తెలుగుదేశంలో సన్ స్ట్రోక్ బాగా పనిచేస్తోందా..!


() నేతల తప్పులకు బాబు సమర్థన, కొడుకుల తప్పులకు నాయకుల సమర్థన

() వరుసగా బయటకు వస్తున్న కొడుకుల
వ్యవహారాలు

() మొన్నబోండా ఉమ, నిన్న
రావెల కిశోర్, నేడు ఆనం ల సంతానం బాగోతాలు

హైదరాబాద్) తెలుగుదేశం పార్టీ
నాయకులకు వేసవి మొదలు కాకుండానే సన్ స్ట్రోక్ మొదలైంది. ఒకొక్క చోట ఒక్కొక్క
నాయకుడి కొడుకు చెలరేగిపోతున్నారు. అయితే వాటిని తండ్రుల స్థానంలోని నేతలు
సమర్థించుకొంటుండగా,  ఈ బాగోతాలకు
చంద్రబాబు శ్రీరామ రక్షగా నిలుస్తున్నారు. దీంతో కొడుకుల చిందులాట కు అడ్డు
లేకుండా పోతోంది.

రాజధానిలో వీధి రౌడీ
బాగోతాలు

విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే
బోండా ఉమ వ్యవహారం లోకానికంతటికీ తెలుసు. అసెంబ్లీ లో నిస్సిగ్గుగా రేయ్..
పాతేస్తా.. అంటూ ప్రతిపక్ష  ఎమ్మెల్యేలను
బూతులు తిట్టారు. ఇటువంటి వైఖరిని చూసి కొందరు ఆయన్ని అసెంబ్లీ రౌడీ అని గుస
గుసలాడుకొన్నారు. ఇక, విజయవాడలో కాల్ మనీ సెక్సు రాకెట్ సహా అనేక భారీ నేరాలకు
బోండా ఉమ అండగా నిలిచారు. ఇటువంటి నాయకుడి కుమారుడు రవితేజ పుట్టిన రోజు అంటూ భారీ
వాహనాలతో విజయవాడ లో ర్యాలీ తీశారు. రాంగ్ రూట్లలో సైతం వేగంగా నడుపుతూ రౌడీయిజం
వారసత్వాన్ని నిలబెట్టారని అనిపించారు. అప్పట్లో అతడి వ్యవహారాన్ని చూసి కూడా
పోలీసులు కళ్లు మూసుకొని కాలం గడిపేశారు. మరో కొడుకు సిద్ధార్ధ్ వాహనాన్ని
విచ్చలవిడిగా నడిపి, కుక్క అడ్డు వచ్చిందని కథ చెప్పి , పోలీసులు బాగా నమ్మేసి
కేసు మూసేశారు.

మంత్రి రావెల తనయుడుది
కుక్క కథే

హైదరాబాద్ బంజారాహిల్స్ లో
పట్ట పగలు మహిళా టీచర్ ను వేధించి, చెర పట్టేందుకు ప్రయత్నించి మంత్రి రావెల
కిశోర్ బాబు కుమారుడు సుశీల్ దొరికిపోయాడు. స్థానికులు పట్టుకొని పోలీసు స్టేషన్
కు అప్పగించారు. తీరా అక్కడ నుంచి పోలీసుల్ని బెదిరించి జారుకొన్న సుశీల్ కూడా
కుక్క కథే వినిపించారు. కుక్క అడ్డువచ్చిందని, దాన్ని కాపాడేందుకు కారు దిగానని
చెప్పారు. కొడుకు సుశీల్ చాలా మంచివాడని, అతడ్ని ఇరికించేందుకు ప్రతిపక్ష నేత
వైఎస్ జగన్ కుట్ర పన్నారని మంత్రి రావెల కిషోర్ అడ్డగోలుగా చెలరేగిపోయాడు.

ఆనం కొడుకుది అదే దారి

మాజీ మంత్రి, టీడీపీ
నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి కొడుకు వివాదం తాజాగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాళహస్తి
దేవాలయానికి మిత్రులతో కలిసి దర్శనానికి వెళ్లిన ఆనం శుభంకర్ రెడ్డి అక్కడ దేవాదాయ
శాఖ అధికారుల మీద తిట్ల దండకం అందుకొన్నారు. మహిళా ఈవో భ్రమరాంభ ను ఉద్దేశించి
తీవ్రంగా బెదిరించారు. చంద్రబాబు తో చెప్పి వెంటనే బదలీ చేయిస్తానని బెదిరించారు.
ఎటువంటి ప్రోటోకాల్ అర్హత లేని శుభంకర్ కు మర్యాదలు ఏం చేస్తాం అని నచ్చ
చెప్పేందుకు సిబ్బంది ప్రయత్నించినా పట్టించుకోలేదు.

          మొత్తం మీద తెలుగుదేశం నాయకులు కొడుకులు అడ్డ గోలుగా
చెలరేగిపోతున్నట్లు అర్థం అవుతోంది. అయితే అన్ని ఘటనల్లోనూ తండ్రులే స్వయంగా
కొడుకుల్ని ప్రోత్సహించినట్లుగా అర్థం అవుతోంది. దీన్ని బట్టి తెలుగుదేశం విధానాలు
ఎటువంటివనేది తెలుస్తోంది. 

Back to Top