా... రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ధర్నా.. కాకినాడ ధర్నాలో జగన్‌ పాల్గొన్నారు.  
21.07.2016: రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ఏపీకి ప్రత్యేక హోదా బిల్లుకు మద్దతు   
23.07.2016:  ఆంధ్రప్రదేశ్‌కు 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని కోరుతూ పార్లమెంట్‌లో  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రైవేట్‌ బిల్లు ప్రతిపాదన  
29.07.2016: ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సమాధానం, టీడీపీ, బీజేపీ వైఖరికి నిరసనగా ఆగస్టు 2న రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్‌సీపీ పిలుపు    
02.08.2016: ప్రత్యేక హోదాకు మద్దతుగా రాష్ట్ర బంద్‌   
08.08.2016: ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి జగన్, పార్టీ ఎంపీలు వినతిపత్రం   
10.09.2016: ప్రత్యేక హోదాపై జైట్లీ వైఖరి, చంద్రబాబు తీరుకు నిరసనగా రాష్ట్ర బంద్‌   
10.09.2016: శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదా ఆవశ్యకతను చాటిచెప్పిన జగన్, ఇతర నేతలు  
26.01.2017: ప్రత్యేక హోదాకు మద్దతుగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనడానికి వైఎస్‌ జగన్‌  వెళ్తుండగా ప్రభుత్వం విశాఖలో ఎయిర్‌పోర్టులోనే అడ్డుకుంది. 
27.01.2017: ప్రత్యేక హోదాకోసం విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అప్రజాస్వామికంగా ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించిన టీడీపీ ప్రభుత్వ వైఖరిపై వైఎస్సార్‌సీపీ శ్రేణుల నిరసనలు 
10.03.2017:ప్రత్యేక హోదాను 15ఏళ్లపాటు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. 
28.03.2017: పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని లోక్‌సభలో ఎన్‌ఐటీ, ఎన్‌ఈఆర్‌ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పార్టీ ఎంపీలు కేంద్రాన్ని కోరారు. 
30.03.2017: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్‌సభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. 
06.04.2017: జీఎస్‌టీ కోసం 13, 14వ ఆర్థిక సంఘం సూచనలను పక్కన పెట్టి బిల్లును రూపొందించినట్టే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో జీఎస్‌టీ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. 
10.05.2017:ప్రత్యేక హోదా, అగ్రిగోల్డ్, రాష్ట్రంలో అవినీతి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ ప్రభుత్వ విధానాలు, మిర్చికి మద్దతు ధర తదితర అంశాలపై మోదీని కలిసి వినతిపత్రం సమర్పించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
16.07.2017: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డిలు కేంద్రాన్ని కోరారు.          
20.11.2017: హోదా సాధనకు విపక్షాలు చేపట్టిన ఛలో అసెంబ్లీ ముట్టడికి వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు. వైఎస్సార్‌సీపీ నేతలతో సహా విపక్షాలు, ప్రజాసంఘాల నేతలను అరెస్టు చేసిన పోలీసులు 
10.12.2017: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన అనంతపురం జిల్లా కూడేరులో జరిగిన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన, పోలవరం, విశాఖ రైల్వే జోన్‌తోపాటు రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీలన్నింటిని నెరవేర్చేలా కేంద్రాన్ని డిమాండ్‌ చేయాలని నిర్ణయించారు. 
01.03.2018: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల వద్ద వైఎస్సార్‌సీపీ ధర్నాలు నిర్వహించింది.  
03.03.2018:ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ఆందోళనకు బయలుదేరిన వైఎస్సార్‌సీపీ శ్రేణులకు జెండా ఊపి పంపిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
05.03.2018:ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ ఢిల్లీలో సంసద్‌మార్గ్‌లో ధర్నా నిర్వహించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు 


