- అనంతపురం యువభేరిలో ఉత్సాహంగా పాల్గొన్న యువత- మొదటి కార్యక్రమానికి ఇప్పటికీ తీవ్రమైన మార్పు- హోదాపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న యువతరం
ప్రత్యేక హోదా సాధించడానికి వైయస్ జగన్ చేపట్టిన యువభేరి ఉద్యమం ఇప్పుడు కీలక ఘట్టానికి చేరుకుంది. అనంతపురం జిల్లాలో మంగళవారం జరిగిన యువభేరి కార్యక్రమంలో యువత, విద్యార్థులు సంధించిన ప్రశ్నలే దీనికి నిదర్శనం. హోదా గురించి తెలుసుకునే పరిస్థితి నుంచి ప్రభుత్వన్ని ప్రశ్నించే స్థితికి విద్యార్థులు, యువతను మేల్కొల్పడంలో జగన్ చిత్తశుద్ధి అభినందనీయం... ఆయన కృషి అనిర్వచనీయం. గత మూడున్నరేళ్లుగా నిరాహార దీక్షలు, రాష్ర్టవ్యాప్త బంద్‌లు, కొవ్వొత్తుల ర్యాలీలు తదితర ఏదో ఒక కార్యక్రమాల రూపంలో ఉద్యమిస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 15న తిరుపతిలో చేపట్టిన మొట్టమొదటి యువభేరి మొదలుకొని ఈరోజు అనంతపురంలో జరిగిన యువభేరి వరకు గమనిస్తే విద్యార్ధులు, యువతలో తీవ్రమైన మార్పు కనిపిస్తుంది. తొలి నాలుగైదు యువభేరీల్లో ప్రత్యేక హోదా ఆవశ్యకత, లాభాల గురించి చెప్పడానికి జగన్ కేటాయిస్తే.. ఆరో యువభేరి నుంచి విద్యార్థులే ప్రభుత్వాన్ని ప్రశ్నంచడం మొదలైంది. ప్రజల్లో ప్రత్యేక హోదా గురించి అవగాహన కల్పించడంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పార్టీ అధినేత, వైయస్ జగన్ ప్రత్యేక హోదా వంటి ఒక బ్రహ్మ పదార్థాన్ని తలకెత్తుకుని అందరికీ వివరించడంలో అపూర్వ విజయం సాధించారు.
ఎప్పటికప్పుడు కొత్తగా..ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో.. వారి మద్దతు కూడగట్టడంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలతో దూసుకుపోతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు వైయస్ జగన్. ముఖ్యమంత్రి భజనలో మీడియా మునిగితేలినా.. పక్క రాష్ర్టంలో జరిగిన జల్లికట్టుకు ఇచ్చిన ప్రాధాన్యత.. సొంత రాష్ర్టంలో జరుగుతున్న ప్రత్యేక హోదా ఉద్యమానికి ప్రాధాన్యత ఇవ్వకున్నా.. ఆయనెక్కడా వెనక్కి తగ్గలేదు. సరైన సమయంలో తీసుకున్న విశాఖ కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా ప్రజల్లో ఉద్యమ స్పూర్తిని తీసుకొచ్చారు. శాంతి ర్యాలీలో పాల్గొనకుండా ఆయన్ను ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేసినా ఉద్యమ తీవ్రత ఎంతుందో ప్రభుత్వానికి తెలిసొచ్చింది.
యువతలో పెల్లుబికుతున్న ఉత్సాహం ప్రత్యేక హోదా ఉన్న రాష్ర్టాల్లో జరుగుతున్న అభివృద్ధి, ఏర్పాటవుతున్న సంస్థలు, నెలకొల్పుతున్న పరిశ్రమలు, యువత సాధిస్తున్న ఉద్యోగాలు వంటి వివరాలతో సహా విద్యార్థులకు వివరించి మన రాష్ర్టానికి ప్రత్యేకహోదా ఎంత అవసరమో యువతకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు టీడీపీ నాయకులు ప్రత్యేక హోదా ఉన్న రాష్ర్టాల్లో పెట్టుబడులు పెట్టిన విషయాలు కూడా వెలుగులోకి తీసుకురావడం ద్వారా టీడీపీ ఆడుతున్న డ్రామాలపై ప్రజలకు కనువిప్పు కలిగించారు. మాటలు చెప్పడమే తప్ప చేతల్లో చూపించలేని చంద్రబాబు చేతకానితనంపై ప్రజలకు అవగాహన వచ్చేసింది. ఇదంతా ఒక ఎత్తయితే వచ్చే నెలలో ఆయన చేయబోతున్నపాదయాత్ర కారణంగా ప్రత్యేక హోదా ఉద్యమానికి ఏమాత్రం విశ్రాంతి ఇవ్వకుండా.. ఆ బాధ్యతను నియోజకవర్గ బాధ్యులకు అప్పగించి మరింత ఉధృతం చేసేందుకు ఉద్యమ కార్యాచరణకు రూపకల్పన చేయడం మెచ్చుకోదగ్గ నిర్ణయం. రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా అంశమే ప్రభుత్వాన్ని శాసించగలదని రాజకీయ విశ్లేషకుల అంచనా..