నాలుగేళ్లకే చంద్రబాబును జనం తిరస్కరించారు


– సర్వేలో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత 
– అవినీతి, హోదాపై యూటర్న్‌లను ఖండించిన జనం
– ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్‌కు ఓటేస్తామని 42 శాతం మంది మద్దతు
– చంద్రబాబుకు 30 శాతం మంది మద్దతు
– రాజధాని నిర్మాణంలో బాబు అనుభవం ఉపయోగపడలేదు: 58 శాతం మంది

చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ప్రజలు సర్వే రూపంలో బయటపెట్టారు. ఒక ప్రముఖ ఇంగ్లిషు పత్రిక నిర్వహించిన సర్వేలో జనం బాబు పాలనపై తీవ్రంగా స్పందించారు. ప్రత్యేక హోదాపై బాబు యూటర్న్‌లు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, రాజధాని నిర్మాణంలో విఫలం కావడం, కేసుల్లో ఇరుక్కుని హోదాను తాకట్టు పెట్టడం, ఏడాదిలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న బీజేపీ మీద నెట్టేందుకు ఆ పార్టీతో తెగదెంపులు చేసుకోవడం... ప్రభుత్వంలో లోకేష్‌ ఇన్‌వాల్వ్‌మెంట్‌.. తదితర ప్రశ్నలకు జనం చంద్రబాబుకు దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవర్ని సీఎం ఎన్నుకుంటారంటే చంద్రబాబుకు కేవలం 30 శాతం మంది మద్ధతు తెలపగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దాదాపు 45 శాతం మంది ఓటేశారు. పార్టీ ఫిరాయింపులను 80 శాతం మంది వ్యతిరేకించారంటô నే తెలుస్తుంది.. బాబు చేసిన పనిని ప్రజలు ఎంతగా చీదరించుకుంటున్నారో.. అభివృద్ధిని చూసి పార్టీలోకి వస్తున్నారని చంద్రబాబు ఒకపక్క ప్రచారం చేసుకుంటున్నా... జనం ఏమాత్రం నమ్మలేదని అర్ధమైంది. ప్రత్యేక హోదా పేరెత్తితే అరెస్టు చేస్తామని.. హోదాతో ఏమొస్తుందని.. హోదా కంటే ప్యాకేజీ బాగుందని చంద్రబాబు అన్న మాటలను ప్రజలు మర్చిపోలేదు. ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు విఫలమయ్యారా అంటే 76 శాతానికి పైగా అవుననే సమాధానం ఇచ్చారు. గత నాలుగేళ్లలో చెప్పుకోదగ్గ పథకాలు ఏవైనా చంద్రబాబు ప్రవేశ పెట్టారా అంటే కాదని 63 శాతం మంది లేదని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై వైయస్‌ఆర్‌సీపీ చేస్తున్న ఆరోపణలను నిజం ు చేస్తున్నట్టుగా ప్రజలు మద్ధతు పలికారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి పెరిగిందా అంటే 64 శాతం అవునని సమాధానం ఇచ్చారు. ఒకపక్క చంద్రబాబు తాను 80 శాతం ఎన్నికల హామీలు నెరవేర్చానని 98 శాతం మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పకుంటుండగా ప్రజలు మాత్రం చంద్రబాబు నాలుగేళ్ల పాలన ఏమాత్రం బాగాలేదని 57 శాతం మంది పేర్కొనడం విశేషం. ఓవరాల్‌గా చంద్రబాబును జనం నాలుగేళ్లకే తిరస్కరించారు. చంద్రబాబు పాలనపై విసుగెత్తిపోయారు. 
 

తాజా వీడియోలు

Back to Top