బాబు.. పూటకోమాట
29.04.2014: మనకు ప్రత్యేక హోదా కావాలి. ఐదు సంవత్సరాలే ఇచ్చారు. నేను నరేంద్ర మోదిగారిని కోరుతున్నా∙15 సంవత్సరాలు ఇవ్వండి. 
తిరుపతిలో ఎన్డీఏ విజయ శంఖారావం సభలో చంద్రబాబు. 
02.06.2015: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందదు. విజయవాడలో జరిగిన నవనిర్మాణ దీక్షలో ముఖ్యమంత్రి. 
12.08.2015: హోదాతోనే అన్నీ రావు... విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో.. 
13.08.2015: ప్రత్యేక హోదా ఒక్కటే చాలదు.. అదే సరిపోదు.. దాంతోనే అన్నీ సరిపోవు... విజయవాడలో స్మార్ట్‌ విలేజ్‌  కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ. 
25.08.2015: ప్రత్యేక సంజీవని కాదు... న్యూఢిల్లీలో ప్రధాని మోదీ భేటీ అనంతరం విలేకరుల సమావేశంలో.. 
23.10.2015: ప్రత్యేక హోదా అనబోయి ప్యాకేజీ అన్నా... విజయవాడలో జరిగిన ప్రెస్‌మీట్‌లో...  
26.11.2015: కేంద్రంపై ఆశలు లేనట్టే...  విజయవాడలో గణతంత్ర వేడుకల అనంతరం ఎమ్మెల్యేల  భేటీలో... 
18.05.2016: హోదాతో ఏం వస్తుంది? హోదా ఇచ్చి నిధులు ఇవ్వక పోతే ఏం లాభం? ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి? 
19.05.2016: హోదాతోనే అంతా కాదు. హోదా సంజీవని కాదు. అందుకే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ప్రధానికి విన్నవించా. 
08.09.2016: ప్రత్యేక హోదా వీలుకాదు. అదే స్ఫూర్తితో సమాన ప్రయోజనాలు ఇస్తామని చెబుతుంటే వాటిని తీసుకోకుండా ఏం చేద్దాం? 
09.09.2016: ప్రత్యేక హోదా ఇవ్వలేం. కానీ దాని వల్ల కలిగే ప్రయోజనాలను లెక్కించి ఆ మేరకు నిధులు ఇస్తామని అరుణ్‌జైట్లీ చెప్పారు. వారు ఇచ్చింది తీసుకుంటాం. అదే సమయంలో మనకు రావాల్సింది అడుగుతాం. 
10.09.2016: హోదాకు సమానంగా కేంద్రం ఇస్తామంటున్న నిధులు తీసుకోవద్దా? పోలవరం వద్దా? దెబ్బలు తగిలిన చోటే ప్రతిపక్షం కారం చల్లుతోంది. ప్రతిపక్షం చేస్తున్న బంద్‌కు సహకరించవద్దని ప్రజలను కోరుతున్నా. 
11.09.2016: హోదా వస్తే ఏం వస్తుంది? ప్యాకేజీ వద్దంటే అభివద్ధి పనులకు ఆటంకం.. కేంద్రం చెప్పినదానికన్నా అదనంగా ఏమొస్తాయో చెప్పండి. హోదా ఇచ్చినా ఈశాన్య రాష్ట్రాలలో అభివృద్ధి లేదు.  
16.09.2016: హోదాతో పరిశ్రమలు రావు. పారిశ్రామిక రాయితీలకు హోదాకు సంబంధం లేదు. 
18.09.2016: ప్రత్యేక హోదాతో ప్రయోజనం సున్నా. దానివల్ల పారిశ్రామిక రాయితీలు రావు. వస్తాయని నిరూపిస్తే దేనికైనా సిద్ధం. 
23.09.2016:హోదా కన్నా మెరుగైన ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ప్యాకేజీపై     విస్తృత ప్రచారం చేయండి. 
26.09.2016: హోదా అంటే జైలుకే... విద్యార్థుల తల్లిదండ్రులకు చంద్రబాబు వార్నింగ్‌... బాపట్లలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో... 
05.10.2016: కేంద్రం నుంచి పది రూపాయలు ఎక్కువే రాబట్టాలని చూస్తాను తప్ప రాష్ట్రప్రయోజనాల విషయంలో రాజీలేదు. ప్రత్యేక హోదాతో 
వచ్చేవన్నీ ఇస్తున్నందుకే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నాం. 
29.10.2016: ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు, పోలవరం ప్రాజెక్టుని సాకారం చేస్తున్నందుకు జైట్లీకి కృతజ్ఞతలు.  
13.11.2016: హోదాలో పరిశ్రమలకు రాయితీలు లేవు.. ప్రత్యేక ప్యాకేజీపై విమర్శలు తగవు. రాష్ట్రప్రయోజనాలే ముఖ్యం. రాజీపడను 
24.01.2017: జల్లికట్టుకు, ప్రత్యేక హోదాకు ముడిపెట్టి పోరాటం చేయమనడంలో అర్ధంలేదు. 
26.01.2017: మనమే ఎక్కువ సాధించాం.. ఏ రాష్ట్రానికైనా ఇంతకన్నా ఎక్కువ వచ్చాయా? ఆధారాలుంటే చెప్పండి. ప్రత్యేక హోదాతో సమానమైనవన్నీ వచ్చాయి. హోదాతో వచ్చే లాభాలేమిటో చెప్పండి. లాభాలు వస్తాయని ఏ జీఓలో ఉందో చూపండి.  
04.02.2017: హోదా వేస్ట్‌. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవు. 
16.02.2017: ప్రత్యేకహోదాతో ప్రయోజనం సున్నా. హోదాతో వచ్చేవన్నీ ప్యాకేజీలో ఇస్తామన్నారు. 
16.03.2017: సయోధ్యతోనే సాధ్యమైంది. సంప్రదింపుల ఫలితంగానే ప్రత్యేకసాయానికి కేంద్ర ఆమోదం. రావాల్సినవన్నీ సాధించుకుంటున్నాం. 
17.03.2017: మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు.. ప్యాకేజీకి అధికారికంగా ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు. ఈమేరకు అసెంబ్లీ తీర్మానం చేస్తున్నాం. 
06.06.2017: అదనంగా వచ్చేదేంటో.. ప్యాకేజీ కంటే ప్రత్యేక హోదా వల్ల జరిగే మేళ్లేంటి? ప్యాకేజీకి ప్రత్యేక హోదాకు వ్యత్యాసం ఏంటి? ప్యాకేజీలో లేనిదేంటి? నేను దేశంలోనే సీనియర్‌ నేతను. నేను ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. 
27.02.2018: ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి ఏమొస్తాయి. హోదాతో రాయితీలు వస్తాయని ఏ జీఓలో ఉందో చూపించమంటే చూపలేకపోతున్నారు. హోదా వస్తే పరిశ్రమలకు రాయితీలు వచ్చేస్తాయని కొందరు మభ్య పెడుతున్నారు. 
02.03.2018: టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం... రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని తెలుగుదేశం పార్టీ ఎక్కడా, ఎప్పుడూ అనలేదు. 
14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అడ్డంకులు ఉన్నాయని కేంద్రం చెప్పడం వల్లే ప్రత్యేక సాయానికి అంగీకరించాం.   
06.03.2018: టీడీపీ శాసనసభాపక్ష సమావేశం... రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నదే మన డిమాండ్‌? ఎవరూ ప్రత్యేక ప్యాకేజీ అనే ప్రస్తావన కూడా తేవద్దు. ప్రత్యేక హోదా గురించే అందరూ మాట్లాడాలి. 
07.03.2018: ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని అరుణ్‌ జైట్లీ అవమానకరంగా మాట్లాడారు. ప్రత్యేక హోదా ఎవరికీ ఇవ్వడంలేదని, అందులో ఉన్న అంశాలన్నింటినీ ప్రత్యేక సాయం కింద ఇస్తామని అప్పుడు ప్రకటించారు.   

