సర్కార్ కు హైకోర్టు మొట్టికాయలు

 

నాలుగేళ్ల నారా వారి పాలనలో అవినీతి ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. అయితే బలచక్రవర్తిని వామనుడు పాతాళానికి అదిమినట్టు హైకోర్టు
మెట్టికాయలు వేస్తూ చంద్రబాబు ప్రభుత్వాన్ని కాస్తైనా కంట్రోల్లో ఉంచింది. ఓ పక్క ఎపి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్, మరో పక్క రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం బాబు భాగోతాలను భరతం
పడుతూనే ఉన్నాయి.

బసవతారకం కిట్ బంద్

ప్రభుత్వాసుపత్రుల్లో బాలింతలకు ఇచ్చేందుకు టిడిపి ప్రభుత్వం
ప్రకటించిన బసవతారకం మదర్ కిట్ పథకాన్ని నిలిపేయమంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ పథకంలో టెండర్లు ఖరారు చేసిన ప్రక్రయ అంతా నిబంధనలకు విరుద్ధంగా
ఉందని మాయరిన్ అనే సంస్థ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. మదర్ కిట్ లో అందించే సామాగ్రికి సంబంధించిన నమూనాలను ముందు
సంస్థలు జాతీయ కార్పొరేషన్ కు పంపాలి. కార్పొరేషన్ ఇచ్చే నివేదికను బట్టి ఆ సంస్థకు టెండరు ఖరారు చేయాలా
వద్దా అనే నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలి. కానీ చంద్రబాబు సర్కార్ ఇవేమీ లేకుండానే పవన్ శిల్క్, అనిత టెక్స్ అనే కంపెనీలకు కోట్ల విలువైన టెండర్లు ఖరారు చేసేసింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున చంద్రబాబు అట్టహాసంగా ప్రారంభించిన
ఈ కిట్ల పంపిణీని నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించడంతో పథకం అమలు అర్థంతరంగా నిలిచిపోయింది.

నాలుగేళ్లుగా మొట్టికాయలే

ఇదే కాదు గతంలోనూ చాలా సార్లు బాబుగారు హైకోర్టుతో గట్టిగానే
చివాట్లు వేయించుకున్నారు. రాజధాని భూములను స్విస్ ఛాలెంజ్ విధానంలో కట్టబెట్టడంపై హైకోర్టు
స్టే విధించింది. దేశీయ సంస్థలను
కాదని విదేశీ సంస్థలకు నిర్మాణ పనులు కట్టబెట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలై పిటీషన్ ను
విచారించిన ధర్మాసనం స్విస్ ఛాలెంజ్ ను నిలిపేయాలని చంద్రబాబు సర్కార్ కుఆదేశాలిచ్చింది. రాజధాని పేర అడ్డగోలు భూ సమీకరణ పై కూడా హైకోర్టు స్టే విధించింది. రైతులకు ఇష్టం లేకుండా ప్రభుత్వాలు బలవంతంగా పంట పొలాలను ఎలా
లాక్కుంటారని ప్రశ్నించింది.

సదావర్తి భూముల వ్యవహారంలోనూ ప్రభుత్వానికి హైకోర్టు బాగా అక్షింతలేసింది. కారుచౌకగా సదావర్తి భూములను సొంత వాళ్లకు కట్టబెట్టే యత్నాన్ని
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ బట్టబయలు చేసింది. వెయ్యి కోట్లు పైనే ఉన్న సదావర్తి భూములను22 కోట్లకే అమ్మేయడం, అది కూడా టిడిపి నేతలు, వారి బినామీలే కావడాన్ని కూడా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల
రామకృష్ణారెడ్డి తప్పు పడుతూ కోర్టును ఆశ్రయించారు. కానీ చంద్రబాబు మాత్రం ఆ భూములు అంత విలువ చేయవని, 5 కోట్లు ఎక్కువ ఇచ్చిన వాళ్లకు ఆ భూములు అప్పగించేస్తామని సవాల్
చేసాడు. ఎమ్మెల్యేఆళ్ల అందుకు ఒప్పుకోవడంతో
బాబు పని కుడితిలో పడ్డ ఎలుక చందాన అయ్యింది.

పరిశ్రమలను ఎపి ప్రభుత్వం, అధికారులు కలిసి వేధిస్తున్న తీరుపై కూడా హైకోర్టు ఘాటుగా స్పందించింది. నెల్లూరు జిల్లా చెవిరెడ్డి పల్లె స్పిన్నింగ్ మిల్ కేసులో ధర్మాసనం
ఎపి ప్రభుత్వాన్ని ఉతికి ఆరేసింది. పెట్టుబడుల కోసం దేశాలన్నీ తిరుగుతున్నారు, కానీ ఇక్కడున్న పరిశ్రమలను మాత్రం పట్టించుకోరు. వేధింపులకు గురిచేస్తున్నారు. ఇలా అయితే పెట్టుబడులు ఎలా వస్తాయని సీరియస్ అయ్యింది. అధికారుల నిర్లక్ష్యాన్ని ఉపేక్షిస్తున్న ప్రభుత్వానిదే అపరాధం
అని, కలెక్టర్
చెప్పినా తాసిల్దార్ వినని పాలన ఇక్కడే చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేసింది.

విద్యార్థుల ఆత్మహత్యలు, యూనివర్సిటీల్లో వేధింపులు, రోడ్డు ప్రమాదాలు, అవినీతి అంశాలు, అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ విధానాలు ఇలా ఎన్నో సందర్భాల్లో హైకోర్టు ఎపి ప్రభుత్వానికి
చురకలు అంటిస్తూనే ఉంది. చంద్రబాబు సర్కార్ రాజ్యాంగ విరుద్ధమైన, చట్ట విరుద్ధమైన నిర్ణయాలన్నిటినీ తూర్పారపడుతూనే ఉంది. ప్రజా స్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతిపక్షం, న్యాయస్థానం ఎంత ముఖ్యమో ఎపిని చూస్తే అర్థం అవుతుంది అనుకుంటున్నాయి
పొరుగు రాష్ట్రాలు. ఎపిలో ప్రతిపక్షం
లేకున్నా, చంద్రబాబు
తప్పులను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లకున్నా రాష్ట్రం ఇంకా అధ్వాన్నంగా తయారయ్యేదని
భావిస్తున్నారు తెలుగు ప్రజలు.

త్వానికి చురకలు అంటిస్తూనే ఉంది. చంద్రబాబు సర్కార్ రాజ్యాంగ విరుద్ధమైన, చట్ట విరుద్ధమైన నిర్ణయాలన్నిటినీ తూర్పారపడుతూనే ఉంది. ప్రజా స్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతిపక్షం, న్యాయస్థానం ఎంత ముఖ్యమో ఎపిని చూస్తే అర్థం అవుతుంది అనుకుంటున్నాయి
పొరుగు రాష్ట్రాలు. ఎపిలో ప్రతిపక్షం
లేకున్నా, చంద్రబాబు
తప్పులను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లకున్నా రాష్ట్రం ఇంకా అధ్వాన్నంగా తయారయ్యేదని
భావిస్తున్నారు తెలుగు ప్రజలు.

 

 

 

Back to Top