() పుష్కర శోభను సంతరించుకొన్న కృష్ణవేణమ్మ() బిర బిర పరుగులిడుతున్న కృష్ణమ్మ లో పుణ్యస్నానాలు() భక్తులకు పార్టీ తరపున శుభాకాంక్షలుపుష్కరం అంటే నీరు పోషయతీతి పుష్కరం. సమస్త ప్రాణకోటిని పోషించేది నీరు. అందుకే హైందవ సంస్క్రతిలో నీటికి అంతటి ప్రాధాన్యం దక్కుతుంది. అందుకే ఆపోవా ఇదగ్ సర్వమ్ అని ప్రతీరోజూ ప్రార్థిస్తుంటారు. అంటే ఈ సమస్త ప్రపంచం జల స్వరూపం అని, నీరే అంతటికీ మూలాధారం అని చెబుతోంది. అందుకే నదుల్ని కొలిచేందుకు, నీటి ప్రాధాన్యం తెలియపరిచేందుకు పుష్కరాల వంటి క్రతువులు రూపుదిద్దుకొన్నాయని చెబుతారు.పుష్కర ప్రాధాన్యంపూర్వం తుందిలుడు అనే మహానుభావుడు పరమ శివుని గూర్చి తపస్సు చేశారు. పరమ శివుడు అష్ట మూర్తుల్లో ఒకటైన జల రూపంలో ఉండేట్లుగా వరం సాధించాడు. దీంతో తుందిలుడు 32 కోట్ల తీర్థాలకు ప్రభువు అయ్యాడు. తర్వాత కాలంలో భగవంతునిలో ఐక్యం అయ్యి పుష్కరునిగా ప్రసిద్ధి కెక్కాడు. ఆ తర్వాత కాలంలో స్రష్టి ప్రారంభ కాలంలో పరమ శివుడ్ని తన కమండలంలో ఉంచుకొని బ్రహ్మ స్రష్టి చేయటం ప్రారంభించాడు. అందుకోసం పుష్కరుని రూపంలో పరమశివుడు కమండలంలో వశిస్తాడు. అదేసమయంలో బ్రహ్మతో కూడి బృహస్పతి పుష్కరుడ్ని ఆవాహన చేస్తాడు. ఫలితంగా పుష్కరుడు జల రూపంలో బృహస్పతితో కలిసి ప్రయాణిస్తుంటాడు. అప్పటి నుంచి బృహస్పతి తో కలిసి పుష్కరుడు అంటే పరమ శివుడు సాగుతుంటాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం బ్రహస్పతి ఏడాదికి ఒక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆయనతో పాటే ఆ రాశితో అనుబంధం ఉన్న నదిలోకి పుష్కరుడు అంటే పరమ శివుడు ప్రవేశిస్తాడు. అలాగే కన్య రాశిలోకి ప్రవేశించినప్పుడు పుష్కరుడు అంటే పరమశివుడు క్రిష్ణా నదిలో ప్రవేశిస్తాడు. ప్రారంభ కాలంలో మరియు అంత్య కాలంలో పుష్కరుడు వశిస్తాడు.విధి విధానాలుపుష్కర పుణ్య కాలంలో పరమ శివుడ్ని, మహా విష్ణువుని ఆరాధిస్తారు. జల రూపంలో శివుడ్ని అర్చించేందుకు పుణ్య స్నానాలు ఆచరించాలి. నదీమతల్లి అనుమతి తీసుకొని నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి నమస్కరించి సంకల్పం చేయాలి. తర్వాత పుణ్యస్నానం చేసి నదికి అర్చన చేయాలి. అనంతరం పిత్ర తర్పణాలు, పిత్ర కర్మల్ని ఆచరించాలి. పెద్ద వారికి ప్రీతి కల్గేట్లుగా పిండ ప్రదానం చేయించాలి. వీలున్నంత వరకు సమీపంలోని దేవాలయాల్ని దర్శించి అర్చన చేయించాలి.