సంకల్పం ధృడమైనదైతే..ఉత్సాహం ఉరకేలుస్తుంది.

సంకల్పబలం, చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ, మనిషి సాధించలేనిది ఏముంటుంది?  "మానవుడే తలచినచో గిరులనెగురవేయడా?  మానవుడే తలచినచో నదుల గతులు మార్చడా?  మానవుడే తలచినచో భూమ్యాకాశాలనే ఏకముగా చేయగల సేతువు నిర్మించడా" అని మహాకవి శ్రీశ్రీ ఒక కవితలో అంటారు.  
మూడువేల సుదీర్ఘ పాదయాత్రకు వైసిపి అధినేత జగన్ మోహన్ శ్రీకారం చుట్టినపుడు "ఇది సాధ్యమా?  ఈ రోజుల్లో కూడా పాదయాత్రలు అవసరమా? "  అని ఒక మిత్రుడిని ప్రశ్నించాను.  "అన్ని ఆలోచించే జగన్ నిర్ణయం తీసుకుంటాడు.  తీసుకుంటే మార్చుకోడు" అని బదులిచ్చాడు అతను.  
మొదట్లో పదిరోజులపాటు తడబడుతున్నట్లు నాకు అనిపించింది.  జగన్ ముఖంలో అలసట, నిస్తేజం కనిపించాయి.  కొన్ని క్షుద్రపత్రికలు అదే సమయంలో 'జగన్ నడుము నొప్పితో బాధపడుతున్నాడు, మాలిష్ చేయించుకుంటున్నాడు, కాళ్ళు వాచిపోయాయి, పాదాలు బొబ్బలెక్కాయి... పాదయాత్రకు బ్రేక్ ఇస్తున్నాడు' అని వార్తలు ప్రచురించాయి. ఇక పాదయాత్ర ఎక్కువకాలం సాగదేమో అనే సందేహం నాకు కలిగింది.  

అయిదు వందల కిలోమీటర్ల మైలురాయి దాటాక నాకు సరికొత్త ఉత్సాహవంతుడైన  జగన్ కనిపించాడు.   మొదట్లో కనిపించిన అలసట, ఆయాసం, నీరసం స్థానంలో నవోత్సాహం, నూతన జవసత్వాలు కనిపిస్తున్నాయి.  జింకపిల్లలా జగన్ దూసుకుని వెళ్తుంటే, ఆయనను అనుసరించేవారికి ఇబ్బందికరంగా ఉన్నట్లు గోచరిస్తున్నది.  అమృతపానం చేసిన వాడిలా జగన్ నడక ఇప్పుడు దాదాపు పరుగుగా మారుతున్నది.  ఇదంతా సంకల్పబలం మాత్రమే.  

ఈ ఉత్సాహానికి నాకు తోస్తున్న హేతువులు:  
1 .  పాదయాత్రలో జనాదరణ విపరీతంగా పెరుగుతున్నట్లు కళ్ళకు కనిపిస్తుండటం 
2 .  తెలుగుదేశం నాయకులు ఎన్ని విమర్శలు చేసినా జనం పట్టించుకోకపోవడం 
3 . జగన్ యాత్రకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారన్న విషయాన్ని బీజేపీ అగ్రనాయకత్వం గుర్తించడం, అందుకు అనుగుణంగా నాయకుల స్వరాలూ మారడం 
4 .  ఎక్కడకు వెళ్లినా వేలాదిమంది ప్రజలు మంగళహారతులు పడుతుండటం 
5 .  అన్ని విషయాలలో చంద్రబాబు విఫలం అయ్యారన్న వాస్తవాన్ని ప్రజలు గ్రహించారన్న తృప్తి. 
6 . తాజాగా చంద్రబాబు దావోస్ వెళ్లి ఒత్తి చేతులతో తిరిగిరావడం 
7 . బీజేపీ-తెలుగుదేశం సంబంధాలు తెగబోతున్న దారాల్లా ఉండటం 
8 .  ప్రత్యేకహోదా కోసం తానిస్తున్న పిలుపుకు అపూర్వ స్పందన రావడం, ప్రత్యేక హోదా భావన ప్రజలలో ఇంకా జీవించి ఉన్నది అనే అభిప్రాయాన్ని కేంద్రంలో కలగజెయ్యడంలో సఫలం కావడం. 
9 .  రాబోయే రోజుల్లో తెలుగుదేశం నుంచి వైసిపిలోకి అనేకమంది నాయకులు చేరుతారన్న వార్తలు వస్తుండడం 
10 .  అన్నిటిని మించి 2014  కంటే ఇప్పుడు ప్రజాదరణ మరింతగా పెరుగుతన్న సంకేతాలు గోచరిస్తుండటం 

వెరసి...జగన్ అత్యంత ఉత్సాహంగా తన ప్రజాసంకల్ప యాత్రను కొనసాగిస్తూ నేటితో నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో 1000  కిలోమీటర్ల మార్కును అధిగమించబోతున్నారు.   ప్రజాసమస్యలు అనేవి మంత్రుల ఇళ్లలో డైనింగ్ టేబుల్ మీద కాకుండా, ప్రజలమధ్య ఉండి తెలుసుకోవాలి అని నిరూపిస్తున్న జగన్ కు అభినందనలు.
క్రెడిట్స్ : ఇలపావులూరి

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top