మహోత్సవంలా జగన్‌ నామినేషన్

పులివెందుల (వైయస్ఆర్‌ జిల్లా):

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమం ఓ మహోత్సవంలా సాగింది.‌ పులివెందుల పుర వీధుల్లో ఎటూ చూసినా జనమే జనం. కనుచూపు మేర జన కడలి తరంగం. శ్రీ జగన్మోహన్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా ఉదయం 7గంటలకే పులివెందుల వీధులు జనంతో నిండిపోయాయి. గ్రామీణ ప్రజానీకం పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలిరావడంతో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి.

భాకరాపురం నుంచి ప్రారంభమైన శ్రీ జగన్మోహన్‌రెడ్డి నామినేషన్ ర్యాలీ నాలుగు కిలోమీటర్ల‌ దూరం పోటెత్తిన జనసంద్రంలో, మండుటెండలో అప్రతిహతంగా కొనసాగింది. ఎండలు మండిపోతున్నా అభిమానజనం మాత్రం లెక్క చేయలేదు. దారి పొడవునా 'జై జగన్‌' నినాదాలు హోరెత్తాయి. ఆర్టీసీ బస్టాండు నుంచి పూలఅంగళ్లు సర్కిల్ వరకూ రహదారి కిక్కిరిసిపోయింది. వృద్ధులు, రైతులు, విద్యార్థులు, మహిళలు.. ఒకరేమిటి అన్ని వర్గాల ప్రజలూ శ్రీ వైయస్‌ జగన్‌ను చూసేందుకు, ఆశీర్వదించేందుకు, కరచాలనం చేసేందుకు తీవ్రంగా పోటీలుపడ్డారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి స్వగృహం నుంచి ఎన్నికల అధికారి కార్యాలయం వరకూ దారి పొడవునా జనం పూల వర్షం కురిపించారు. డప్పు వాయిద్యాల ముందు మహిళలు చిందులేశారు.

పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారిగా నామినేషన్‌ వేయడానికి వెళ్లిన శ్రీ జగన్ వెంట వై‌యస్‌ కుటుంబ సభ్యులు వైయస్ వివేకానందరెడ్డి, వై‌యస్ ప్రకా‌శ్‌రెడ్డి, వైయస్ ఆనందరెడ్డి, వై‌యస్ భాస్కరరెడ్డి, వై‌యస్ మనోహ‌ర్‌రెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, వై‌యస్ అవినా‌శ్‌రెడ్డి, వైయస్‌ కొండారెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యేలు అమర్‌నాథరెడ్డి, ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డితో పాటు, మూడున్నర దశాబ్దాలుగా అండగా నిలుస్తున్న ఆత్మీయులు ఆయనకు తోడుగా వచ్చారు.

నామినేషన్‌ వేసిన శ్రీ జగన్‌:
వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో పులివెందులలో రిటర్నింగ్ అధికారికి‌ తన నామినేష‌న్ పత్రాలు సమర్పించారు. పులివెందుల అసెంబ్లీ స్థానానికి పార్టీ అభ్యర్థిగా ఆయన మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ వేసే సమయంలో ఆయన వెంట వై‌యస్ వివేకానందరెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వై‌యస్‌ ప్రకాశ్‌రెడ్డి ఉన్నారు.

అఫిడవిట్‌లో శ్రీ వైయస్‌ జగన్ పొందుపరిచిన ఆస్తుల వివరాలు :
మొత్తం ఆస్తి రూ. 416.68 కోట్లు
 2012-13లో ఆదాయం
 ‌శ్రీ వై‌యస్ జగన్మోహన్‌రెడ్డి ఆదాయం రూ. 13,92,03,275
 శ్రీమతి వైయస్ భారతిరెడ్డి (సతీమణి) పేరిట రూ. 4,21,41,228
 మొత్తం ఆస్తులు :
శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పేరిట రూ. 371,79,75,863, ఆయన సతీమణి శ్రీమతి వైయస్ భారతిరెడ్డి పేరిట రూ. 44,88,55,688 కలిపి మొత్తం రూ. 416,68,31,551 ఆస్తులు ఉన్నట్లు అఫిడవి‌ట్‌లో పొందుపరిచారు.
ఇందులో చరాస్తులు
శ్రీ జగన్ పేరిట రూ. 313,98,30,322.
‌సతీమణి శ్రీమతి భారతి పేరిట రూ. 57,73,56,006.
కుమార్తెలు హర్షిణిరెడ్డి పేరిట రూ. 5,69,564.
వర్షారెడ్డి పేరిట రూ. 2,19,901 ఉన్నాయి.

చరాస్తుల్లో ముఖ్యమైనవి :
నగదు :

శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి వద్ద నగదు రూ. 39,440.
సతీమణి శ్రీమతి భారతిరెడ్డి వద్ద రూ. 45,529.
బంగారు ఆభరణాలు :
శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి వద్ద వ్యక్తిగతంగా 667.300 గ్రాముల బంగారు, వజ్రాల ఆభరణాల విలువ రూ. 28,11,437.
ఆయన సతీమణి శ్రీమతి వైయస్‌ భారతిరెడ్డి వద్ద 9277.082 గ్రాముల బంగారు, వజ్రాల ఆభరణాల విలువ రూ. 5,69,19,751.

వివిధ సంస్థల్లో పెట్టుబడులు :
శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పేరిట రూ. 307,27,42,795.
శ్రీమతి వైయస్ భారతిరెడ్డి పేరిట రూ. 46,56,15,794‌.
 స్థిరాస్తులు :
వ్యవసాయ భూములు, వ్యవసాయేతర స్థలాలు, వాణిజ్య భవనాలు, నివాస భవనాలు అన్నీ కలిపి ఆస్తుల వివరాలు.
శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పేరిట రూ. 30,02,10,668.
శ్రీమతి వైయస్ భారతిరెడ్డి పేరిట రూ. 14,86,45,020‌.
మొత్తం...రూ. 44,88,55,688.

పన్ను బకాయి వివరాలు :
ప్రభుత్వ సేవా పన్ను బకాయి రూ. 3,94,375.
ప్రభుత్వ బకాయిలపై వివాదమున్నవి
శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పేరిట రూ. 66,68,54,338.
సతీమణి శ్రీమతి వైయస్ భారతిరెడ్డి పేరిట రూ. 7,07,31,725 ఉన్నాయి.
 కేసులు‌ :
సీబీఐ అభియోగాలు 10 ఉన్నాయి. కమలాపురం కోర్టులో ఒక కేసు విచారణ దశలో ఉంది. ఈడీ కేసుతో పాటు మరో మూడు కేసులు ఎఫ్‌ఐఆర్ దశలో పెండింగ్‌లో ఉన్నాయి.

Back to Top