ఆంధ్రప్రదేశ్ బహుళ ప్రయోజన కారి అనదగ్గ ప్రాజెక్టు ఏదైనా ఉందీ అంటే అది పోలవరం ప్రాజెక్టు మాత్రమే. కానీ, అటువంటి ప్రాజెక్టు పూర్తి కావటం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఏమాత్రం ఇష్టం లేదు. కమీషన్లు రాల్చే పట్టిసీమ ఎత్తిపోతల పథకం కోసం పోలవరం ను బలిపెట్టేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా మార్చటంతో అక్కడ పనుల్ని ఎప్పటికప్పుడు కేంద్రం పర్యవేక్షిస్తోంది. అక్కడ కేంద్రం తరుపున పనిచేస్తున్న సీఈవో కుమార్ అనే సీనియర్ ఐఏఎస్ అధికారిని ఆకస్మికంగా బదలీ చేయటంతో అనుమానపు మేఘాలు ముసురుకొన్నాయి. మరి ముఖ్యంగా కుమార్ ను అత్యవసరంగా రాష్ట్ర సర్వీసులకు పిలిపించటం ఈ అనుమానాల్ని మరింత పెంచుతోంది. కేంద్రం రాసిన ప్రోగ్రెస్ లేఖ మాత్రం చంద్రబాబు ప్రభుత్వానికి చెమటలు పట్టించింది.ముఖ్యంగా కేంద్రం నుంచి వచ్చిన లేఖలో మూడు పాయింట్లు ప్రధానంగా ఉన్నాయి.మొత్తం వర్కు లో ఈ ఏడాది జనవరి నుంచి మే నెలాఖరు దాకా జరిగిన పనిని బేరీజు వేసుకొంటే కేవలం 2 శాతం పని మాత్రమే పూర్తయింది. ముఖ్యంగా ఎర్త్ వర్క్ తప్ప ఇతర పనులేమీ ముందుకు సాగటం లేదని కుండ బద్దలు కొట్టి చెప్పటం జరిగింది.కుడి వైపు ప్రధాన కాల్వలో ఏడు ప్యాకేజీలుగా పనిని విడగొట్టారు. ఇందులో 2 ప్యాకేజీల్లో మాత్రమే పని జరగుతోంది. మిగిలిన వాటిల్లో అంత శూన్యమే.ఎడమ వైపు ప్రధాన కాల్వలో పనిని 8 ప్యాకేజీలుగా విడగొట్టారు. ఇందులో రెండు ప్యాకేజీల్లో మాత్రమే కాస్తో కూస్తో పని నడుస్తోంద. మిగిలిని వాటి గురించి చెప్పుకోకపోవటం ఉత్తమం.పోలవరం పనుల్లో ఎప్పుడు ఏం జరుగుతోంది. ఎందుకు పెండింగ్ పెడుతున్నారు అనే విషయాల్ని కుమార్ నివేదిక రూపంలో కుండ బద్దలు కొట్టారు. దీంతో ఎప్పటికి అయినా ఆయన కొంప ముంచుతారు అన్న భయంతో చంద్రబాబు ప్రభుత్వం పావులు కదిపింది. ఆయన్ని అక్కడ నుంచి తప్పించేట్లుగా చేసి ఊపిరి పీల్చుకొంది.