నియోజకవర్గాల పునర్విభజన ఏపీకి సంజీవనా?

– సమస్యలను పక్కన పెట్టి రాజకీయం
– ఏడాదిన్నర తర్వాత కలిసింది అందుకేనా
– రాష్ట్ర ప్రజలతో చంద్రబాబు ఆటలు 


దాదాపు ఏడాదిన్నర తర్వాత మోడీ అపాయింట్‌ మెంట్‌ దక్కించుకున్న చంద్రబాబు.. వారిద్దరి మధ్య జరిగిన భేటీని తూతూ మంత్రంగా ముగించారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం అని చెప్పుకోవడం తప్ప నాలుగేళ్లలో ఏం సాధించలేకపోయారు. ఎన్నో ఢక్కామొక్కీలు తిని ఎందరో మేధావులతో పనిచేశానని.. ఎందరినో మెడలు వంచానని విప్లవాత్మక ఆవిష్కరణల వెనుక నా ఆలోచనలే ఉన్నాయని.. ఐటీని కనిపెట్టానని.. అబ్దుల్‌ కలాంని రాష్ట్రపతిని చేశానని, అంబేద్కర్‌కు భారతరత్న ఇప్పించానని చెప్పుకోవడం తప్ప ఈ తరం గర్వించేలా... కళ్లకు కనిపించేలా ఒక్క పనీ చేయకపోగా ఎన్నికల వాగ్ధానాలనే నెరవేర్చలేక కుంటి గు్రరంలా మన రాష్ట్రాన్ని లాక్కొస్తున్నాడు. ఆర్థిక మేధావినని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు 2014లో రాష్ట్ర విభజన నాటికి ఏపీకి రూ. 90 వేల కోట్లు అప్పు వస్తే మూడున్నరేళ్లలో దానిని మరో లక్షా 20 వేల కోట్లు పెంచి మొత్తం మీద రాష్ట్రాన్ని అప్పుల్లో రెండు లక్షల కోట్ల తీరం దాటించాడు. అవినీతిలో దేశంలోనే రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపాడు. ఎయిడ్స్‌లోనూ ఏపీకి పట్టాభిషేకం చేశాడు. ఎస్సీల మీద దాడుల్లో రెండో స్థానంలో నిలబెట్టాడు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి అమరావతికి పలాయనం చిత్తగించాడు. గోదావరి పుష్కరాల్లో చనిపోయినా.. కృష్ణానదిలో బోట్‌ ప్రమాదంలో చనిపోయినా విచారణ పేరు చెప్పి తాళ పత్ర గ్రంథాలకు బూజు పట్టించాడు. కాపు రిజర్వేషన్ల కోసం పోరాడితే మూడేళ్లు సాగదీసి పరిష్కారం లేని ఉపాయం చెప్పాడు. కేంద్రం చేయాల్సిన పోలవరం ప్రాజెక్టును అరువుకు తెచ్చుకుని నిధులన్నీ మింగేసి అంచనాలు నాలుగింతలు చేసి.. మూడున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలో చేతులెత్తేశాడు. 900 కోట్లతో కట్టిన అసెంబ్లీ చిన్న వర్షానికి నీళ్లుగారిపోయింది. హైకోర్టు కోసం 1500 కోట్లు కేంద్రం నిధులిస్తే కట్టకుండా మాయం చేసేసిన ఘనత శ్రీమాన్‌ చంద్రబాబుది. విభజన చట్టప్రకారం ఏపీలో కలపాల్సిన 7 ముంపు మండలాల విషయంలో రాజీనామా చేస్తానని డ్యాన్సులు కట్టిన చంద్రబాబు.. విశాఖ రైల్వేజోన్, చెన్నై– విశాఖ ఇండస్ట్రియల్‌ కారిడార్, దుగరాజపట్నం పోర్టు, ప్రత్యేక హోదా విషయంలో ఏనాడూ నోరు మెదపలేదు. రాజీనామా చేస్తానన్న పెద్ద సవాల్‌ను పక్కనపెడితే కనీసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయకపోవడం విచారకరం. ఎంత సేపటికీ ప్రతిపక్షం మీద పడి గొంతు చించుకోవడం తప్ప ఒక్క మేలు చేసిన దాఖలాలు లేవు. సోమవారం గ్రీవెన్స్‌ సెల్‌లో వినతిపత్రాలు ఇచ్చినట్టు ప్రధానికి ప్రింట్‌ తీసిన పేపర్లు ఇచ్చిరావడం చూస్తుంటే విగ్రహం ముందు ప్రార్థనలా ఉంది. కానీ.. ఏనాడూ ముఖాముఖి నిలదీసిన సందర్భం లేదనే చెప్పాలి. సుదీర్ఘంగా ఏపీని వేధిస్తున్న సమస్యలుంటే అవన్నీ పక్కన పెట్టి నియోజకవర్గాల సంఖ్యను పెంచమని కోరడం చంద్రబాబు అసమర్థతకు నిదర్శనం. కేంద్ర మంత్రి గడ్కరీని కలవడానికి ప్రత్యేక విమానాల్లో వెళ్లే చంద్రబాబు తాను ముఖ్యమంత్రినన్న కనీస విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. మంత్రి కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్‌ తీసుకుని హుందాగా కేంద్రమంత్రిని కలిసి సమస్యలను పరిష్కరించేది మాని ఆయన కోసం ఉన్నచోటికల్లా పోవడం.. చంద్రబాబు తన ఇమేజ్‌ని తానే తగ్గించుకోవడమే. నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ చంద్రబాబు రాష్ట్ర విభజన గురించే మాట్లాడటం చూస్తుండటం చాలా అవమానకరం. అశాస్త్రీయంగా విభజన జరిగిందని.. ఏపీకి అన్యాయం జరిగిందని మైకుల్లో గొంతు చించుకునే చంద్రబాబు... బీజేపీ నేతల భేటీలో మాత్రం ఒకరినొకరు పొగడటం ఏపీ ప్రజలను అవమాన పర్చడమే. ప్రత్యేక హోదా కోసం పోరాడామని ఐదేళ్లు కాదు.. పదేళ్ల కోసం పోరాడామని.. కాదు పదిహేనేళ్లు కావాలని మందీమార్భలంతో వెంకన్న సన్నిధిలో గప్పాలు పోయారు. కానీ ఆ తర్వాత ప్యాకేజీని స్వాగతించి ఏపీ ప్రజలను గొ్రరెల కింద లక్కగట్టారు. 

ఇలాంటి పరిస్థితుల్లో కూదా అఖిలపక్ష సమావేశానికి అందరినీ తీసుకుని ఢిల్లీ వెళ్లి ఒత్తిడి పెంచడానికి చంద్రబాబు సిద్ధం కాకపోవడం విచిత్రం. మీడియా గోష్టిలో ఆయన కాంగ్రెస్‌పైన, వైయస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌పైన తీవ్రమైన పదాలతో ఎదురుదాడి చేశారు గానీ నిజంగా నూతన రాష్ట్ర దురవస్థకు ప్రధాన కారణమైన కేంద్రాన్ని పల్లెత్తు మాటనలేదు. 
Back to Top