విశాఖపట్నం: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తూ విశాఖలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై వైయస్ఆర్‌సీపీ నాయకులు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విశాఖ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కెకె రాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణితోపాటు పలువురు పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసి వచ్చారు. అనంతరం స్టేషన్ బయట వారు మీడియాతో మాట్లాడారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా అర్థరాత్రి విశాఖలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని, వాటిని ఏర్పాటు చేసిన వారిపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఫీలయ్యే బీజేపీ నాయకులు తిరుమల లడ్డూపై టీడీపీ నాయకులు విషం చిమ్ముతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ప్రశ్నించారు. విశాఖలో రూ.5 వేల కోట్ల విలువైన భూములు చంద్రబాబు తన కుటుంబ సభ్యుడికి చెందిన గీతంకి కట్టబెట్టడంపై మేం ఉద్యమిస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మతాలు, పార్టీల మధ్య గొడవలు సృష్టించే కుట్ర చేస్తున్నారని వారు మండిపడ్డారు. ● చంద్రబాబు ప్రజల్లో భయోత్పాతం సృష్టిస్తున్నాడు - కెకె రాజు, విశాఖ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు తిరుమల లడ్డూకి వాడిన నెయ్యిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఇతర కూటమి నాయకులు ఆరోపించినట్టుగా జంతువుల కొవ్వు కానీ, చేపల నూనె కానీ కలవలేదని సీబీఐ సిట్ చార్జిషీట్‌తో తేటతెల్లం అయ్యింది. సిట్ నివేదిక బయటకు రావడంతో రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది భక్తులు ఆరాధించే కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపైనే తప్పుడు ప్రచారం చేయడాన్ని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని చెప్పిన వారి ఇళ్ల మీద కూటమి నాయకులు దాడులతో తెగబడుతూ విధ్వంసం సృష్టిస్తున్నారు. వారే దాడులు చేసి బాధితులైన మా పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారు. వరుసపెట్టి మా పార్టీ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి, విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు, అంబటి రాంబాబుల మీద జోగి రమేష్ ఇంటి మీద ప్రణాళిక ప్రకారం దాడులు చేయించారు. చంద్రబాబు అసమర్థ పాలనను ప్రశ్నిస్తే టీడీపీ గూండాలను దాడులకు ఉసిగొల్పుతున్నారు. దాడులు, కేసులతో ప్రశ్నించే గొంతు నొక్కాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబే శాంతిభద్రతలకు విఘాతం కలిగేంచేలా వ్యవహరిస్తూ ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాడు. నేరుగా కూటమి ఎమ్మెల్యేలే దాడుల్లో పాల్గొంటూ విధ్వంసం సృష్టిస్తూ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్టు? ఇంత చేసి కూడా తన ఎల్లో మీడియాతో ఆ నెపాన్ని వైయస్ఆర్‌సీపీ మీదకు నెట్టే కుట్ర చంద్రబాబు చేస్తున్నాడు. భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలి. రాజకీయ నాయకులకు బానిసలుగా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసులకు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధిచెబుతారు. అర్థరాత్రి విశాఖలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలి. మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న కూటమి నాయకులపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఫీలయ్యే బీజేపీ నాయకులు తిరుమల లడ్డూపై టీడీపీ నాయకులు విషం చిమ్ముతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ ఫ్లెక్సీలపై తక్షణమే బయటకొచ్చి తొలగించేలా చూడాలి. విశాఖలో రూ.5 వేల కోట్ల విలువైన భూములు చంద్రబాబు తన కుటుంబ సభ్యుడికి చెందిన గీతంకి కట్టబెట్టడంపై మేం ఉద్యమిస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మతాలు, పార్టీల మధ్య గొడవలు సృష్టించే కుట్ర చేస్తున్నారు. ● రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి - వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ రాష్ట్రంలో కూటమి నాయకులు సృష్టిస్తున్న విధ్వంసం చూస్తుంటే మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. వైయస్ఆర్‌సీపీ నాయకుల ఇళ్ల మీద పెట్రోల్ బాంబులతో దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూడటం దుర్మార్గం. అంబటి రాంబాబు గారు తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం ప్రకటిస్తూ వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించినా దాడులు చేసి ఇంటిని ధ్వంసం చేశారంటే ఇది ప్రణాళిక ప్రకారం ఆయన్ను అంతం చేయడానికి జరిగిన కుట్ర. ఈ దాడిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి ఎందుకు స్పందించలేదు? తిరుమల లడ్డూ విషయంలో కూటమి నాయకులు చేసిన కుట్రను బయటపెడుతుంటే కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారు. గీతంకి భూములు కట్టబెట్టడంపై ప్రశ్నిస్తూ ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేకపోతుంది. ప్రభుత్వంపై వస్తున్న తీవ్ర వ్యతిరేకతకు సమాధానం చెప్పుకోలేక వరుసపెట్టి మా నాయకులపై దాడులు చేస్తున్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త దాడుల్లో పాల్గొనడంపై ఏం సమాధానం చెబుతారు? తిరుమల లడ్డూపై చేసిన దుష్ప్రచారానికి వారు క్షమాపణలు చెప్పాలి. అధికార పార్టీ నాయకులే విద్వేషాలు రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నారు. దీనిపై గవర్నర్ కలగజేసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలి.