రూపాయి లేని కోటీశ్వరులు


చంద్రబాబు చేతిలో చిల్లిగవ్వ ఉండదు. చేతికి వాచీ ఉండదు. వేలికి ఉంగరం ఉండదు. కానీ వాళ్లావిడ నారా భువనేశ్వరి మాత్రం భారతదేశపు వెయ్యికోట్ల ఆస్తిపరుల జాబితాలో ముందువరసలో ఉంటుంది. చంద్రబాబు ఆస్తుల ప్రకటనలో ఏటికేడాది కోతలుంటాయి. ఏటా ఏపుగా పెరిగే అప్పులుంటాయి. కానీ అదేమి విడ్డూరమో హెరిటేజ్ షేర్లు అమాంతం ఆకాశంలోకి దూసుకుపోతుంటాయి. పాలు, కూరలు అమ్ముకునే కుటుంబం కోట్లకు పడగెత్తగలదని, కోట్లతో ఓట్లు కొనే స్థాయికెదగగలదని రేపు తెలుగు పాఠాల్లో స్ఫూర్తిపాఠంగా రాయించుకుంటారేమో? 
దేశంలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు, దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఆయన భార్య నారా భువనేశ్వరి పేర్లు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్నాయి. అయినా సరే చంద్రబాబు బీదరుపులు మానరు. హెరిటేజ్ లో మజ్జిగ తాగి బతుకుతున్నా తప్ప కడుపుకు తిండి కూడా తినడం లేదని కన్నీళ్లు కార్చగలరు. 
చంద్రబాబు అక్రమ ఆస్తులు, అవినీతి వ్యవహారాలు, బినామీ ఆస్తులు, భూ ఆక్రమణల మీద కొన్నేళ్ల క్రితం వైఎస్ విజయమ్మ కోర్టులో పిటీషన్ వేసారు. సుజనా చౌదరి, సిఎం రమేషలతో బాబు వ్యాపార సంబంధాలు, ఏలేరు కుంభకోణం, అక్రమార్జనలు, చిత్తూరు డెయిరీని నాశనం చేసి హెరిటేజ్ కు లాభాలు తెచ్చిపెట్టిన విషయాలన్నీ అందులో స్పష్టంగా ఉన్నాయి. సింగపూర్ లో హోటళ్లు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరుతో సాగిన అక్రమాల గురించి ఆ పిటీషన్ లో వివరంగా రాసారు. ఈ పిటీషన్ ను విచారణకు తీసుకున్న కోర్టు చంద్రబాబుతో పాటు మరో 13 మందిపై విచారణకు ఆదేశించింది. నారా భువనేశ్వరి, ఆమె కంపెనీలు, లోకేష్, రామోజీరావు, ఆయన కంపెనీలు, వైఎస్ చౌదరి, మురళీ మోహన్, సిఎం రమేష్ వ్యక్తిగత ఆస్తులపై విచారణ కు ఆదేశించింది హైకోర్టు. ఆ సమయంలోనే లక్ష్మీపార్వతి సైతం చంద్రబాబు అవినీతికి అంతులేదంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. 
హోం శాఖ కార్యదర్శి, డిజిపి, సిబిఐ డైరెక్టర్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సెబిలు విడివిడిగా విచారించి స్వతంత్య్ర నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నోటీసులివ్వకుండా విచారణకు ఎలా ఆదేశిస్తారంటూ విరుచుకుపడ్డాడు. సిబిఐ విచారణకు సిద్ధమా అని అడిగితే నోరెత్తకుండా తప్పించుకున్నాడు. 
 
Back to Top