పచ్చ యంత్రాంగం..కొత్త మంత్రాంగం.. ఏపీలోకి సీబీఐ నో ఎంట్రీ
చంద్రబాబు భయంతో కూడిన వ్యూహం..
అసలు కథ ఇదే...

వ్యవస్థలను మేనేజ్‌ చేసే చంద్రబాబు.. ఆ వ్యవస్థలను నాశనం చేయడానికి కూడా వెనుకంజ వేయడని  మ‌రోమారు రుజువైంది. ఇందుకు తాజాగా ఏపీలో ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం తేటతెల్లం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు లేకుండా సీబీఐ దర్యాప్తు చేయడానికి వీలులేదనే  నిర్ణయం ద్వారా మరో సారి ప్రజాస్వామ్యాన్ని నిలువునా పాతరేసేశారు. సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా అడ్డుకట్ట వేయడానికి అసలు కథ ఏమిటంటే భయంతో కూడిన వ్యూహం.. సీబీఐ అంటే చంద్రబాబు ఎందుకంత భయపడుతున్నారో వాస్తవం సామాన్య ప్రజలకు సైతం తెలియనిది కాదు. తనను తాను రక్షించుకోవడం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తాడనే ప్రచారం ఉంది. అందితే కాళ్లు..అందకపోతే జుట్టు పట్టుకునే రకం చంద్రబాబు అనే ఘన కిర్తీ ఆయ‌న‌కు ఉంది. ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై మేధావులు సైతం విస్తుపోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రపదేశ్‌..భారత్‌లో అంతర్భాగం కాదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని మేధావులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా తప్పుబడుతున్నారు. తప్పుచేశారు కాబట్టే సీబీఐ అంటే టీడీపీ భయపడుతుందని స్పష్టమవుతోంది. స్వతంత్ర ప్రతిపత్తి కలిసిగి సంస్థ అయిన సీబీఐని గతంలో పెంపుడు కుక్కలా వాడుకున్న చంద్రబాబుకు ఇప్పుడు సీబీఐ అంటేనే చెమటలు పడుతున్నాయి. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం చేసిన కుట్రదారులు బయటకొస్తారనే చంద్రబాబు కొత్త నాటకానికి తెరతీశారు. 

వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై థర్డ్‌ పార్టీ విచారణకు ఆదేశిస్తారేమోనని బాబుకు భయం పట్టుకుంది. హత్యాయత్నం కేసు దర్యాప్తు హైకోర్టు సీబీఐకి అప్పగించే అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు వేసిన ఎత్తుగడలో భాగమే ఇది. సీబీఐ విచారిస్తే దొరికిపోతామన్న భయంతో బాబు అండ్‌ కో నడుపుతున్న రాజకీయాల్లో  ఒక తప్పును సరి చేసుకోవడానికి మరో తప్పు చేస్తున్నారు.టీడీపీ నేతలపై ఐటి దాడులను రాష్ట్రంపై దాడులుగా ప్రచారం చేసుకున్న చంద్రబాబు వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎక్కడ దొరికిపోతామనే భయంతో తన పచ్చ యంత్రాంగంతో ప్రజాస్వామ్యానికి తూట్లు పోడిచే మంత్రాంగం పన్నారు. 

ఏపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది.పథకాల్లో భారీ అవినీతి,  పోలవరం అవినీతిపై విపక్షాలు సీబీఐ దర్యాప్తు కోరడం, ఇసుక, భూ కుంభకోణాల్లో పీకల్లోతు మునిగిన చంద్రబాబు అభద్రతా భావంతో ఉన్నారు. దేశం కోసం అంటూ ఢిల్లీలో చక్కర్లు కొడుతున్న చంద్రబాబు అసలు వ్యూహం తనను తానను రక్షించుకోవడమే తక్షణ కర్తవ్యంగా ముందుకు సాగిపోతున్నారు. సిబీఐ మరక పడటంతో దీనిని సాకుగా తీసుకుని తద్వారా రాజకీయంగా తాను పబ్బం గడుపుకునేందుకు ఏపీలో చంద్రబాబు సర్కార్ ఛీప్‌ ట్రిక్స్‌ ప్రయోగిస్తోంది.


Back to Top