టాప్ టెన్ అబద్దాలు.. చంద్రబాబు తాజా అబద్దాలు

విజయవాడ: అబద్దాలు చెప్పటంలో చంద్రబాబు సిద్ధహస్తులు. అతికినట్లుగా అబద్దాన్ని చెప్పాలంటే ఆయన తర్వాతే. రైతుల రుణమాఫీ చేసేశానని, రైతులంతా ఆనందంతో సన్మానాలు చేస్తున్నారని ఒకసారి చెప్పారు. పట్టిసీమ తో రాష్ట్రంలో నీటి సమస్య తీరిపోయిందని మరోసారి చెప్పారు. తాజాగా విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్ లో అలవోకగా అబద్దాల చిట్టా విప్పేశారు. అందులోంచి మచ్చుకు కొన్ని..

1) పదేళల్లో నేను ఎప్పుడూ జేబులో రూపాయి కూడా పెట్టుకోలేదు.
2) రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నేను నిజాయతీగా వ్యవహరిస్తున్నాను.
3) నా జీవితం అంతా తెరిచిన పుస్తకం
4) రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎంత ఆస్తి ఉందో, ఇప్పుడు అంతే ఆస్తి
5) ఆస్తులు, వ్యాపారాలు కుటుంబసభ్యులే చూసుకొంటారు.

6) వాచీ, ఉంగరం కూడా పెట్టుకోకుండా సామాన్యంగా ఉంటాను.
7) రాజకీయాల్లో విలువలు పాటిస్తున్నాను.
8) మనుమడిని చూడటానికి కూడా ఇంటికి వెళ్లకుండా అభివ్రద్ది చేస్తున్నాను.
9) కుటుంబ ఆస్తులు సక్రమంగా నిర్వహిస్తూ ప్రకటిస్తున్నాం.
10) ఎన్నికల సమయంలో ఎన్ని నిధులు వచ్చినా సవ్యంగా వినియోగించి లెక్కలు చూపించాం.

ఈ స్థాయిలో అబద్దాలు చెప్పటం చంద్రబాబుకే సాద్యం అవుతుంది ఏమో. జేబులో రూపాయి లేకుండానే సింగపూర్ లో బ్లాక్ మనీ పోగేసుకోవటం, నల్ల ధనంతో తెలంగాణ లో ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేయటం జరిగిందా అన్నది ప్రశ్న. దీన్నే రాజకీయాల్లో నిజాయతీ అనుకోవాలేమో. సొంత మామగారిని వెన్నుపోటు పొడవటాన్ని తెరిచిన పుస్తకం అనుకోవాలి. 

ఇక రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రెండున్నర ఎకరాల ఆస్తి అన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు ఎన్ని లక్షల కోట్ల రూపాయిల ఆస్తి అన్నది లెక్క పెట్టడానికి అందని విషయం. ఆస్తులు, వ్యాపారాలు కుటుంబ సభ్యులు చూసుకొన్నా.. నల్ల దనం విషయాలు బాబుగారి కోటరీ చూసుకొంటారని గిట్టని వారు అంటుంటారు. చెప్పుకొంటూ వెళితే చంద్రబాబు అబద్దాల గుట్టు ఎంతైనా ఉంటుంది కాదంటారా.. 
Back to Top