కేంద్ర, రాష్ట్రాల వంచనకు వ్యతిరేకంగా

మోసాలకు
మూలవిరాట్టు. వంచనలో అనుభవజ్ఞుడు చంద్రబాబు. చంద్రబాబు తాను చేసిన
అన్యాయాలకు, అసమర్థ పాలనకు ముసుగేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు.
కేంద్రం తప్పే గానీ తన తప్పేం లేదని కప్పిపుచ్చుకునేందుకు పన్నాగాలు
పన్నుతున్నాడు. దీన్ని తిప్పి కొట్టేందుకు, బాబు చేస్తున్న మోసాలకు తగిన బుద్ధి చెప్పేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
వంచన వ్యతిరేక దీక్షను చేసింది. వంచన వ్యతిరేక గర్జన నిర్వహించింది.
దానికి కొనసాగింపుగా వంచన వ్యతిరేక నిరసనలు తెలిపేందుకు సిద్ధం అవుతోంది.
చంద్రబాబు అబద్ధాలకు, కుట్రలకు బలైన తెలుగు ప్రజలంతా
ఈ నిరసనలో పాలు పంచుకుంటున్నారు.  జూన్ రెండో తేదీన రాష్ట్రవ్యాప్తంగా నల్ల బాడ్జీలతో
చంద్రబాబు వంచనకు, కేంద్రం చేసిన మోసానికి వ్యతిరేకంగా వైఎస్సార
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదం తొక్కునున్నాయి. నల్లబ్యాడ్జీలు
ధరించి నిరసన వ్యక్తం చేయడంతోపాటు, నెల్లూరులో  వంచన  పై
గర్జన సభను నిర్వహిస్తున్నారు.

బాబు
వంచనల పర్వం ఇది

హోదా
బదులు పాకేజీకి అంగీకరించాడు.
హోదా కంటే ప్యాకేజీలోనే ఎక్కువ లాభం అని వాదించాడు. అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం పెట్టి మరీ చప్పట్లు కొట్టాడు. సన్మానాలు చేసాడు. ఇప్పుడు కేంద్రం ఏమీ ఇవ్వలేదు అని
మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడు. కేంద్రం మాటలు నమ్మి బోల్తాపడ్డ
అమాయకుణ్ణి అని ఆస్కార్ నటనను చూపిస్తున్నాడు.

కేంద్రంతో
గొడవ పడితే పోలవరం ఆగిపోతుందని,
రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని మెత్తగా ఉన్నాను అని చెప్పుకుంటున్నాడు.
అధికారంలో ఉన్న బిజెపిని ఎదిరించలేక సామరస్యంగా నిధులు అడుగుదామనుకున్నానంటూ
సన్నాయి నొక్కులు నొక్కిస్తున్నాడు. రాష్ట్ర ప్రయోజనాలను తొక్కిపెట్టే
హక్కు ఏ ప్రభుత్వానికీ ఉండదని బాబుకు తెలియదనుకోవాలా?

నాలుగేళ్లుగా
కేంద్రబడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోంది. ప్రతి సారీ బడ్జెట్ కు
ముందు కేంద్రం బోలెడు ఇచ్చింది అనడం, తీరా బడ్జెట్ తర్వాత నిరాశ
కలిగించింది, దీనిపై కేంద్రంతో చర్చిస్తామని చేతులు దులుపుకోవడం
ఇదేగా చంద్రబాబు చేసింది.

విభజన
హామీల కోసం కాకుండా సొంత రాజకీయ అవసరాలకోసం దిల్లీలో పడిగాపులు పడటం వంచన కాదా?

ఓటుకు
నోటు విషయంలో మోదీ వద్ద బిగుసుకుపోయి రాష్ట్ర ప్రయోజనాలు గంగలో కలపడం ద్రోహం కాదా?

కేంద్రంతో
పోరాడేందుకు 4 ఏళ్లుగా తెగించని బాబు, ప్రతిపక్ష పార్టీ యుద్ధం ప్రకటించగానే
పంచలెగ్గట్టుకు రావడం నాటకీయతే కదా?

పార్లమెంట్
లో ఎమ్
.పిల
గోడమీద పిల్లి వాటం బాబు మోసంలో భాగం కాదా?

ప్రతిపక్ష
పార్టీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టినప్పుడు,
ఇతర పార్టీల మద్దతు కూడగడుతున్నప్పుడు, ఎమ్.పిల రాజీనామాలు చేయిస్తున్నప్పుడు, నిరవధిక నిరాహారదీక్షకు
దిగినప్పుడూ నాటకాలతో తప్పించుకు తిరిగిన టిడిపి అధినేతది వంచనకాక మరేమిటి!!

చంద్రబాబు
ఎన్డీయే నుంచి బైటకు వచ్చినా మోదీ కానీ,
అమిత్ షా కానీ కనీసం స్పందించకపోగా, బాబు చేసిన
నిర్వాకాలను బైట పెట్టడటం చూస్తే, కేంద్రంపై ఒత్తిడి తేవడం,
మోదీతో యుద్ధం చేయడం అనే బాబుగారి భజన బృందపు మాటలన్నీ ఉత్తవే అని తేలినట్టు
కాదా?

తెలుగు
ప్రజలను ఇంత దారుణంగా వంచించి కూడా సభలు పెట్టి, ఎసిలో ఒక్కపూట నిరాహార దీక్ష చేసి,
సైకిల్ ర్యాలీలు తీయడం ఎవరిని మభ్యపెట్టడం కోసం చేస్తున్నారు?

హోదాపై
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరికి నిరసనగా నల్ల దుస్తులతో, నల్ల బాడ్జీలతో వంచన వ్యతిరేక
దీక్షను చేపట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. విశాఖ లో జరిగిన
ఈ దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచీ భారీగా తరలి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు
దీక్షను జయప్రదం చేసారు. కలెక్టరేట్ల ముందు నిరసన వ్యక్తం చేసారు.
ప్రతిపక్ష పార్టీ అధినేత వైఎస్ జనగ్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు అన్ని
మండలాల్లో రెండు రోజుల పాటు ‘వంచనపై గర్జన’ పాదయాత్రలు నిర్వహించారు. దీనికి కొనసాగింపుగా జిల్లాల
వారీగా వంచన వ్యతిరేక దీక్షలు మరోసారి చేపట్టనున్నారు.

 

Back to Top