హోదా సాధనకు యువభేరీలు..          
15.09.2015:     తిరుపతి   
22.09.2015:     విశాఖపట్నం   
27.01.2015:     కాకినాడ   
02.02.2016:     శ్రీకాకుళం   
04.08.2016:     నెల్లూరు   
22.09.2016:     ఏలూరు   
25.10.2016:      కర్నూలు   
19.12.2016:      విజయనగరం   
16.02.2017:      గుంటూరు   
10.10.2017:      అనంతపురం  

రాష్ట్రపతితో భేటీ
09.06.2015: వైఎస్‌ జగన్‌  నేతృత్వంలోని ప్రతినిధివర్గం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో భేటీ అయ్యింది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే విధంగా చూడాలని విజ్ఞప్తి చేసింది.   

23.02.2016: ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలసిన వైఎస్‌ జగన్‌.. ప్రత్యేక హోదాతో పాటు విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేలా చూడాలని వినతి   

ప్రధానిని కలిసిన జగన్‌ 
19.05.2014: ప్రత్యేక హోదాతో పాటు విభజన బిల్లులోని హామీలు నెరవేర్చాలని వైఎస్‌ జగన్‌మోహ¯న్‌ రెడ్డి.. కాబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలోని గుజరాత్‌ భవన్‌లో కలిసి విజ్ఞప్తి చేశారు.   

30.03.2015:ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్‌ జగ¯న్‌ నేతృత్వంలోని ప్రతినిధి వర్గం విభజన హామీలను నెరవేర్చాలని వినతి పత్రం    
కేంద్ర మంత్రులకు వినతి 

11.06.2015:ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని జగన్, పార్టీ నేతలు కలిసి   ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.  
27.04.2016:ఢిల్లీలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి జగన్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతిపత్రం. 
Back to Top