రాజ్యాంగం పట్టదా..!

హైదరాబాద్: ప్రతిపక్ష వైెఎస్సార్సీపీ మీద పగ
బట్టిన తెలుగుదేశం కక్ష సాధించుకొనేందుకు బాగా తెగిస్తోంది. ఇందుకోసం
రాజ్యాంగం విలువలకు పాతర వేస్తోంది. వైఎస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యే రోజాను
ఏడాదిపాటు సస్పెండ్ చేసి, కక్ష తీర్చుకొనే ప్రయత్నంచేస్తోంది. ఇందుకోసం
రాజ్యాంగ స్ఫూర్తిని సైతం తుంగలోకి తొక్కుతోంది.
వాస్తవానికి
అసెంబ్లీ సమావేశాలకు ఒక సభ్యుడు 60 రోజుల పాటు సమాచారం లేకుండా
రాకపోయినట్లయితే ఆ సభ్యుడు లేక సభ్యురాలు తన సభ్యత్వాన్ని కోల్పోతారు.
అటువంటప్పుడు ఎమ్మెల్యే రోజా విషయంలో ఏం జరగబోతుంది..ఇదే వంకతో ఆమెను
శాశ్వతంగా సభ్యత్వానికి దూరం చేసే కుట్రలకు పాల్పడతారా అన్న అనుమానాలు
కలుగుతున్నాయి.
మరో వైపు ఒక నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే
లేకుండా ఆరు నెలలకు మించి ఉండకూడదు. కానీ, ఇప్పుడు రోజా కు జీతం, భత్యం ఏమీ
ఇచ్చేది లేదు, ఆమె క్వార్టర్స్ కూడా ఖాళీ చేయాల్సిందే. అమె ఒక సాధారణ మహిళ
మాత్రమే అని శాసనసభ వ్యవహారాల మంత్రి అంటున్నారు. అంటే ఈ లెక్కన నగరి
నియోజక వర్గ ప్రజలకు ప్రాతినిద్యం లేకుండా ఏడాది పాటు ఉంచాలని ప్రభుత్వం
ఫిక్సు అయిందన్న మాట. ఒక నియోజక వర్గం ప్రజలకు ఉండే హక్కుని ఈ రకంగా
కాలరాయటం రాజ్యాంగ ఉల్లంఘన కింద రాదా.
ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం తన మొండి వైఖరిని కొనసాగిస్తోంది. 
Back to Top